ఆలయ చరిత్ర :
భారతదేశంలో "మహిళలను గౌరవించే చోట, దేవతలు కొలువై ఉంటారు" అని చెబుతుంటారు. 17వ శతాబ్దంలో, శ్రీ రాజా వాసిరెడ్డి జగ్గా భూపాల కృష్ణ ప్రాంతంలో "అమరావతి" ని తన రాజధానిగా చేసుకొని పాలించేవారు. తన రాజ్యంలోని అనిగండ్లపాడు అనే గ్రామంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదంతో "కోల్లా" కుటుంబంలో తిరుపతమ్మ జన్మించింది. ఆమె ఏక "సంతాగ్రాహి" మరియు చిన్ననాటి నుండి రామాయణం, మహాభారతం ఇతర పురాణాలను అభ్యసించింది. ఆమె వాటిని పొరుగువారికి, ఊరిలోనివారికి భోదిస్తుండేది. ఆమె “కాకాని” కుటుంబానికి చెందిన, పెనుగంచిప్రోలు గ్రామంలోని గోపయ్యని వివాహం చేసుకొని, రెండు కుటుంబాలకి, ఆ ప్రాంతానికి తన భక్తితో కీర్తి తెచ్చిపెట్టింది.శ్రీ తిరుపతమ్మ ఒక భక్తురాలే కాక, ఒక మంచి గృహిణిలా తన భర్తతో కష్టసుఖాలను పంచుకొనేది. దాదాపు అన్ని పొరుగు గ్రామాల ప్రజలు గౌరవించేవారు, తనను శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంగా భావించేవారు. తను అత్తవారింట సంతోషంగా ఉన్నంతకాలం ఆ ప్రాంతం సిరిసంపదలతో అభివృద్ధి చెందాయి. ఆమె ప్రజల గౌరవాన్ని పొందడం చూసి ఆమె అత్తగారు మరియు ఆడపడుచు ఈర్ష చెందారు. దాని కారణంగా ఆమె వారినుండి కష్టాలను పొంది, తీవ్ర అనారోగ్యానికి గురైంది. అయినను తాను తన భర్త అయిన గోపయ్య దగ్గర తన శోకాన్ని చెప్పుకొనేది కాదు. కర్మ యోగాన్ని నమ్మి అత్యంత ఓర్పుతో తట్టుకొనేది.ఆమె అనారోగ్యంతో ఆ ప్రాంతంలో కరువు సంభవించింది. మానవులకు భయంకరమైన ఆహార సమస్యలు లేనప్పటికీ, ఆవుల మందలకు మాత్రం పచ్చిక గడ్డిలేక చాలా ఇబ్బంది పడ్డాయి. కరువు కారణంగా గోపయ్య ఆవుల మేత కోసం ఆవులమందతో పాటు ఉత్తర అరణ్య (భద్రాచల ప్రాంతం) ప్రాంతానికి వెళ్ళాడు. శ్రీ తిరుపతమ్మకు కుష్టు వ్యాధి రావడంతో ఆమె అత్తవారు ఆమెను ఇంట్లోకి రానివ్వకుండా ఆవుల కొట్టంలో వదిలేశారు. ఆమె తల్లిదండ్రులు ధనికులు, వారు ఆమెను తమ ఇంటికి రమ్మని పిలిచినా ఆమె వారి అభ్యర్ధనను తిరస్కరించింది. తన భర్త అనుమతిలేనిదే తాను రానని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు ఏమి చెయ్యలేక వెళ్లిపోయారు. ఆ సమయంలో శిష్యులలో ఒకరైన పాపమ్మ, తిరుపతమ్మనకు ప్రేమ మరియు ఆప్యాయతలతో సేవ చేసింది. ఇలా మిగిలిన జీవితకాలం అంతా తిరుపతమ్మకు పాపమ్మ సేవ చేస్తూనే ఉండేవారు.ఉత్తర అరణ్యంలో, గోపయ్య ఆవుల పోషణ చూస్తూనే, తనతోటి గోపాలకులకు రామాయణ మరియు మహాభారత ఇతిహాసాలను భోధించేవాడు. భద్రాద్రి రామయ్య దర్శనం చేసుకున్నాడు. గోపయ్య ఉత్తర అరణ్య ప్రాంత అందాలకు ముగ్దుడైపోయాడు. అప్పుడు గోపయ్య తాను పెనుగంచిప్రోలుకి వెళ్ళాక, తిరిగి తన భార్య అయిన తిరుపతమ్మతో వచ్చి భద్రాద్రి రామయ్య దర్శనం చేసుకోవలెనని అనుకున్నాడు .
