Sri Subrahmanyeswara Swamy Vari Devasthanam | Mopidevi

ఆలయ చరిత్ర :
వేదవ్యాసులవారు అష్టాదశ పురాణముల సృష్టికర్త తన స్కందపురాణములో సహ్యాద్రి ఖండమునందు దక్షిణ భారత దేశమున కృష్ణానది ఒడ్డున ఉన్న తీర్థములను, పుణ్యక్షేత్రములను పేర్కొనుచూ నేడు మోపిదేవిగా పిలువబడుచున్న ఆనాటి మోహినీపురమును ఈ క్రిందివిధముగా ప్రస్తుతించెను.

వీరవరపు పర్వతాలు అనే ఒక కుమ్మరి, కార్తికేయ స్వామికి గొప్ప భక్తుడు. ఒక రోజు అతను నిద్రిస్తున్నప్పుడు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తన కలలోకి వచ్చి మోపిదేవి గ్రామంలో లింగం ఉంది అని చెప్పారు. మరుసటి రోజు వీరవరపు పర్వతాలు తన కల గురించి గ్రామస్తులకు చెప్పాడు. ఆ గ్రామస్తులు ఆ స్థలానికి వెళ్లి, స్థలాన్ని త్రవ్వించడం ప్రారంభించారు, ఆశ్చర్యకరంగా వారు స్వయంభు లింగంను కనుగొన్నారు, ఆ తరువాత వారు లింగమును పుట్ట మీద ఉంచి పూజించడం ప్రారంభించారు. నంది, కోడిపుంజు మరియు గరుడ యొక్క మరికొన్ని విగ్రహాలను వీరవరపు పర్వతాలు బంకమట్టితో, ఆలయములో నిర్మించారు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రియమైనవి. పూర్తి చేసిన ఈ మట్టి విగ్రహాలను అతను భట్టి (కొలిమి) లోని అన్ని విగ్రహాలను కాల్చాడు, అందుచే మట్టి విగ్రహాలు ధృడంగా ఉన్నాయి.


వ్యాస మహర్షి స్కంద పురాణములో సహ్యాద్రి ఖండమున కృష్ణానది తీరప్రాంత క్షేత్రములను విశిష్టత గురించి పేర్కొనబడెను. ఒకానొక సమయమున బ్రహ్మాదులు, సనక సనందనాది మహర్షులు పార్వతి పరమేశ్వరుల దర్శనార్థమై కైలాసనమునకురాగా అపుడు బాలుడగు కుమారస్వామి తల్లియగు పార్వతిదేవి 

వ్యాస మహర్షి స్కంద పురాణములో సహ్యాద్రి ఖండమున కృష్ణానది తీరప్రాంత క్షేత్రములను విశిష్టత గురించి పేర్కొనబడెను. ఒకానొక సమయమున బ్రహ్మాదులు, సనక సనందనాది మహర్షులు పార్వతి పరమేశ్వరుల దర్శనార్థమై కైలాసనమునకురాగా అపుడు బాలుడగు కుమారస్వామి తల్లియగు పార్వతిదేవి ఒడిలో కూర్చుండి జడధారులై జటాజూటములతో, కాషాయ వస్త్రములతో మరియు కమండలములతో నున్నఆమహర్షులను చూసి పరిహసించెను. అపుడు తల్లియగు పార్వతీదేవి కుమారుని మందలించగా, స్వామి అందులకు పశ్చాత్తాపంతో తదోషనివృత్తికీ ప్రాయశ్చిత్తముగా తపమొనరించుకొనదలచి యుగాంతము వరుకు భూలోకమునందలి నేటి మోపిదేవి ప్రాంతమున సర్పరూపముగా వాల్మీక నివాసచించుచు తపమొనర్చుకొనుచుండెను.

