Sri Prasanna Anjaneya Swamy Vari Devasthanam | Singarakonda

ఆలయ చరిత్ర :
సింగరకొండ పై శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం 14వ శతాబ్దంలో దేవరాయల పాలనలో నిర్మించినట్టు తెలుస్తుంది, దేనికి బలం చేకూరుస్తూ అక్కడి గరుడ స్థంభంపై గల శిలా శాసనాల ప్రకారం ఈ ఆలయం 1443-44 సంవత్సరాల మధ్య కాలంలో నిర్మించినట్లు ఉంది. 


అలానే ఇంకా కొన్ని బలమైన కథనాలు ఇలా ఉన్నాయి. పరిశీలిస్తే ఈ దేవాలయం 14వ శతాబ్దం లో దేవరాయలు అనే రాజు ఏలుబడిలో నిర్మితమై ఉండవచ్చునని తెలియుచున్నది. 14వ శతాబ్దంలో సింగరకొండ చెంత ఉన్న ఒక పల్లెటూరికి చెందిన సింగన్న అనే నరసింహ స్వామి భక్తుని కుమార్తె అయినా  నరసమ్మ అనే బాలిక తమ ఆవులను మేపేందుకు సింగర కొండ మీదకి తోలుకుని వెళ్ళేది.ఆవుల మందలో ఒక ఆవు చాలారోజులుగా పాలు ఇవ్వకపోవడాన్ని గమనించిన సింగన్న ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకునేందుకు ఒక రోజు రహస్యంగా ఆవును వెంబడించాడు.ఆ ఆవు నేరుగా వెళ్లి కొండపైన ఉన్న ఒక శిల వద్ద ఆగింది.ఆ శిల నుండి ఒక బాలుడు ఉద్భవించి పాలు త్రాగి వెళ్లడం సింగన్న గమనించాడు.తాను పూజిస్తున్న నరసింహ స్వామి బాలుని రూపంలో వచ్చి పాలు త్రాగడాన్ని భక్తి భావాల తో నమ్మి ఇక్కడ ఆలయంను నిర్మించాడు అని ఒక కథ ప్రచారం లో ఉంది.

ప్రచారం లో ఉన్న వేరే కథను అనుసరించి 14 వ శతాబ్దంలో అద్దంకి తాతాచార్యులు అనే నృసింహస్వామి భక్తుడు ఉండేవాడు. స్వామి ఆదేశం మేరకు 14 వ శతాబ్దంలో కొండ పై నృసింహస్వామి ఆలయం నిర్మించారని మరొక కథ ప్రచారంలో ఉంది. కొండ దిగువున ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయమును గూర్చి ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉన్నది. ఇప్పటికి సుమారు 210 సంవత్సరాల కిందట శ్రీ లక్ష్మి నృసింహస్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభ ప్రతిష్ట జరుగుతుండగా తేజో సంపన్నుడైన ఒక యోగి కొండ దిగువున, భవనాశి తటాకం ఒడ్డున శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టించి అదృశ్యమైనాడు. ఈ అద్భుతాన్ని కొండ పై నుండి చూచిన  వేలాది భక్తులు భక్తిశ్రద్ధలతో ఆ స్వామిని అర్చించారు. అప్పటినుండి సింగరకొండ దివ్యక్షేత్రమై విరాజిల్లుతుంది.

హనుమంతుడు సీతాదేవిని వెతుకుతూ లంక వెళ్ళు సమయాన సింగరకొండ పైన ఒక రోజు అంత బసచేసినట్టు భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందువలననే శ్రీ ప్రసన్నంజనేయ స్వామి వారి విగ్రహం దక్షిణాభి ముఖంగా ఉంటుంది, మరియు ఆలా దక్షిణాభిముఖం ఉన్న స్వామి వారి దర్శన భాగ్యం చాలా అరుదు.

వాస్తు, ఆగమ శాస్త్రాలననుసరించి క్షేత్రం ఉత్తర ఈశాన్య దిశలో సువిశాలమైన భవనాశి తటాకం నిత్యం నీటితో ఉండడం, దక్షిణ నైరుతి దిశలో కొండ ఉండడం ఈ క్షేత్ర ప్రాశస్త్యంగా పండితులు పేర్కొంటున్నారు. ఈ క్షేత్ర పాలకుడిగా శ్రీ లక్ష్మి నృసింహస్వామి వారు ఉండడం మరో ప్రత్యేకత.

ఆలయం గురించి :
సింగరకొండ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా నందు గల భవనాశి నది ఒడ్డున ఉన్నది ఇక్కడ ప్రాచీనమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి మరియు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంకి ఈ సింగరకొండ ప్రసిద్ధి. ప్రతి రోజూ వందల సంఖ్యలో భక్తులు ఇక్కడ తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకొని కోరికలు కోరుకొని వెళ్తుంటారు. సింగరకొండ ఒక దివ్య క్షేత్రం మరియు భక్తుల పాలిట కొంగు బంగారం, ఇది అద్దంకి కి ఉత్తరంగా 5 కి.మీ దూరంలో ఉంది. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం భవనాశి నది ఒడ్డున కొండ దిగువున కలదు, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం కొండ పై కలదు.

పండగలు                       పవిత్ర దినాలు
1)ఉత్తర ద్వార దర్శనం          : వైకుంఠ ఏకాదశి రోజున (ముక్కోటి ఏకాదశి)
2)తెప్పోత్సవం                   : ప్రతి సంవత్సరం కనుమ రోజున
3)ఉగాది                         : చైత్ర శుద్ధ పాడ్యమి రోజున
4)శ్రీ రామ నవమి               : చైత్ర శుద్ధ నవమి రోజున
5)హనుమాన్ జయంతి         : ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ దశమి రోజున
6)తిరునాళ్ళు                    : ప్రతి సంవత్సరం పాల్గుణ శుద్ధ పౌర్ణిమ రోజున
7)హనుమత్ వ్రతం              : మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున
8)సుబ్రహ్మణ్య షష్టి               : మార్గశిర శుద్ధ షష్టి రోజున

రవాణా :
By Road:
ఆలయానికి దగ్గరగా అడ్డంకి బస్టాండ్ కలదు, హైదరాబాద్, విజయవాడ మరియు ఒంగోలు నుండి అడ్డంకి కి బస్సు సౌకర్యం కలదు.

By Train:
ఆలయానికి దగ్గరగా ఒంగోలు రైల్వత్ స్టేషన్ కలదు, అన్ని ఎక్స్ ప్రెస్ మరియు పాసెంజర్ రైళ్లు ఇక్కడ ఆగుతాయి.


By Air:
ఆలయానికి దగ్గరగా 110 కి.మీల దూరంలో గన్నవరంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం కలదు.

సంప్రదించండి :
శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం,
సింగరకోండ గ్రామం, యాడంకి (మండల్),
ప్రకాశం (జిల్లా), ఆంధ్రప్రదేశ్ - 523 201
singarakonda temple phone number, singarakonda temple history in telugu, singarakonda details, singarakonda tirunala date 2020, singarakonda tirunala date 2020, singarayakonda temple timings, singarakonda tirunalla, prasanna anjaneya swamy images, singarakonda temple history, 

Comments

Popular Posts