కానీ ఆవులు మేత మేస్తుండగా, ఒక పులి గోపయ్య మీద దాడి చేసింది. ఆ దాడిలో గోపయ్య మరణించాడు. ఆ విషయం తన దివ్యదృష్టితో తెలుసుకున్న తిరుపతమ్మ, తన భర్త యొక్క అవశేషాలతో యోగాగ్నిలో ప్రవేశించాలనుకుంది. ఆమె తన శక్తులు చూపడంతో ఊరిపెద్దైన శ్రీ కొమర్రాజు శ్రీశైలపతి మరియు కరణం శ్రీ కార్ల ముత్యాల నాయుడు ఆమెయొక్క యోగాగ్ని ప్రేవేసానికి అనుమతించారు. ఆమె తన చివరి ఉపన్యాసాన్ని యోగాగ్ని నుంచి ఇచ్చింది, గ్రామస్థులకు భక్తి, కర్మ, జ్ఞాన, వైరాగ్య మరియు మోక్ష మార్గాల గురించి బోధించెను, మహిళల గౌరవమే ఏ ప్రాంతానికైనా సౌభాగ్యమని తెలియ జేసెను .తిరుపతమ్మ తన యోగాగ్ని ప్రవేశం తర్వాత, తాను బండారు(పసుపు) తో పాటు విగ్రహ రూపంలో కనిపిస్తానని చెప్పినది. ఆమె తన శిష్యులకు గోపయ్యను మాఘ పౌర్ణమి రోజు సూర్యుడు ఉదయించే సమయానికి, తనను మాఘ పౌర్ణమి రోజు చంద్రుడు ఉదయించే సమయానికి చూడగలరని ఆశీర్వదించింది. ఆ ఊరు పెద్ద అయిన శ్రీ శ్రీశైలపతిని గుడి కట్టించమని చెప్పి ఆజ్ఞాపించి, తన శిష్యురాలైన పాపమ్మ మరియు ఆమె వారసులు అర్చకులవుతారని తెలియచేసినది. చివరికి ఆమె తన భర్త అవశేషాలతో యోగాగ్నిలో తనకు తాను ఆహుతి అయినది. మరునాడు (సతి దేవిలా) శ్రీ తిరుపతమ్మ మరియు గోపయ్యల విగ్రహాలు యోగాగ్నిలో దొరికాయి. వాటిని మొదట పాపమ్మ గుర్తించింది, ఆ ఊరి పెద్ద అయిన శ్రీ శ్రీశైలపతి యోగాగ్ని ప్రవేశంలో ఆలయాన్ని నిర్మించారు.యోగాగ్ని ప్రవేశం జరిగిన మూడవ రోజున, ఉత్తర అరణ్యంలో గోపయ్యను చంపిన పులి, యోగాగ్ని ప్రదేశానికి వచ్చి, ప్రదక్షణలు చేసి, దాని వెనుక భాగాన ఊపిరి విడిచింది. ఊరి పెద్దయిన శ్రీ శ్రీశైలపతి, ఆ పులి మరణించిన చోటున శ్రీ పెద్దమ్మ ఆలయాన్ని నిర్మించాడు. యోగాగ్ని ప్రవేశం తర్వాత 1695లో తిరుపతమ్మను దేవతగా పూజించసాగారు.
ఆలయం గురించి :
శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నందు గ్రామ దేవత ఆగమము ప్రకారం పూజా కార్యక్రమములు నిర్వహించడం జరుగుచున్నది.
