ఆలయ చరిత్ర :
ఒకానొక సారి మహా శివుడు తన బృందముతోకూడి ఉన్న సమయాన, ద్వారపాలకుడైనటువంటి నంది వారిస్తున్నా వినకుండా, శ్రీ రుద్రకోటేశ్వర స్వామి వారిని దర్శించుకొనుటకు బలవంతముగా దేవేంద్రుడు ప్రయత్నించెను. అప్పుడు కాపలాగా ఉన్నటువంటి నంది దేవేంద్రుడుని తన్నెను.
అలా తన్నబడ్డ దేవేంద్రుడు గాయములపాలై నొప్పితో సృహతప్పి పడెను. అపుడు దేవేంద్రుడు నొప్పుల నుంచి అలసట నుంచి స్వస్థత కొరకు సూర్య దేవుణ్ణి ప్రార్థించెను. సూర్య భగవానుడు జాలి పడి ఇంద్రుడిని తన కిరణములతో తాకినంతనే ఇంద్రుడు స్వస్థత పొంది బలమును పుంజుకొనెను. ఇంద్రుడు కృతజ్ఞతతో సూర్య భగవానుడిని నిత్యము అక్కడే ఉండుటకు ప్రార్థించి తదుపరి గుడి కట్టి భగవానుని విగ్రహముని ప్రతిష్టించను.
పురావస్థ నిపుణులు ఈ ఆలయంలో ఉన్న శిలా శాసనాల ప్రకారం, 7 వ శతాబ్దంలో కళింగ సామ్రాజ్యానికి చెందిన దేవేంద్ర వర్మ ఈ ఆలయాన్ని నిర్మించి, శ్రీ సూర్యనారాయణ విగ్రహాన్ని ప్రతిష్టించాడని చెపుతున్నాయి. రాళ్ళ శిలా శాసనాల ప్రకారం కొంత భూమిని ఆలయానికి విరాళంగా ఇచ్చాడు. దాని ద్వారా వచ్చే డబ్బుని ఆలయంలో దీపారాధన కోసం, వేదాలు నేర్పడం కోసం, విద్యార్థులకు పాఠశాలలు మరియు వసతి గృహాలు నడపడం కోసం వినియోగించేవారు. ఈ విరాళాలను 11 వ శతాబ్దం కి ముందు కళింగ రాజు దేవేంద్ర వర్మ వారసులు చేసినట్లు పేర్కొనబడింది. ఈ ఆలయ కట్టడం, చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది. సంవత్సరంలో రెండు సార్లు అనగా మార్చి మరియు సెప్టెంబర్ నెలలో ఉదయ కాలంలో సూర్యుని యొక్క కిరణాలు దేవుని యొక్క పాదాల మీద పడతాయి. కిరణాలు ఆలయం యొక్క ఐదు ద్వారాల నుండి వచ్చి విగ్రహం మీద పడి, కొన్ని నిమిషాల వరకు ఉంటాయి.
సూర్య దేవుని ఆరాధన:
ఈ ఆలయం వేర్వేరు రంగాల ప్రజలను ఆకర్షించే ప్రత్యకమైనది. ఈ ఆలయం దేవుడు ఒక్కడే అనే భావాన్ని కలిగిస్తుంది మరియు శివ కేశవుల మధ్య వ్యత్యాసం లేదని చెబుతుంది.ఈ ఆలయంలో ఐదు విగ్రహాలు (పంచాయతనం) ఉంది. అవి:
1.ఆదిత్య
2.అంబిక
3.విష్ణు
4.వినాయకుడు
5.మహేశ్వర
భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించి, త్రిమూర్తి (బ్రహ్మ, విష్ణు, మహేశ్వర) స్వరూపమైన శ్రీ సూర్య నారాయణ స్వామిని ఆరాధిస్తారు. విశ్వంలో ప్రతిరోజు కనిపించే ప్రత్యేక్షమైన దైవమే కాకుండా, అన్ని ప్రాణుల యొక్క జీవనాధారం. సూర్యనమస్కారాలు మరియు అరుణ మంత్రాలు, రిగ్వేద - యజుర్వేదానికి సంబందించిన ఎంతో శక్తివంతమైన ప్రార్ధనలు. వీటిని చదవడం వలన ఆరోగ్యము ప్రాప్తిస్తుంది. మంత్రం లేదా శ్లోకం అనేది ఒక ఆధ్యాత్మిక సూత్రం. దాన్ని ఎల్లప్పుడూ పాటించడం ద్వారా అది మనల్ని రక్షిస్తుంది. ఆదివారం సూర్య దేవుడి ఆరాధనకు అత్యంత శుభమైన రోజుగా భావిస్తారు.
