Sri Nettikanti Anjaneya Swamy Vari Devasthanam | Kasapuram

ఆలయ చరిత్ర :

విజయనగర రాజు శ్రీ కృష్ణ దేవరాయ మరియు తన గురువు శ్రీ వ్యాసరాయలువారు మత తపస్సు సాధించడానికి దేశ పర్యటనకు "శిల్పగిరి " వెళ్లెను ఇప్పుడు "చిప్పగిరి " అని పిలుస్తారు శ్రీ ఆంజనేయ స్వామి శ్రీ వ్యాసరాయలువారి కలలో కనిపించి ఇలా చెప్పెను ఎక్కడ అయితే ఎండిపోయిన వేప చెట్టు మళ్లీ పచ్చని చెట్టుగా వస్తుందో ఆ ప్రదేశంలో నేను ఉన్నాను అని చెప్పెను .అప్పుడు శ్రీ వ్యాసరాయలువారు స్వామివారిని స్వయంభుగ ప్రతిష్ట చేసెను అందుకనే ఈ ప్రదేశమును నెట్టికల్లు అని అంటారు.

సాధారణంగా పీడలు తొలగించడానికి, సులువుగా నయమవ్వని కొన్ని రకాల వ్యాధులకు, గ్రహ స్థితి బాగోలేనివారికి ఎక్కువగా వేప ఆకులతో పూజ చేస్తే నయమతుందని నమ్మకం. మంత్రాలు పఠించడం, శ్రీ ఆంజనేయ స్వామివారు మరియు ఆ ప్రదేశం అలాంటివాటికి నివారణ కలిగిస్తుందని అని శ్రీ వ్యాసరయ వారు ఏడాది కాలం అక్కడే ఉండి ప్రజలకు చెప్పడంవలన భక్తుల రద్దీ సంవత్సరం అంతటా ఉంటుంది. శ్రీ ఆంజనేయ స్వామి వారు కలలో భక్తులకు కనిపించి మరియు వారి కోరికలు నెరవేర్చెను అందువలన వారి రుగ్మతలకు విరుగుడు స్వామి వారు అని ధృడమైన నమ్మకం కలిగింది . అందువల్ల, యాత్రికులు సంఖ్య రోజు-రోజుకి పెరుగుతున్నది మరియు ప్రతి శనివారం యాత్రికులు వేల సంఖ్యా లో వచ్చును.
బ్రహ్మలోకం నందు శ్రీ బ్రహ్మ మహర్షికి శంభుకర్ణ అనే దూత ఉండే వారు, ఆయన ప్రతి రోజు బ్రహ్మ గారికి కావలిసిన ఆరాధన కార్యక్రమ అవసరాలు చూసుకునేవారు, ఒక రోజు పనులల్లో ఆలస్యం జరగడం వలన, దానికి ఆగ్రహించిన బ్రహ్మ ముని శంభుకర్ణ ను శపించారు. దాని ఫలితంగా శంభుకర్ణ భూలోకం నందు మనిషి రూపంలో జన్మించారు, కృత యుగం లో హిరణ్య కసికునికి ప్రహ్లాదగా జన్మించారు మరియు ద్వాపరయుగం నందు బహ్లికల జన్మించి మహాభారత సంగ్రామంలో కౌరవుల పక్క వహించారు.