మన రాష్ట్రములో ప్రముఖ దేవలయములలో ఒకటిగా విరాజిల్లే శ్రీ తిరుపతమ్మ గోపయ్యస్వామి దివ్వ దంపతుల క్షేత్రం మహిమాన్వతమైనది. శ్రీ తిరుపతమ్మ చరిత్ర క్రీ.శ 1695 వ సంవత్సరమున జరిగియున్నది. శ్రీ తిరుపతమ్మ దేవస్థానం ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలలోఈ ఆలయం ఒకటిగా ఉన్నది, ఈ దేవాలయం హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహాదారికి 8 కి.మీ దూరములో ఉన్నది. మరియు మధిర రైల్వే స్టేషన్ నుండి 18 కి.మీ దూరములో ఉన్నది. ఆంద్ర రాష్ట్రమున కృష్ణా నదికి ఉపనదిగా ఉన్న పవిత్ర మునియేటి తీరమున గల పెనుగంచిప్రోలు గ్రామాములో జరిగిన యదార్ధ గాధ 17వ శతాబ్ధమున పెనుగంచిప్రోలు గ్రామమునకు సమీపమున గోపినేనిపాలెం,అనిగండ్లపాడు గ్రామములో కొల్లా వంశీకులైన శ్రీ కొల్లా శివరామయ్య, రంగమాంబ పుణ్య దంపతులకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వరప్రసాదినిగా శ్రీ తిరుపతమ్మ అమ్మవారు జన్మించినది. పెనుగంచిప్రోలు గ్రామములో ఒక సాదారణ రైతు కుటుంబములో కాకాని వంశస్తులైన శ్రీ కృష్ణయ్య, వెంకమ్మదంపతులకు కారణజన్ముడు అయిన శ్రీ గోపయ్య స్వామి జన్మించినాడు.దివిలో దేవతల నిర్ణయమా అన్నట్లు భువిలో జారిగిన కళ్యాణ మహోత్సవం ఆత్యంత వైభవముగా కన్నుల పండుగగా శ్రీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం జరిగినది. విధి విదానము తప్పించుకోనుట ఎవరితరము కాదు గదా! కొంతకాలమునకు శ్రీ తిరుపతమ్మ పై విధి వక్రికరించినది. పెనుగంచిప్రోలు పరిసర గ్రామములన్నియూ క్షామానికి గురైనవి. పశుగ్రాసం దొరక పశువులు కృషించిపోసాగినవి.అంత గోపయ్య గోసంరక్షణార్దం ఉత్తరారణ్యం (భద్రాచల సమీప అడవులు) నకు 7మందల గోవులను తోలుకుని వెళ్ళుచూ శ్రీ తిరుపతమ్మ తన తల్లిదండ్రులు,అన్నవదినల వద్ద వదిలి గోపయ్య అడవులకు వెళ్ళినారు. శ్రీ గోపయ్య లేని సమయములో అత్తా,తోటికోడలు ఆరళ్ళు పెట్టి హింసించిన పిదప శ్రీ అమ్మవారు తీవ్రమైన అనారోగ్యానికి గురిఅయినది. శ్రీ అమ్మవారు పడుచున్న కష్టములు తెలుసుకొని ముదిరాజు వంశస్తులు చెందిన పాపమంబ అత్యంత భక్తి శ్రద్దలతో శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి సేవ చేసినది. నేటికి శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్దనం నందు ముదిరాజ వంశస్తులు శ్రీ అమ్మవారికి పూజాది కార్యక్రామాలు నిర్వహిస్తున్నారు. జేష్టదేవి (శ్రీ పెద్దమ్మ) అమ్మవారు పెద్దపులి రూపంలో వచ్చి శ్రీ అమ్మవారికి ఎంతో ఇష్టంమైన అరణపు ఆవును చంపబోవు తరుణములో శ్రీ గోపయ్య గోవును రక్షించుటకు పులితో పోరాడి మరణించినారు. తన భర్త మారణవార్త తెలుసుకొని శ్రీ అమ్మవారు తన భర్తతో పాటు సహగమనం చేయుటకు నిర్ణయించుకొని శ్రీ అమ్మవారు యోగాగ్ని ప్రవేశంచేసినారు.శ్రీ అమ్మవారు దేవత రూపిణి పెనుగంచిప్రోలు గ్రామములో అవతరిచియున్నారు నాటి నుంచి శ్రీ అమ్మవారు భక్తులు కోర్కెలు తీర్చు కొంగు బంగారుమని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఆలయము సమయములు: ఉ గం.5.30 నుండి మ గం.1.00 వరకు తిరిగి మ గం.3.00 నుండి రా గం.8.30 వరకు.
శుక్ర మరియు ఆదివారములు ఉ గం.5.30 నుండిరా గం.8.30 వరకు.
