Sri Rajarajeswari Ammavari Devasthanam | Durgamitta , Nellore


ఆలయ చరిత్ర :
ఈ ఆలయ నిర్మాణం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 1965 సంవత్సరంలో, తమిళనాడు రాష్ట్ర ఆర్కాట్ జిల్లాలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి పీఠాధిపతి అయిన ఆరుళ్ జ్యోతి నాగరాజ మూర్తి విజయవాడకు వెళ్తాడు. అతను దుర్గామిట్ట వద్ద కొంతసేపు విశ్రమించారు, ఇక్కడ రాజరాజేశ్వరి దేవి ఉంది అని చెప్పి ఆ కాళీ స్ధలంలో రాజేశ్వరి దేవికి గుడిని నిర్మించండి అని స్థానిక నెల్లూరులోని తన శిష్యులను కోరారు.

శ్రీ రత్నస్వామి ముదలియార్ ఆలయాన్ని నిర్మించేందుకు జిల్లా కలెక్టర్ నుండి అనుమతి తీసుకొని శ్రీ రాజరాజేశ్వరి ఆలయాన్ని అత్యంత శిల్పకళ సంపదతో నిర్మించారు.తరువాత, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ సుందరేశ్వర స్వామి, దేవత గాయత్రి, వినాయక మరియు నవగ్రహాల కోసం ఇతర చిన్న దేవాలయాలు ఆలయ ప్రాంగణంలో నిర్మించారు. 1985సంవత్సరంలో ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ అధీనంలోకి తీసుకుంది. ఇక్కడ దేవి నవరాత్రులు (దసరా) పండగను అంగరంగ వైభవముగా భక్తజనసందోహంతో అమ్మవారికి పూజలు చేస్తూ జరుపుకుంటారు.

ఆలయం గురించి :

శ్రీ రాజ రాజేశ్వరి ఆలయము సుప్రసిద్ధమైన హిందూ దేవాలయాల్లో ఇది ఒకటి. శ్రీ రాజ రాజేశ్వరి దేవాలయము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లాలోని దుర్గామిట్టలో ఉంది.

శ్రీరాజ రాజేశ్వరి అమ్మవారిని ముఖ్యంగా మహిళా భక్తులు చాల భక్తి శ్రద్దలతో ఆరాధిస్తారు. ముఖ్యంగా, వారు శుక్రవారం నాడు రాహుకాల సమయంలో నిమ్మ చెక్కతో నెయ్యితో దీపం వెలిగించి, అష్టోత్తర పూజ నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. ఇలా 18 వారాలు పూజలు చేసి 19 వ వారంలో ముగిస్తారు.

శరన్నవరాత్రి రోజుల్లో మహిళా భక్తులు కొత్త బట్టలు ధరియించి ఆలయం చుట్టూ 108 ప్రదిక్షణలు చేయడానికి భారీ సంఖ్యలో వస్తారు. ఆ రోజుల్లో నెల్లూరు జిల్లా ప్రజలు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని ప్రజలు కూడా ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేస్తూ అమ్మవారి ఆరాధనలలో మునిగిపోతారు.

శ్రీమతి గాయాత్రి దేవికి ప్రతి రోజు అభిషేకం, నూతన వస్త్రాలంకరణ (కొత్త వస్త్రాలతో అలంకరించడం), అష్టోత్తర పూజ (108 పేర్లు ఆరాధన) నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడు నిత్యాగ్నిహోత్రం వెలుగుతూ ఉంటుంది. ముఖ్యముగా సవన్నవరాత్రి (దసరా 9 రోజులు) మహోత్సవాలు రాష్ట్రంలో చెప్పుకోదగ్గ విధంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో ఈ ఆలయం మొత్తం రాష్ట్రంలో రెండవ ప్రసిద్ధ ఆలయంగా ప్రసిద్ధి గాంచింది. ప్రత్యేక విద్యుత్ దీపాల అలంకరణ, భారీ సెట్టింగులు, మరియు పాత సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకర్షించే విదంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు.

ఆలయ సమయాలు:
ఉదయం 6.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు మరియు సాయంత్రం 4.30 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది.

రవాణా :
By Road:
హైదరాబాద్, విజయవాడ, బెంగుళూర్, విశాఖపట్నం, చెన్నై వంటి అన్ని ప్రధాన నగరాల నుండి రోడ్డు మార్గం ద్వారా నెల్లూరు చేరుకోవచ్చు.

By Train:
నెల్లూరు రైల్వే స్టేషన్ న్యూ ఢిల్లీ, విజయవాడ, చెన్నై, హైదరాబాద్, హౌరా, బెంగుళూర్ మరియు కన్యాకుమారి వంటి అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది.

By Air:
నెల్లూరుకు సమీపములో తిరుపతి విమానాశ్రయం ఉంది. సమీప అంతర్జాతీయ విమానాశ్రయం చెన్నై వద్ద ఉంది.

సంప్రదించండి :
శ్రీ రాజారాజేశ్వరి అమ్మవారి దేవస్థానం,
దుర్గామిట్ట , నెల్లూరు జిల్లా,
ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ - 524 004.
ఫోన్ : 0861-2322016 మరియు 2345676


rajarajeswari temple nellore history, rajarajeshwari temple in nellore wikipedia, rajarajeswari temple nellore phone number, rajarajeshwari temple nellore timings, rajarajeshwari temple history, nellore ranganathaswamy temple history in telugu, raja rajeswari temple timings

Comments

Popular Posts