ఆలయం గురించి :
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో, నగరానికి తూర్పున సుమారు 1 కి.మీ. దూరాన అరసవల్లిలో ఈ ప్రసిద్ధ సూర్యదేవాలయం కలదు. అరసవల్లి అసలు పేరు 'హర్షవల్లి' అంటే సంతోషానికి నివాసం అని అర్థం. ఇది భారతదేశం లోని పురాతన సూర్యదేవాలయాలలోని రెండింటిలో ఒకటి. ఇది అత్యధిక భక్తులు సందర్శించే ఏకైక సూర్యదేవాలయంగా ప్రసిద్ధిగాంచినది.
పద్మపురాణం ప్రకారం ఇక్కడి విగ్రహాన్ని కశ్యప ముని మానవజాతి సంక్షేమం కొరకు ప్రతిష్టించినట్టుగా చెప్పబడినది. అందువలన సూర్యదేవునిది కశ్యప గోత్రము అయినది. సూర్యదేవున్ని గ్రహరాజు అని కూడా పిలువబడతాడు. స్థలపురాణం ప్రకారముగా ఈ ఆలయాన్ని దేవేంద్రుడు కనుగొని, ఇప్పుడు శ్రీ సూర్యనారాయణగా పిలువబడుతున్న ఈ విగ్రహాన్ని ప్రతిష్టించినట్టుగా చెప్పబడినది.
అరసవల్లి యొక్క మహత్యం:
కంటి మరియు చర్మ వ్యాధుల వలన పీడింపబడుతున్న వ్యాధిగ్రస్తులు ఈ ఆలయాన్ని సందర్శించి, ప్రార్థనలు చేసుకుంటారు. సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడు అని, ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటే వారికి ఉన్న వ్యాధులు నయమై, ఆరోగ్యం చేకూరుతుందని అని భక్తుల నమ్మకం.
ఈ ప్రసిద్ధమైన దేవాలయం శ్రీకాకుళంలోని అరసవల్లిలో ఉంది:
తన కలని అనుసరించి ఇంద్ర ఉన్న ప్రదేశం లో మూడు సార్లు పిడికిలి నిండా మట్టిని తీసి, ముగ్గురు భార్యలైన ఉష, ఛాయా మరియు పద్మినీలతో కూడి ఉన్న దివ్యమైన సూర్యభగవానుని విగ్రహాన్ని కనుగొన్నాడు. విగ్రహాల క్రింది భాగమున ద్వారపాలకులైనటువంటి మతరా, పింగళ కలరు మరియు పైభాగమున దేవా మునులైనటువంటి సనకసనందులు ఛత్రములు పట్టి ఉన్నారు. సూర్య భగవానుడు రథసారథి అయినటువంటి అరుణుడితో కూడి స్వారీ చేయుచున్నట్టు చిత్రీకరించబడి ఉంది. ఈ మొత్తమునుపైన ఒక నల్ల రాతి మీద అద్భుతముగా చెక్కబడి ఉంది.