దర్శనములు:
1) ఉచిత దర్శనము
2) అంతరాలయ దర్శనము రూ.100/-
3) శ్రీఘ్ర దర్శనము రూ.20/-
ఉత్సవములు:
1) ప్రతి రెండు సంవత్సరములకు ఒక పర్యాయము శ్రీ అమ్మవారి రంగుల మహోత్సవం జరుగును. సదరు ఉత్సవములో దేవాలయము నందు ఉన్నఅన్ని దేవతామూర్తుల చెక్క విగ్రహములు ఎడ్లబండ్ల పై జగ్గయ్యపేట ఊరేగింపుగా తీసుకోని వెళ్ళి సుమారు 20 రోజుల పాటు రంగులు వేయుట పూర్తి చేసుకొని తిరిగి పల్లకిలో ఊరేగింపుగా జగ్గయ్యపేట నుండి పెనుగంచిప్రోలులోని దేవాలయమునకు వచ్చును.
2) శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్ళు(కళ్యాణం) ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమికి 5 రోజులు జరుగును.
3) శ్రీ అమ్మవారి చిన్న తిరునాళ్ళు (శ్రీ అమ్మవారి పసుపు కుంకుమ) ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమికి 5 రోజులు జరుగును.
సేవలు:
1. సుప్రభాతసేవ రూ 50/-
2. కుంకుమ పూజా రూ 100/-
3. నిత్య కళ్యణం రూ1116/-
4. శుక్రవారం శ్రీ అమ్మవారి అభిషేకం రూ 500/-
5. శ్రీ అంకమ్మ అమ్మవారి అభిషేకం (ప్రతి శుక్రవారం) రూ 116/-
6. శ్రీ చక్ర పూజ రూ1116/-
7. చండీహోమం రూ1116/-
8. అన్నప్రాసన రూ 250/-
9. సంతాన లక్ష్మీ పూజ రూ 100/-
10. గోపూజ రూ 50/-
11.నిమ్మకాయ పూజ రూ 20/-
12. విజయలక్ష్మి కంకణం రూ 5/-
ప్రసాదములు:
1. లడ్డు ప్రసాదం రూ 15/-
2. పులిహోర ప్రసాదం రూ 10/-
సంప్రదించండి :
శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం,
పెనుగంచిప్రోలు (గ్రా. & మం.),
కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ పిన్ కోడ్ : 521 190.
రవాణా :
ఈ ఆలయం పెనుగంచిప్రోలు గ్రామం, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నది.
పెనుగంచిప్రోలు నుండి గుంటూరు - 100 కి. మీ పెనుగంచిప్రోలు నుండి విజయవాడ - 72 కి. మీ పెనుగంచిప్రోలు నుండి నందిగామ - 18 కి. మీ పెనుగంచిప్రోలు నుండి జగ్గయ్యపేట - 18 కి. మీ పెనుగంచిప్రోలు నుండి కోదాడ - 35 కి. మీ పెనుగంచిప్రోలు నుండి ఖమ్మం - 50 కి. మీ పెనుగంచిప్రోలు నుండి మధిర - 18 కి. మీ.
పెనుగంచిప్రోలుకు సమీప రైల్వే స్టేషన్లు మధిర మరియు బోనకల్లు , పెనుగంచిప్రోలు మధిర నుండి 18.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇతర సమీప రైల్వే స్టేషన్లు బోనకల్లు మరియు మధిర వున్నాయి. పెనుగంచిప్రోలు నుండి బోనకల్లు - 21 కి.మీ ల దూరం. పెనుగంచిప్రోలు నుండి మధిర 28 కి.మీ ల దూరం.
సమీప విమానాశ్రయాలు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) మరియు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాద్). విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) నుండి పెనుగంచిప్రోలుకు మధ్య దూరం 93 కి.మీ. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాద్) నుండి పెనుగంచిప్రోలుకు మధ్య దూరం 199 కి.మీ.
penuganchiprolu temple wikipedia, penuganchiprolu temple rooms, penuganchiprolu tirupatamma temple room booking, penuganchiprolu tirunala dates 2020, vijayawada to penuganchiprolu temple distance, thirupathamma thalli story in telugu, penuganchiprolu which district, penuganchiprolu tirumala dates 2020, penuganchiprolu history in telugu, tirupatamma temple history telugu.

Comments
Post a Comment