Tirumalagiri Sri Venkateswara Swamy Vari Devasthanam

ఆలయ చరిత్ర :
తిరుమలగిరిలోని ఆలయ పురాణ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల గ్రామంలోని కృష్ణా నదికి ఒడ్డున "భరద్వాజ" పేరు మీద ఉన్న ఒక కొండ రూపంలో అశోమమ్(గట్టు) ఉంది అని నమ్ముతారు. నిజానికి ఇది గుంటూరు జిల్లాలోని మదిపాడులో ఉంది.


ఒక సమయాన ఋషి భరద్వాజ శ్రీమన్నారాయణ సర్వజ్ఞుడని భావించి మానవుల ఆకాంక్షలు తీర్చడానికి నిరాడంబరమైన తపస్సుకు పూనుకున్నారు. తన తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు "పుట్ట" ఆకారములో తిరుమలగిరి కొండపై 12 నామములతో ప్రత్యక్షమైనారు.

అలా వెలిసిన శ్రీమన్నారాయణుడిని చూసి ఋషి భరద్వాజ చాల సంతోషంగా భావించాడు. ఆపై కృష్ణా నది నుండి నీరు తీసుకోని శ్రీమన్నారాయణుడికి అభిషేకము మరియు పూజలు నిర్వర్తించాడు. అప్పటి నుండి "భరద్వాజ గోత్రము “పారాయణ చేస్తూ రోజువారీ పూజలు జరిపేవాడు. ప్రతి చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు స్వామి వారికి కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం జరుపుతారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఉత్సవాల్లో పాల్గొనడానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు.

ఇక్కడి కోనేరు, ప్రభువు యొక్క పాదాల రూపములో ఉంటుంది. ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి వారికీ కాపలాగా కొండ చుట్టూ తిరుగుతూ ఉంటారని, భక్తుల నమ్మకం. ఈ ఆలయ ప్రాంగణములో వరాహ స్వామి వారు కూడా ఉన్నారు. దేవాలయము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరుకు ప్రతి రోజు తెరిచే ఉంచుతారు. సూర్యాస్తమయము తరువాత భక్తులు కొండ పైకి అధిరోహించడానికి మరియు స్వామి వారి దర్శనమునకు అనుమతించరు.

ఆలయం గురించి :
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి వద్ద ఉన్న ఒక చిన్న కొండపై ఉంది. ఈ ఆలయం  విజయవాడ నుండి 75 కి.మీ. దూరములో ఉంటుంది. ఈ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ తిరుమలగిరి వెంకటేశ్వర స్వామిని "నామాల వెంకటేశ్వర స్వామి" అని కూడా పిలుస్తారు. ఆలయ మార్గంలో కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాద ముద్ర కూడా ఉంది.

వెంకటేశ్వర స్వామి విగ్రహం 12 నామములతో “పుట్ట" ఆకారంలో ఉంటుంది, అందుచే ఈ ఆలయం "తిరుమలగిరి నామముల కొండ" అని కూడా పిలువబడుతుంది మరియు ఇక్కడ స్వామి వారు స్వయంభుగా వెలిశారని నమ్ముతారు. శ్రీ స్వామి కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి సమయంలో జరుపుకుంటారు. భక్తులు భారీ సంఖ్యలో వేడుకల్లో పాల్గొనడానికి సమీప గ్రామాలు మరియు ఇతర ప్రాంతాల నుండి కూడా వస్తారు.

శ్రీ స్వామి వారి దేవస్థానమునకు క్షేత్రపాలకుడిగా శ్రీ మల్లేశ్వర స్వామి వారు కొండపై కొలువై ఉన్నారు
దత్తత దేవాలయములు : శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్తానం, శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్తానం

ఆలయ సమయాలు:
ఆలయం ఉదయం 06:00 గంటల నుంచి సాయంత్రం 06:00 గంటల వరకు తెరచి ఉండును.

రవాణా :
By Road:
విజయవాడ నుండి జగ్గయ్యపేట వరకు ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్సు సౌకర్యం కలిపిస్తుంది. జగ్గయ్యపేట నుండి 15 కిలోమీటర్ల దూరములో ఈ ఆలయం ఉంది.

By Train:
జగ్గయ్యపేట నుండి దగ్గరగల రైల్వేస్టేషన్ మధిర రైల్వే స్టేషన్. మధిర రైల్వే స్టేషన్ జగ్గయ్యపేట నుండి  28 కిలోమీటర్ల దూరములో ఉన్నది.


By Air:
జగ్గయ్యపేట నుండి 95 కిలోమీటర్ల దూరములో విజయవాడ (గన్నవరం) జాతీయ విమానాశ్రయం ఉంది.

సంప్రదించండి :
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం,
తిరుమలగిరి, జగ్గయ్యపేట మండలం,
కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ -521 178
sri tirumalagiri lakshmi venkateshwara temple timings, tirumalagiri temple timings, venkateswara swamy temple near me, tirumalagiri temple jaggaiahpet andhra pradesh, kodad to tirumalagiri temple, kalyana venkateswara swamy temple, jp nagar timings, vedadri temple timings, tirumalagiri distance, tirumalagiri temple history telugu, venkateswaraswamy temple tirumalagiri.

Comments

Popular Posts