Sri Sampath Vinayaka Temple, Asilmetta | Visakhapatnam

ఆలయ చరిత్ర :
శ్రీ సంపత్ వినాయగర్ విగ్రహం అసిల్లమెట్టలో గల యస్. జి సంబందం & కో కంపెనీలోని ఒక ప్రదేశంలో నిర్మించారు. ఆలయాన్ని శ్రీ టి. యస్ రాజేశ్వరన్, శ్రీ టి. యస్ సెల్వగణేశన్ మరియు శ్రీ యస్. జి సంబందం వారి కుటుంబ సభ్యుల కోసం 1962 లో వారి నిధులతో నిర్మించారు. ఆ సమయంలో స్థానిక మత్శ్యకారులు వారి రోజువారి వ్యాపార మార్కెట్ కు వెళ్లేముందు ఇక్కడ పూజలు మరియు దీపారాధన చేసేవారు.


5 సంవత్సరాల తరువాత కంచి యొక్క పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి తన పవిత్రమైన చేతులతో శ్రీ గణపతి యంత్ర స్థాపించడం ద్వారా పుణ్యక్షేత్రంగా చెపుతున్నారు, అందువలన సంపత్ వినాయగర్ ఆలయమునకు ప్రాముఖ్యత వచ్చింది.

అడ్మిరల్ కృష్ణన్ ఈస్టర్న్ నావల్ కమాండో ఇన్-ఛార్జ్ గా ఉన్నపుడు 1971 డిసెంబర్ లో సబ్-మెరైన్ (జలాంతర్గామి) ఘాజి వైజాగ్ తీరం లో మునిగిపోయినప్పుడు పాకిస్తాన్ దాడి నుండి వైజాగ్ ను కాపాడటానికి ఈ దేవుడి ముందు 1001 కొబ్బరికాయలు కొట్టారు. కొద్దీ రోజులలోనే, పాకిస్థాన్ దేశం యొక్క అత్యంత శక్తివంతమైన ఘాజీ సుబ మెరైన్ తో  పోర్ట్ పట్టణం మీద దాడి చేయాలని ప్రయత్నించారు. ఆ దాడి నుండి పట్టణం నాశనం అవ్వకుండా మరియు ప్రజలు ప్రాణ నష్టం నుండి తప్పించుకున్నారు.

శ్రీ సంపత్ వినాయగర్ యొక్క ఆశీర్వాదం కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయంలో ప్రార్థన చేసిన తరువాత అనేకమంది భక్తుల యొక్క కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయంలో కొత్త వాహన పూజ (వాహనం) కోసం ఎంతో ప్రాచుర్యం పొందింది.

కొన్ని సేవలను ముందుగానే బుక్ చేసుకునే సదుపాయం కూడా ఆలయం వారు కల్పిస్తున్నారు. ప్రముఖులు కూడా ఇక్కడ సంతోషంగా సాధారణ భక్తులతో పాటు పూజలు చేయించుకోవడానికి ఇష్టపడతారు. ఈ ఆలయములో నిర్దిష్ట సమయంలోనే పూజలు నిర్వహిస్తారు. వినాయక చతుర్థి, ఉగాది, శివరాత్రి మరియు నూతన సంవత్సర వేడుకల సమయాలలో ప్రత్యేక హోమాలు నిర్వహిస్తారు.

శ్రీ వినాయక స్వామి అంటే జీవితంలో అన్ని విజ్ఞాలను తొలగించి విజయం అందించేవాడని మరియు జీవన, సంపద మరియు శాంతి వాటిల్లో తోడుగా ఉంటాడని అర్థం. అన్ని వేడుకలలో అడ్డంకులను తొలగించి విజయాన్ని మరియు ఏదైనా కార్యసిద్ది కోసం మొదట వినాయకుడినే పూజిస్తారు. ప్రఖ్యాతి గాంచిన శ్రీ సంపత్ వినాయగర్ దేవాలయానికి వచ్చిన భక్తులు ఆలయంలో ప్రార్థన చేయటం వలన అన్ని కార్యాలు విజయవంతం చేస్తూ అన్ని అడ్డంకులను తొలగిస్తారని భక్తుల నమ్మకం.

ఆలయం గురించి :
విశాఖపట్నం నగరంలో ప్రముఖ దేవాలయాలలో శ్రీ సంపత్ వినాయగర్ ఆలయం ఒకటి, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. శ్రీ సంపత్ వినాయగర్ విశాఖపట్నంలో ఒక శక్తివంతమైన ఆలయం. ఇక్కడి దేవుడికి పూజలు చేయటం వలన వారి పాపాలు తొలగి మరియు వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల దృఢమైన నమ్మకం. దీని ప్రకారం ఈ ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య కాలక్రమేణా గణనీయంగా పెరిగింది.

వినాయక చవితి ఉత్సవాల రోజున తొమ్మిది రోజులు పెద్దస్థాయిలో పండుగ, వివిధ అవతారములతో ప్రతిరోజూ అనగా ఒక్కోరోజు ఒక్కోరకం అలంకారంతో విగ్రహాన్ని అలకరించబడుతుంది. అభిషేకములు మరియు అలంకారములు ఈ ఆలయములో విశిష్టమైనవి. ఆగష్టు/సెప్టెంబర్ నెలలో ఈ పండుగ రోజులలో ప్రతి సంవత్సరం. అన్నప్రసాద వితరణ పెద్ద స్థాయిలో ఏర్పాటు చేస్తారు, మత ఉపన్యాసాలు కూడా ప్రతి రోజు సాయంత్రం జరుగుతాయి.

ఆలయ సమయాలు:
ఉదయం 6.00 నుండి ఉదయం 11:00 వరకు మరియు  సాయంత్రం 5.00 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు తెరచి ఉంటుంది.


రవాణా :
By Road:
విశాఖపట్నం బస్ స్టేషన్ నుండి ఆలయం నడిచి వెళ్ళే దూరంలో ఉంది.

By Train:
విశాఖపట్నం రైల్వే స్టేషన్, ఆలయము నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది.

By Air:
ఆలయం నుండి 12 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్టణం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.

సంప్రదించండి :
శ్రీ సంపత్ వినాయగర్ దేవాలయం,
ఆశీల్ మెట్ట, విశాఖపట్నం,
ఆంధ్ర ప్రదేశ్ - 530 003.

sampath vinayaka temple address, sampath vinayaka temple online booking, sampath vinayaka temple story, sampath vinayaka temple vizag images, sampath vinayaka temple vizag phone number, bellam vinayaka temple vizag timings, sampath vinagar temple history telugu

Comments

Popular Posts