పదహారు మరియు పదిహేడవ శతాబ్దాలలో దక్షిణ భారతదేశంలోని చాలా రాజ్యాలను విజయనగర సామ్రాజ్య చక్రవర్తి పాలించేవారు. 1509-1530 సమయంలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు చాలా ప్రాంతాలను తమ సామ్రాజ్యంలో విలీనం చేసి పాలించసాగెను.ఈ కాలాన్ని విజయనగర సామ్రాజ్యానికి బంగారు శకం పేర్కొనవచ్చును. అతను తన ప్రజలకు అనేక సంక్షేమ చర్యలను ప్రారంభించెను మరియు అనేక దేవాలయాలను కూడా స్థాపించెను. తన పాలనలో మధ్వ ద్వైత అనుచరుడైన శ్రీ వ్యాసారయ తన రాజ గురువుగా ఉండేవారు. శ్రీ వ్యాసారయ చక్రవర్తిని మరణం నుండి రక్షించాడు. రాజగురు చక్రవర్తిని దుష్ట కాలం నుండి రక్షించుటకు నాలుగు నాజికై (ఒక గంట మరియు ముప్పై ఆరు నిమిషాలు) చక్రవర్తిగా సామ్రాజ్యాన్ని పాలించెను. అప్పటి నుండి అతన్ని శ్రీ వ్యాస రాజా అని పిలుస్తారు. తదనంతర కాలంలో కూడా చాలా మంది విజయనగర చక్రవర్తులకి రాజా గురువుగా ఉన్నారు. శ్రీ వ్యాజరాజ శ్రీ హనుమాన్ పూజ్యమైన భక్తుడు కావడం వలన హునుమాన్ కోసం 732 ఆలయాలను నిర్మించారు.


వ్యాస రాజా అలా తన ప్రయాణంలో గుంతకల్ దగ్గరలోని శిల్పగిరి చేరుకున్నారు, అదే ఇప్పటి చిప్పగిరి. అక్కడ అతని స్వప్నంలో శ్రీ హనుమాన్ గురించి దివ్య వాణి వినిపించింది, ఆ అనుసారం వెతుకుతూ వెళ్లగా తన కలలో దర్శనమిచ్చిన ప్రదేశం చేరుకున్నారు. ఆ ప్రదేశంలో అందరి సమక్షంలో ఒక ఎండిపోయిన నిమ్మ మొక్క నాటగా అది చిగురించడం మొదలుపెట్టింది, అక్కడ పది అడుగుల లోతు తవ్వగానే హనుమంతుని విగ్రహం లభించగా అక్కడే ప్రతిష్టించారు. ఆ ప్రదేశం నెట్టికల్లు అడవి ప్రాంతం కావడం వలన శ్రీ వ్యాస రాజా గురువు నెట్టికంటి ఆంజనేయ స్వామి అని పిలవడం మొదలుపెట్టారు. క్రమంగా ఆ అడవి ప్రాంతం లో కసాపురం గ్రామం అభివృద్ధి చెందింది కావున శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం కసాపురం లో ఉంది అని నానుడి.
హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు, కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ, వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాథలున్నాయి.

ఆలయం గురించి :
కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఆంధ్ర ప్రదేశ్, అనంతపురం జిల్లా గుంతకల్ మండలం నందు గల ఒక పుణ్య క్షేత్రం, ఈ గ్రామం నందు శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వెలసి ఉన్నారు. స్వామి వారు భక్తుల పాలిట కల్పతరువు మరియు వర ప్రధాత. దగ్గరి మరియు దూర ప్రాంతాల భక్తులు ప్రతి రోజు స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు, ప్రత్యేకంగా శ్రావణ మాసం నందు స్వామి వారి అనుగ్రహం కొరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

ఆలయం దక్షిణ ముఖంగా డెబ్బై అడుగుల ఎత్తుతో అయిదు అంచెల (అంతస్తుల) రాజా గోపురం ఉంది. రాజా గోపురంపై ఐదు కలశాలు బంగారు పూతతో తయారుచేయబడినవి. పశ్చిమ భాగాన ఒక ప్రవేశ ద్వారం కలదు, అక్కడ మూడు అంచెల (అంతస్తుల) గోపురం ఉన్నది. చెక్కతో చేసి అందమైన రూపంలోని వెండి పలకలతో కప్పిన తలుపులు గల మార్గాన్ని ప్రధాన ద్వారం లేదా 'ముఖ ద్వారం'గా పేర్కొంటారు.

