ఆలయ చరిత్ర :
బ్రహ్మాండాది పురాణములలో ప్రశంచించబడిన పెన్నా నదీ తీరమున వెలసియున్న దివ్య క్షేత్రమే జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం. అశేష ప్రజానికానికి ఆకర్షణీయమైన ఈ ఆలయం పెన్నానదికి ఉత్తరం ఒడ్డున వెలుగొందుతున్న ఈ క్షేత్రము ఎన్నదగిన వాటిలో ఒకటి. శ్రీ కామాక్షితాయి మల్లికార్జున స్వామి వారికీ నిలయమై అలరారుతున్న ఈ జొన్నవాడ పురాతనమైన ప్రసిద్ధి గాంచిన పుణ్య క్షేత్రము.
త్రేతాయుగమున కశ్యప బ్రహ్మ యజ్ఞ మొనరించిన ప్రదేశం కావున, యజ్ఞవాటిక జొన్నవాడ గా సార్ధకమైనది. వాంఛితార్ద ప్రధాయని కామాక్షితాయి అమ్మవారిని ఆది శంకరులు సేవించిరని ప్రతీతి. శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మ వారి దేవస్థాన సన్నిధి నందు గల రేవు కశ్యప తీర్ధమని, అందు స్నానమాచరించిన సకల దోషములు హరించిపోవునని నమ్మకం. బ్రహ్మర్షియైన కశ్యపబ్రహ్మ ఒకనాడు భూలోకమునకు వచ్చి వేదాద్రిని (నరసింహకొండ), దర్శించి అక్కడ ఒక యజ్ఞము చేసిన మంచిదనుకొని వేదాద్రికి, ఉత్తరమునున్న భూమిని యజ్ఞవాటికగా చేసుకొనెను. బ్రహ్మార్పణముగా కశ్యప మహర్షి యజ్ఞము పూర్తి చేసెను. త్రివిధములైన ఆ అగ్ని కుండములలో నుండి వెలువడిన తేజస్సు దశదిశల వ్యాపించినది, ఆ తపస్సును చూసి ఈశ్వరుడు అగ్ని నుండి మల్లికార్జునుడిగా ఆవిర్భవించెను. జొన్నవాడ యందు ఆ రీతిన మల్లికార్జున స్వామి అవతరించెనని చెప్పగా విని శౌనకాది మహామునులు కామాక్షి తాయి మల్లికార్జున స్వామి చేరిన విధమును తెలుపమని కోరిరి.
కైలాసమందు శివుని కోసం పార్వతి అన్వేషణ ప్రారంభించి చివరకి జొన్నవాడ చేరినది. ఉద్యానవనమున వేంచేసియున్న పార్వతి జాడ తెలుసుకొని ఆద్యంతరహితుడైన శ్రీ మల్లికార్జునుడు స్వయముగా పార్వతిని చేరుకొని దేవి! ఈ యగ్నవతికని (జొన్నవాడ) వదలి వెళ్ళుటకు నాకు మనసు రాకున్నది. కాబట్టి నా కొరకు నీవు కూడా యిక్కడే యుండి "కామాక్షి" అను పేర ప్రసిద్ధిగాంచి భక్తులను రక్షించమని కోరెను. శివుని కోరికననుసరించి ఆనాటి నుండి పార్వతి దేవి "కామాక్షి" గా పిలవబడుచు భక్తుల కోరికలు తీర్చుచూ దయామయిగా జొన్నవాడలో అలరారుచున్నారని సూతుడు వివరించెను.
ఆలయం గురించి :
శ్రీ మల్లిఖార్జున స్వామి కామాక్షితాయి దేవాలయం, నెల్లూరు కి 12 కి. మీ దూరంలో ఉన్న బుచ్చిరెడ్డిపాలెం మండలం, జొన్నవాడ గ్రామం నందు, పెన్నానది ఒడ్డున కలదు. ఈ ఆలయ ద్వారం, ధ్వజ స్థంభం, మరియు బంగారంతో తయారు చేసి 5 కలశంలతో అలంకరించిన ఆలయ గోపురం భక్తులను ఆకర్షిస్తుంది. పూజారిచే సాంప్రదాయబద్దంగా అలంకరించిన శ్రీ కామాక్షి దేవి అమ్మవారి విగ్రహం భక్తుల చూపు మార్చలేనంత రమణీయంగా ఉంటుంది. దివ్యకాంతితో విరాజిల్లుతున్న ఈ ప్రదేశాన్ని భక్తులు మళ్ళీ మళ్ళీ దర్శించాలి అనుకుంటారు.
జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య గారు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు. తెలుగు తిధి ప్రకారం వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవం జరుపుతారు మరియు దేవి శరన్నవరాత్రులు తొమ్మిది రోజులు చాల ఘనంగా నిర్వహిస్తారు. చాల మంది భక్తులు శుక్రవారం రోజున ఆలయాన్ని సందర్శించి, రాత్రికి ఆలయ ప్రాంగణంలో నిద్ర చేస్తారు. ఇక్కడ ప్రతిరోజు "నవ ఆవరణ పూజ" చేస్తారు మరియు గంగా కామాక్షి సమేత శ్రీ మల్లికార్జున స్వామివారికి కల్యాణోత్సవం జరుపుతారు.
రవాణా :
By Road:
దేవాలయం, నెల్లూరు ఆర్టీసి బస్టాండ్ నుండి 12 కి.మీ దూరంలో ఉన్నది.
By Train:
నెల్లూరు రైల్వే స్టేషన్, ఈ ఆలయానికి 15 కి.మీ దూరంలో ఉన్నది.
By Air:
తిరుపతి విమానాశ్రయం, ఇక్కడకి 135 కి.మీ దూరంలో ఉన్నది.
సంప్రదించండి :
శ్రీ మల్లిఖార్జున స్వామి కామాక్షితాయి దేవస్థాన కార్యాలయం ,
జొన్నవాడ, బుచ్చిరెడ్డిపాళెం మండలం, నెల్లూరు జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్, పిన్ కోడ్: 524 305.
Sri Mallikarjuna Swamy Kamakshi Tayee Ammavari Temple, nellore jonnawada kamakshi temple timings, jonnawada temple timings, jonnawada temple office phone no, nellore to jonnawada kamakshi temple distance, jonnawada temple wikipedia, jonnawada kamakshi images, nellore to jonnawada bus timings, jonnawada to penchalakona, sri mallikarjuna swamy temple history telugu, kamashi temple nellore, nellore famous temple list.

Comments
Post a Comment