Sri Talupulamma Ammavari Devasthanam | Lova, Tuni


ఆలయ చరిత్ర :
ఒక గొప్ప ముని అయిన అగస్త్య మహర్షి ఇక్కడ ధాన్యం చేసుకొనెను మరియు ఈ స్థలం ప్రకృతిసిద్ధమైన శోభ మరియు ప్రశాంతత వలన ఆయన ఇక్కడ స్థిరపడ్డారు. అడవిలో పండ్లు తిని, పర్వతాలు నుండి వచ్చే నీరుని త్రాగడానికి ఉపయోగించుకునేవారు. ఆయన ఇచ్చటి కొండలకు " దారకొండ మరియు తీగకొండ" పర్వతాలు అనే పేరు పెట్టారు.

దేవత తలుపులమ్మ తల్లిని ఒక "స్వయంభు" (స్వీయ అవతారం) గా చెబుతారు. మరియు ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత ప్రసిద్ధ పుణ్య క్షేత్రం . ఆమె కోరిన కోరికలు అనుగ్రహించే దేవత అని భక్తుల నమ్మకం. ఒక వ్యక్తి యొక్క కోరికలు ఈ దేవతను సందర్శించడం వలన మరియు భక్తితో ఆమెను పూజించడం వలన నెరవేరుతుందని నమ్మకం. కారుణ్య హృదయం గల దేవత. కొత్త వాహనాలు కొనుగోలు చేసినవారు తప్పనిసరిగా తమ వాహనాలను ఇక్కడికి తీసుకువవచ్చి వాహనపూజ చేయించుకుంటారు.


ఈ ఆలయం అలంకరించబడిన ముఖద్వారం ప్రవేశం నుండి గుడి మెట్లు ద్వారా తలుపులమ్మ తల్లి అమ్మవారి దగ్గరకి చేరుకొనవలెను. మెట్లు ఎక్కే సమయంలో, భక్తులు శ్రీ కైలాస గణపతిని క్షేత్రపాలకుడిని ముందుగా పూజించుకొంటారు. ఇక్కడ వచ్చిన భక్తులు వారి ఆహార (ప్రసాదం), దేవతకు సమర్పించుకుంటారు, భక్తులు వారి "వాహన పూజ" వేడుకలో ఆహారాన్ని వండుకొనవచ్చును మరియు వారి వంట కోసం అవసరమైన ప్రతి వస్తువు అందుబాటులో ఉండును.

పూజ మరియు ఆహార కార్యక్రమాలు ముగిసిన తర్వాత,సాయంకాలం అయ్యే ముందు బయటకి వెళ్లవలెను. ఈ ఆలయం సాయంత్రం ఆరు గంటలకి మూసివేస్తారు. ఇది కొండ ప్రదేశం కావున యాత్రికులు  చాల జాగ్రత్తగా ఉండవలెను. యాత్రికులు రద్దీ ఇక్కడ మోస్తరు ఉన్నప్పటికీ, ఆదివారాలు, మంగళవారాలు, గురువారాల్లో అలాగే పండుగ సందర్భాలలోను, ఆషాఢ మాసంలో చాలా రద్దీ ఉండును.

ఆలయం గురించి :
తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం, లోవ, అరణ్య భాగంలో రెండు భారీ గుట్టల మధ్య ఇరుగ్గా ఉంటుంది, కొత్తగా వాహనం కొనే ప్రతి పదిమందిలో ఎనిమిది గురికి తలుపులమ్మ ఆలయం గురించి తెలుసు. శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం - తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా లోవలో ధారకొండ మరియు తీగ కొండ మధ్యలో కలదు.ఇది ఒక ముఖ్యమైన ఆలయం. వాహనం కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడతారు అని భక్తుల నమ్మకము.

తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం ఉన్న ప్రదేశం ప్రసిద్ధి చెందిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం కలిగిన అన్నవరానికి దగ్గరలోనే కలదు. ప్రకృతి ప్రియులకు, సాహస యాత్రికులకు మరియు భక్తులకు ఈ సుందరమైన మరియు ఆకర్షణీయమైన ప్రదేశం చాలా అనువైనది.

గోదావరి జిల్లాలు మరియు ఉత్తర తీర ప్రాంతాల్లోని వాహనదారులు (ముఖ్యంగా లారీలు, కార్లు) ఈ దేవాలయంతో ఒక ప్రత్యేక బంధాన్ని కలిగివున్నారు, ఎందుకంటే ఈ తలుపులమ్మ అమ్మవారు తమను ప్రమాదాలు, అపాయాల నుండి కాపాడుతుంది మరియు ఆర్ధికంగా వృద్ధి సాధించుటకు తోడ్పడుతుంది అని ప్రగాఢ విశ్వాసం. భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించి శ్రీ అమ్మవారి ద్వారా వాహనాలకి రక్షణ, అనుగ్రహాన్ని పొందుతారు.

ఉత్సవములు మరియు పండుగలు :
ప్రతీ సంవత్సరము, చైత్ర బహుళ విదియ నుండి చైత్ర బహుళ అమావాస్య వరకు లోవ కొత్తూరు గ్రామంలో శ్రీ తలుపులమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవములు నిర్వహించబడుచున్నవి. అదే విధముగా ప్రతీ సంవత్సరము ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాడ బహుళ అమావాస్య వరకు ఆషాడ మాస ఉత్సవములు వైభవముగా నిర్వహించబడుచున్నవి.

ఆగమము :
గ్రామదేవత ఆగమము.


ఆలయ సమయాలు:
ఉదయం 06:00 నుంచి సాయంత్రము 06:00 వరకు తెరచి ఉంచును. ఈ దేవాలయము దట్టమైన అడవిలో ఉండడం వల్ల ఆలయమును సాయంత్రము 06:00 గంటలకే మూస్తారు.

రవాణా :
By Road:
ఈ ఆలయానికి సమీపంలో 8 కి.మీ.ల దూరంలో తుని బస్టాండ్ ఉంది. బస్టాండ్ నుండి ఆలయానికి చేరుకోవటానికి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి.

By Train:
ఈ ఆలయానికి 8 కి.మీ.ల దూరంలో సమీపంలో తుని, అన్నవరం రైల్వేస్టేషన్స్ ఉన్నాయి.

By Air
ఈ ఆలయానికి సమీపంలో 103 కి.మీ.ల దూరంలో రాజమహేంద్రవరంలో ఉంది.

సంప్రదించండి :
శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానము,
లోవ, తుని మండలం,
తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్,
పిన్ కోడ్: 533 401.

ఫోన్ నెంబర్: ROOM BOOKINGS : 8333811213, 8333811218

talupulamma talli story in telugu, vizag to talupulamma lova, talupulamma talli temple andhra pradesh, tuni to talupulamma lova, tuni talupulamma temple timings, talupulamma lova temple to annavaram, talupulamma lova temple distance, talupulamma lova distance

Comments

Popular Posts