ఆలయ చరిత్ర :
ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలం, వల్లూరు గ్రామంలో శ్రీ వల్లూరమ్మ వారు కలకత్తా - చెన్నై రహదారికి పడమర వైపున, ఒంగోలు పట్టణమునకు దక్షిణముగా 8 కిలో మీటర్ల దూరంలో కలదు. పూర్వము వెంకటగిరి రాజులకు, సామంతరాజులైనా పెళ్ళూరు మందపాటి రాజులకు భేదాభిప్రాయాలు రాగా, పెళ్ళూరు మందపాటి రాజులపై యుద్ధము ప్రకటించారు. అట్టి సందర్భంలో మందపాటి రాజులు భయభ్రాంతులు కాగా,మందపాటి రాజులకు అద్దంకి రామచంద్రరావు అనే బ్రాహ్మణుడు( వీరి ఆస్థానంలో సలహాదారునిగా ఉండేవాడు. ఈయన బ్రహ్మచారి మరియు శక్తి ఉపాసకులు) సలహాపై యజ్ఞయాగాదులు చేసినట్లు, ఆ యజ్ఞహోమం నందు "శ్రీ ఉల్కాముఖి" అమ్మవారు ఉద్భవించినట్లు పెద్దలు చెబుతున్నారు. అలాగే "శ్రీ ఉల్కాముఖి" అమ్మవారిని అద్దంకి వారి ఆడపడుచు అని అంటారు. శ్రీ ఉల్కాముఖి అమ్మవారిని వల్లూరు గ్రామములోని వారందరూ భక్తి శ్రద్దలతో పూజించుట వలన ఉల్కాముఖి అమ్మవారు వల్లూరుకి అమ్మగా "వల్లూరమ్మ"గా నిలిచింది.
17వ శతాబ్దమున నలనామ సంవత్సరమున మార్గశిర శుద్ధ ఏకాదశినాడు చిన్నగుడి కట్టినట్లు, గుడి పై భాగము నందు అష్టాదళపద్మ శిలాఫలకంపై వ్రాసినారు. శ్రీ వెంకట నరసయ్య గారు ఈ గుడిని కట్టించినట్లు, ఈ శిలాఫలకం ద్వారా తెలియచున్నది. ఇచ్చటి అర్చకులు కశ్యపాత్రయాఋషి గోత్రికులు. నాటి నుండి నేటి వరకు దినదినాభివృద్ధి చెందుతూ ఈ వల్లూరమ్మ అమ్మవారి ఆలయం రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపులోనికి వచ్చినది.
ఇచ్చట అర్చన విధాన శైవ సాంప్రదాయ ప్రకారం జరుగుతున్నవి.
ఆలయం గురించి :
"శ్రీ వల్లూరమ్మ" అమ్మవారి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలులో వల్లూరు అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయం ప్రసిద్ధి చెందిన శక్తి దేవస్థానాలలో ఒకటి.ఈ ఆలయం ఒంగోలుకి 12కి.మీ ల దూరంలో నెల్లూరుకు వెళ్లే హైవేలో ఈ గ్రామం కలదు. చాలమంది భక్తులు అమ్మవారిని దసరా పండుగ సమయంలో ఎక్కువగా దర్శించుకుంటారు.
ఒంగోలుకు 8 కి మీ దూరంలో తూర్పు వైపున ఉన్నది. దసరా ఉత్సవాలలో చుట్టూ ప్రక్కల నగరాల నుంచి వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఒంగోలు నుండి వల్లూరమ్మా దేవస్థానం మధ్య పరిధిలో విస్తృత కొనుగోలు సౌలభ్యం లభించును.
ఈ ఆలయం ఒంగోలు నుండి 11 కి.మీ దూరంలో ఉంది. మోటారు వాహన ప్రయాణంలో 13 నిమిషాలలో వల్లూరమ్మ దేవాలయాన్ని చేరుకోవచ్చు.ఒక్కొక్కసారి బండి ప్రయాణము కన్నా బైకు ప్రయాణానికి పరిస్థితులు అనుగుణంగా ఉంటాయి. వల్లూరు గ్రామం లో "శ్రీ వల్లూరమ్మ " దేవత అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. భక్తులు వారి నమ్మకాలను మరియు కోరికలు నెరవేర్చుకోవడానికి మరియు వారిని చల్లగా కాచి కాపాడమని వల్లూరమ్మను పూజిస్తారు.
ఆలయ సమయాలు:
ఉదయం 06:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు మరియు మధ్యాహ్నం 01:30 గంటల నుండి 08:00 గంటల వరకు ఆలయం తెరచి ఉంటుంది.
రవాణా :
By Road:
ఈ ఆలయాన్ని చేరుకోవటానికి ఒంగోలు మరియు టంగుటూరు నుండి ఏ.పి.యస్ .ర్ .ట్.సి. బస్సులు అందుబాటులో కలవు.
By Train:
ఈ ఆలయానికి సమీపంలో సురారెడ్డిపాలెం మరియు ఒంగోలులో రైల్వే స్టేషన్స్ ఉన్నాయి.
By Air:
శ్రీ వల్లూరమ్మ ఆలయానికి 152 కిలోమీటర్ల దూరములో గన్నవరం జాతీయ విమానాశ్రయం కలదు.
సంప్రదించండి :
శ్రీ వల్లూరమ్మ అమ్మవారి దేవస్థానం,
వల్లూరు, ఆంధ్ర ప్రదేశ్, పిన్ కోడ్ - 523 272.
valluramma temple timings, valluramma temple phone number, valluramma ammavari tempple histroy telugu, valluramma temple, valluru, valluru temples.

Comments
Post a Comment