Sri Nidanampati Lakshmi Ammavari Devasthanam | Adigoppula | Guntur

ఆలయ చరిత్ర :
గుంటూరు జిల్లా దుర్గి మండలంలోని అడిగొప్పుల దగ్గరలో ఉన్న గ్రామము ఈ నిదానంపాడు. శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారు ఇక్కడ పూజించబడుతున్నారు.

చెట్టు కింద వున్నా ఒక రాతినే అమ్మవారి రూపంగా భావించి పూజలు నిర్వహిస్తున్నారు. కొన్ని ఆచారాలు మరియు సంప్రదాయాలను అనుసరించి ఇక్కడ అమ్మవారికి ఆలయం నిర్మించకుండానే ఆరాధిస్తున్నారు. అయినప్పటికీ, భక్తులకు కావలసిన సదుపాయము కల్పించారు. శ్రీ లక్ష్మీ అమ్మవారిని శక్తివంతమైన దేవతగా నమ్ముతారు.

పురాణాల ప్రకారం 15వ శతాబ్దంలో 12> సంవత్సరాల వయస్సుగల యాగంటి శ్రీ లక్ష్మీ అనే బాలిక గోమాత దైవాంశతో ఒక లేగదూడను గర్భందాల్చింది మరియు గోమాతను ఆరాధించడం మొదలుపెట్టింది. ఇది తెలిసి కోపోద్రిక్తులు అయిన ఆమె నలుగురు సోదరులు ఆ ప్రదేశంలోనే  ఆమెను సజీవ దహనం చేశారు. తరువాత, వారిని తప్పును తెలుసుకొని గ్రామస్థులు నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారిని దేవతగా ఆరాధించడం మొదలుపెట్టారు.


ఆలయం గురించి :
శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి' అమ్మవారి ఆలయం గుంటూరు జిల్లాలోని దుర్గి మండలంలోని అడిగొప్పల గ్రామంలో ఉంది. అడిగొప్పల గ్రామం శ్రీ చెన్నకేశ స్వామి ఆలయం, మాచర్లకు 19 కి.మీ.ల దూరంలో మరియు శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం కోటప్పకొండకు 82 కిలోమీటర్ల దూరంలో ఉంది. పురాణం ప్రకారం శ్రీ పార్వతి అమ్మవారు మహర్షి "సిలదుడు" శాపంగా శ్రీ యాగంటి రామయ్య మరియు సుగుణమ్మ కు జన్మించారు. మరియు ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టారు.

అమ్మవారు రజస్వల కాకముందే గర్భం దాల్చడం వలన అమ్మవారి అన్నదమ్ములు క్రోధంతో ఆమెను సజీవ దహనం చేశారు.కొందరు భక్తులు దహనం చేసిన స్థలం వద్ద పూజలు చేయడం ప్రారంభించారు, శ్రీ లక్ష్మీ "అమ్మవారి"గా అవతరించారని భక్తుల గట్టి నమ్మకం. ప్రతి ఆదివారము భక్తులు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చి పూజలు చేస్తూ పొంగలి, పసుపు కుంకుమలను అమ్మవారికి సమర్పించుకుంటారు.

ఆలయ సమయాలు:
ఆలయం ప్రతి రోజు ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు తెరిచి ఉంటుంది.

రవాణా :
By Road:
గుంటూరు, చిల్లకూరు మరియు మాచర్ల నుండి ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. అడిగొప్పుల వరకు బస్సు సౌకర్యం కల్పిస్తుంది.

By Train:
అడిగొప్పులకు సమీపములో 47 కిలోమీటర్ల దూరములో మిర్యాలగూడ రైల్వే స్టేషన్ కలదు.

By Air:
అడిగొప్పులకు సమీపములో 102 కిలోమీటర్ల దూరములో విజయవాడ జాతీయ విమానాశ్రయము ఉంది.

సంప్రదించండి :
శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి దేవస్థానం,

అడిగొప్పుల, గుంటూరు,
ఆంధ్ర ప్రదేశ్, పిన్ కోడ్: 522 612.
sri nidanampati ammavari photos download, nidanampati sri lakshmi ammavari temple guntur andhra pradesh, neelampati ammavari charitra telugu lo, sri neelampati lakshmi ammavaru charitra, adigoppula temple timings, sri neelampati ammavari jeevitha charitra, neelampati ammavari images hd, sri lakshmi ammavaru photos, nidanampati lakshmi ammavari temple history telugu.

Comments

Popular Posts