శ్రీ వాయుకి గుర్తుగా చూచించే వాయువ్య (ఉత్తర-పశ్చిమ) భాగాన నాలుగువైపుల నుండి మెట్లు గల పవిత్ర కోనేరు కలదు, ఇక్కడ స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమవుతాయని మరియు బుద్ది సిద్ధిస్తుందని నమ్మకం. ఈ కోనేరులో స్నానమాచరించడానికి నీరు మరియు ఆ నీరు మార్చే భాద్యతలు చక్కగా నిర్వహిస్తున్నారు.

హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలో వచ్చే ఉగాది రోజు ఆలయంలో రథోత్సవం నిర్వహించును. శుక్లపక్ష నవమి రోజున శ్రీ సీతారామ కళ్యాణం చాల ఘనంగా నిర్వహించబడును. ఆ సమయంలో భక్తులు పూజలో పాల్గొని మరియు ప్రసాదము పొందుతారు . పూర్ణిమ నాడు హనుమత్ జయంతి ఘనంగా జరుపుకుంటారు. ఫాల్గుణి మాసంలో పౌర్ణమి నాడు మహా అభిషేకం నిర్వహిస్తారు.

హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు, కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ, వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాథలున్నాయి.

సంప్రదించండి :
శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం,
కసాపురం - 515 803, గుంతకల్ మండలం
అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్.

రవాణా :
గుంతకల్ ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమైన పట్టణం విజయవాడ,హైదరాబాద్,బెంగళూరు మహా నరముల నుండి గుంతకల్ కు బస్సు సర్వీసెస్ కలదు. ఈ ఆలయం గుంతకల్ టౌన్ కు 5 కిమీ దూరంలో ఉంది, గుంతకల్ బస్టాండ్లో దిగి అక్కడ నుండి బస్సు లేదా షేర్ ఆటో ద్వారా కసాపురం గ్రామం చేరవచ్చును.
హైదరాబాద్ నుండి గుంతకల్ 343 కిలో మీటర్లు.
బెంగళూరు నుండి గుంతకల్ కిలో మీటర్లు.
విజయవాడ నుండి గుంతకల్ 465 కిలో మీటర్లు.

గుంతకల్ ఆంధ్రప్రదేశ్ లో వ పెద్ద రైల్వే స్టేషన్, ఇది రాయలసీమ జోన్ లో ఒక ముఖ్యమైన రైల్వే జంక్షన్. ఈ ఆలయం గుంతకల్ టౌన్ మరియు రైల్వే జంక్షన్ కి 5 కిమీ దూరంలో ఉంది, గుంతకల్ రైల్వే జంక్షన్ దేశంలోని ఇతర ప్రముఖ నగరాలకు అనుసంధానించబడి ఉంది. అవి  చెన్నై ముంబై, బెంగుళూర్ భువనేశ్వర్, న్యూఢిల్లీ బెంగుళూర్  రైల్వే మార్గాలను కలుపుతుంది. గుంతకల్ రైల్వే స్టేషన్ లో దిగి అక్కడ నుండి బస్సు లేదా షేర్ ఆటో ద్వారా కసాపురం గ్రామం చేరవచ్చును.


బళ్ళారి పట్టణం లో కలదు,ఇది కర్ణాటక స్టేట్ [76 కిలోమీటర్ల] దూరం లో ఉన్నది బళ్ళారి నుండి గుంతకల్ టౌన్ రైలు మార్గము మరియు బస్సు మార్గము ద్వారా చేరవచ్చును .
రైలు మార్గము ద్వారా బళ్ళారి నుండి గుంతకల్ 49 కిల్లో మీటర్లు, బస్సు మార్గము ద్వారా బళ్ళారి నుండి గుంతకల్ 49 కిల్లో మీటర్లు.

anjaneya swamy story telugu, anjaneya swamy wikipedia in telugu, kasapuram temple timings today, history of kasapuram temple, kasapuram devasthanam accommodation, kasapuram anjaneya swamy patalu, about kasapuram in telugu, kasapuram to mantralayam, nemakallu anjaneya swamy, anjaneya swamy temple near me

Comments

Popular Posts