పుష్కరిణి:
సూర్యదేవుడు అరసవెల్లిలో ఉండాలన్న ఇంద్రుని కోరికను మన్నించి సూర్య దేవుడు అదృశ్యమైనాడు. ఇంద్రుడు తన "వజ్రాయుధం"తో త్రవ్వి, ఇంద్రపుష్కరిణిఅని పిలవబడే ఒక చెరువును నిర్మించాడు. నేటికి కూడా భక్తులు పుష్కరిణిలో మునిగి, సూర్య దేవుడిని ప్రార్ధించడం వలన, సూర్య దేవుని యొక్క అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. భక్తులు ఈ పవిత్రమైన పుష్కరిణిలో మునిగిన తర్వాత ఆలయంవైపు తిరిగి కళ్ళు తెరచి వారి ముందు ,బంగారు రంగు అంగవస్త్రంలో ఉన్న శ్రీ సూర్య దేవుని విగ్రహాన్ని చూస్తారు. ఇంద్రుడు స్వయంగా సూర్య దేవుడిని అక్కడ ప్రతిష్టించడం వలన, ఈ ఆలయం యొక్క కీర్తి మరియు గొప్పతనం పెరిగాయి.
ఆలయం సమయాలు:
ఉదయం 6.00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు మరియు సాయంత్రం 3.30 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు తెరచి ఉంటుంది.
దర్శనం :
Prathyeka Pravesa Darsanam
స్లాట్స్ : 12 : 00 PM - 11.59 PM విలువ : 100.00 వ్యక్తుల పరిమితి : 1
Radha Sapthami Festival Day
స్లాట్స్ : 09 : 00 PM - 10 : 01 PM విలువ : 500.00 వ్యక్తుల పరిమితి : 2
Visista Darsanam
స్లాట్స్ : 12 : 01 AM - 11 : 58 PM విలువ : 500.00 వ్యక్తుల పరిమితి : 1
సంప్రదించండి :
శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం,
అరసవల్లి, శ్రీకాకుళం జిల్లా,
ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్: 532 401.
రవాణా :
శ్రీ సూర్యనారాయణ ఆలయము శ్రీకాకుళం బస్టాండ్ నుండి 3 కి. మీ దూరంలో ఉన్నది. బస్టాండ్ నుండి ఈ ఆలయాన్ని చేరుకోవటానికి తరచూ బస్సులు మరియు ఆటోలు సదుపాయం అందుబాటులో ఉంటాయి.
Distance By Road :
Distance From Visakhapatnam to Srikakulam 100.00 kms
Distance From Vijayawada to Srikakulam 452.4 kms
Distance From Hyderabad to Srikakulam 724.8 kms
Distance From Chennai to Srikakulam 910.3 kms
Distance From Bangalore to Srikakulam 1112.7 kms
ఈ ఆలయానికి 13 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం-ఆముదాలవలస రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. అక్కడి నుండి టెంపుల్ కి ప్రతి 5 నిమిషానికి ఒక బస్సు మరియు ఆటోలు తిరుగుతువుంటుంది.
Trains from Hyderabad
Konark Exp, East Coast Exp, Falaknuma Exp, Visakha Exp
Trains from Bangalore
Prasanthi Exp, YPR Howrah Exp, Guwahati Exp
Trains from Chennai
Guwahati Exp, Shalimar Exp, Bhubaneswar Exp, Howrah Mail
Trains from Howrah
GHY SC Express, Falaknuma Exp, East Coast Exp, HWH YPR Exp, HWH Mas Mail
By Air:
ఈ ఆలయానికి 106 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం విమానాశ్రయం ఉన్నది.
అక్కడి నుండి తరుచుగా విశాఖపట్నం నుండి శ్రీకాకుళంనకు వచ్చు బస్సులు ప్రతి ఆరగంట కి ఒక బస్సు వస్తుంది.
srikurmam temple history in telugu, srimukhalingam matter in telugu, srikurmam temple matter in telugu, srikurmam wikipedia in telugu, srimukhalingam temple matter in telugu, arasavalli temple annadanam, arasavalli sun temple the hindu, about sri kurmam temple in telugu

Comments
Post a Comment