వేదములకు నిలయము కర్మభూమియగు దక్షిణ భారతమున వింధ్య పర్వతము అను గొప్ప పర్వతము కలదు. ఆ వింధ్య పర్వతరాజు ఇలపై నిఖిలపర్వతములలో స్పర్థ నొంది తన గొప్పదనమును లోకవిదితము చేయదలచి అన్ని పర్వతములపై తన ఆధిపత్యమును నిరుపించుటకై గర్వముతో విర్ర వీగి, వింధ్య పర్వతము నిట్ట నిలువుగా పెరిగిపోసాగెను.

సమస్త లోకాలకి తల్లిదండ్రులైన ఆదిదంపతులగు ఉమామహేశ్వరులు ,లక్ష్మీనారాయణులు, వాణిహిరణ్యగర్బులు సకల లోకాలకు కీడువాటిల్లుటచే తల్లడిల్లి సర్వప్రాణకోటికి అభయమిచ్చి ఈ ఆపద నుండి ఉద్దరణ మార్గమును చూపువాడు వింధ్యపర్వతమునకు ఆచార్యుడైన అగస్త్యమహర్షియే అని నిశ్చయించి అగస్త్యుని రావించి కర్తవ్యమును సూచించగ, వారి ఆదేశమును శిరసా వహించి త్రిశక్తి సమేతులైన త్రిమూర్తులకు నిజ ప్రణామములులర్పించి వారిని వీడుకొని తన భార్యైన లోపాముద్రతోను తన శిష్యులతోను స్వస్థానమైన కాశీ పట్టణము నుండి బయలుదేరి వింధ్య పర్వతుని వద్దకు వచ్చెను.

వింద్యుడు తన గురువైన అగస్య మహర్షిని చూచి పూర్తిగా శిరస్సువంచి సాష్టాంగ ప్రణామము చేసెను. అపుడు అగస్య మహర్షి నేను భార్యా, శిష్య సమేతముగా దక్షిణ దేశ సందర్శనార్థమై వెళ్లుచున్నాను. కావున మరల నేను తిరిగి వచ్చునంతవరుకు నీవు ఇటులనే యుండవలెనని ఆజ్ఞపించి దక్షిణ దేశయాత్రకు బయలుదేరెను. ఆయాత్ర మార్గములో కృష్ణా తీరమున మోహినీపురం అనగా మోపిదేవి చేరెను. ఆ ప్రాంతమంతయు ఫలపుష్పాదులతో చాల అందముగా, ప్రశాంతముగా యున్నది. అచటవిరోధ జంతువులైన పాము, ముంగిసలు, మయూర సర్పములు, స్నేహముగా గెంతులు వేయుచున్నవి. ఆ ప్రాంతమంతయూ పెద్ద వల్మీకములతో యుండెను. అందు ఒక పెద్ద వల్మీకముల కోవలలోనుండి ఒక దివ్యమైన, రంగురంగుల కాంతి పుంజముల తేజస్సులతో దేదీప్యమానముగా ప్రకాశించుచూ ఓం నమశివాయ అను పంచాక్షరీ మంత్రశబ్దము ధ్వనించుచున్నది. అపుడు అగస్త్యుల వారు ధ్యానములో నుండి దివ్యదృష్టితో పరికించగా కుమారస్వామి శాప పరిహార్థం ఇచ్చట తపస్సు చేసుకొనుచుండెను అని గ్రహించెను.

అప్పుడు మహర్షుల వారు వల్మీకములోనున్న(పుట్టలోపల) సర్పరూపములో, వేయిపడగలతో నున్న ఒక దివ్యలింగమును బయటకు తీసి పుట్టపైన ప్రతిష్టించి ఈ క్షేత్రమునకు కుమారక్షేత్రము అని నామకరణము చేసిరి. తరువాత కొంతకాలముకు దేవరకోట సంస్థానాధీశులైన చల్లపల్లి శ్రీమంతురాజా యార్లగడ్డవారి వంశీయులు, స్వామివారికి నిత్య ధూపదీప నైవేద్యములకు, యాత్రికులకు ఎటువంటి అసౌకర్యములు కలగకుండా శిఖర, గోపుర మండపములతో ఆలయమును నిర్మించారు. ఈ గ్రామమునకు మోహినీపురం అనే పేరు కాలక్రమేణా మోపిదేవిగా ప్రసిద్ధి చెందినది.

స్వామివారి మహత్యము: ముఖ్యంగా సంతానము లేనివారు, వివాహం కానివారు, ఆర్థికంగా ఇబ్బందులున్నవారు, శత్రు భయము వేటాడుచు ఉన్నవారు, రాహు కేతు కుజ, సర్పదోషములు ఉన్న వారికీ, ఈ స్వామి సేవలు చేసుకుంటే సమస్యలు అన్ని సమసి పోతాయని భక్తుల నమ్మకం. ఇచ్చట పుట్టు వెంట్రుకలు, చెవిపోగులు, అన్నప్రాసన, నామకరణములు, రుద్రాభిషేకములు, నిత్యకళ్యాణములు లాంటివి చేసుకొని, వారి కోర్కెలు నెరవేర్చుకొని నిత్య అన్న ప్రసాదములు స్వీకరించుచూ శ్రీస్వామివారి కృపకు పాత్రులై భక్తులు తరించుచున్నారు.

శ్రీ స్వామి వారి దేవస్థానమునందు స్మార్త ఆగమము ప్రకారము వైదిక కార్యక్రమములు నిర్వహించబడుచున్నవి.


ఆలయం గురించి :
శ్రీ స్వామి వారి దేవస్థానమునందు స్మార్త ఆగమము ప్రకారము వైదిక కార్యక్రమములు నిర్వహించబడుచున్నవి.

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో ఉంది. దీనిని మోపిదేవి ఆలయముగా కూడా పిలుస్తారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మచిలీపట్నం నుండి 30 కి. మీ, విజయవాడ నుండి 80 కి. మీ దూరములో ఉంది. ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగ రూపం (శివ లింగం) లో ఉన్నారు.

మోపిదేవి ఆలయం, 'సంతానం లేని వారికీ సంతానప్రాప్తినిస్తుంది', సర్ప దోష నివారణ పూజకు, రాహు కేతు దోషాల పూజకు మరియు దృష్టి, చెవి సంబంధిత సమస్యలు, చర్మ సంబంధిత వ్యాధుల నుండి స్వామి వారు కాపాడుతారు అని భక్తుల నమ్మకం. మంచి జీవిత భాగస్వామి కోసం చేసే పూజలకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.

ఆలయ సమయాలు :
ఉదయం 5.30 నుండి మధ్యాహ్నం 1:00 వరకు మరియు 
సాయంత్రం 4.30 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు ఉంటుంది.

రవాణా :
By Road:
విజయవాడ నుండి ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులు అందుబాటులో ఉండును. విజయవాడ నుండి 75కి. మీ., మరియు మచిలీపట్నం నుండి 30 కి.మీ. దూరంలో ఆలయం ఉంటుంది.

By Train:
ఈ ఆలయానికి చేరువలో రేపల్లె రైల్వేస్టేషన్ ఉంది. ఇక్కడి నుండి ఆలయానికి చేరుకోవటానికి 20నిమిషాల సమయం పడుతుంది అలాగే ఆలయం నుండి మచిలీపట్నం రైల్వే స్టేషన్ కు 32 కిమీ ల దూరం కలదు.

By Air:
ఆలయం నుండి 64 కి.మీ. దూరములో విజయవాడ గన్నవరం జాతీయ విమానాశ్రయం ఉంది.

సంప్రదించండి :
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం,
మోపిదేవి (గ్రా.) మోపిదేవి ( మం.),కృష్ణా జిల్లా, 
ఆంధ్ర ప్రదేశ్, పిన్ కోడ్: 521 125.
ఆఫీస్ : 08671 - 257240

mopidevi temple miracles, mopidevi temple distance, mopidevi temple rooms booking, how to reach mopidevi temple from tenali, mopidevi temple rahu ketu pooja timings, mopidevi temple online donation, kuja dosha nivarana pooja at mopidevi temple, mopidevi temple to hamsaladeevi distance, subrahmanyeswara swamy temple mopidevi, mopidevi temple history telugu.

Comments

Popular Posts