ఆలయ చరిత్ర :
శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవాలయం గుంటూరు పట్టణము నుండి 10 కిలోమీటర్ల దూరములో పెదకాకాని గ్రామములో ఉన్నది. పురాతన మరియు దైవ ప్రాముఖ్యత కలిగినటువంటి సుప్రసిద్ధ ఆలయం. ఈ దేవత అష్టాదశ శక్తి పీఠాలలోని దేవతలలో ఒకరని చెప్తుంటారు. శ్రీ మల్లేశ్వర స్వామి క్షేత్రం శ్రీశైల క్షేత్రం యొక్క జ్యోతిర్లింగాలలో ఒకటి. అందువల్ల ఈ దేవత ఆరాధన శ్రీశైల క్షేత్ర శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆరాధనకు సమానం అని భక్తులు భావిస్తారు.
భరద్వాజ మహర్షి గణములలో అత్యంత ప్రసిద్దుడైన శ్రీ భరద్వాజ మహాముని ఒకప్పుడు సర్వ తీర్థములను సేవించుచూ భూప్రదక్షిణ చేస్తున్న సమయములో ఒకనాడు ఈ కాకాని పుణ్యక్షేత్రానికి వచ్చి ఇచ్చట ఉన్న శివలింగమును చూచి ఈశ్వరపూజ చేశారు.ఆ పూజాసమయములో ఆ మహర్షికి శివానుగ్రహం వల్ల ఒక యజ్ఞం చేయాలనే సంకల్పం కలిగినది. వెంటనే అయన యజ్ఞమునకు కావలసిన వస్తువులన్నిటినీ సేకరించి,మహర్షి పుంగవులందరిని ఆహ్వానించి యజ్ఞశాలను నిర్మిపచేశారు. వేదికలను ఏర్పాటుచేశారు. ఒక సుముహూర్తములో యజ్ఞసకల్పం చేసి సర్వాలంకృతమైన యజ్ఞశాలలో యజ్ఞము ప్రారంభించి. అ ప్రజ్వలనం చేసి దేవతలకు యజ్ఞాహుతులను ఇస్తున్న సమయములో అక్కడికొక కాకి వచ్చి దేవతలకు సమర్పిస్తున్న ఆహుతులను తాను తినటం మొదలుపెట్టింది. యజ్ఞం అపవిత్రమైపోతున్నదన్న ఆవేదనతో భరద్వాజ మహర్షి ఆ కాకాని వారింపబోయినాడు.
అప్పుడా కాకి మనుష్యభాషలో ఈ విధంగా చెపింది."ఓ మహర్షి నేను కాకాసురుడనే పేరుగల రాక్షసుడనను.సకల జగత్ సృష్టికర్తయినా బ్రహ్మదేవుని గురించి మహాతపస్సు చేసి ఆయను మెప్పించి ఒక వరాన్నిపొందాను.దానివల్ల దేవతలకిచ్చేటటువంటి హవిర్భాగలాంటిని నేను భక్షింవచ్చు ,నీవు తలపెట్టిన యజ్ఞము నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవాలనుకుంటే నేను చూపినట్లు చెయ్యాలి పంచామృతాలతోనూ ,కృష్ణా,గంగాజలాలతోను ,నవరత్న సువర్ణదాఖలాలతోనూ పవమాన అఘమర్షణ సూక్తములను చదువుతూ ,నన్ను అభిషేకించుము నాకు పూర్వకాలములో ఒక మహర్షి ఇచ్చిన శాపం మీ అభిషేకోధక జలప్రభావముతో తొలగిపోతున్నది.
అపుడు కాకి తెల్లగా మారింది మరియు మల్లెపూలతో పూజించబడుతుంది. అప్పటినుంచి స్వామి వారు శ్రీ మల్లేశ్వరస్వామి వారిగా పిలువబడుతున్నారు. క్షేత్రము కాకాని అని పిలువబడుతుంది. మానస సరోవరం నుండి తిరిగి వచ్చిన కాకిని దైవానికి పూజలు చేయడానికి ఉపయోగిస్తారు.
ఈ దేవాలయ తూర్పుభాగంలో భరద్వాజ మహర్షి చేత నిర్మించబడిన బావి ఒకటి ఉన్నది. అందులో మహర్షిపుంగవులు సమస్త తీర్ధాలనుండి పవిత్ర జలాన్ని సేకరించి ఈ బావియందు ఉంచారు. ఆ తీర్ధములన్ని ఇప్పటికీ అందులో నిక్షిప్తమై నిత్య నిర్మలములై వున్నాయి. వానల వారి అమృతతుల్యమైన ఆరోగ్య భాగ్యాన్ని శంకురుస్తున్నాయి. భరద్వాజముని యజ్ఞద్రవ్యాన్ని ఈ బావిలో వదలినందువల్ల దీనికి "యజ్ఞాలబావి “గా పేరు వచ్చినట్లు చెపుతారు.
క్రీ.శ.1440 లో విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు ఈ ఆలయాన్ని సందర్శించారు. మంత్రుల "రెంటూరి చిత్తరుసు" ఆర్థిక సహకారం చేయడం ద్వారా ఆలయాన్ని బాగుచేశారు.
ఆలయం గురించి :
శైవాగమము ప్రకారము పూజలు జరుపబడును
పెద్దకాకాని శ్రీ భ్రమరాంభ మల్లేశ్వర స్వామి దేవాలయం వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన మహా దేవుడైన శివుని ఆలయం, ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పెద్దకాకాని గ్రామంలో కలదు. ఈ ఆలయం గుంటూరు పట్టణానికి కేవలం 10 కి. మీ దూరంలో మరియు విజయవాడ నుండి 26 కి. మీ దూరంలో గుంటూరు -విజయవాడ రహదారిపై కలదు.
శ్రీ ఆది శంకరాచార్య మొదటగా శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు మరియు ఆ తరువాత శ్రీ కృష్ణదేవరాయల వారు మరమ్మత్తులు జరిపారు. ఈ ఆలయం రాహు - కేతు పూజకి చాలా ప్రసిద్ధం.
రాహు కేతు పూజ :
పెద్దకాకాని ఆలయం రాహు - కేతు పూజకి చాలా ప్రసిద్ధం, ఈ పూజ ప్రతి రోజు రాహుకాలంలో జరుపుతారు.
యాత్రికులు నమ్మకం :
ఈ ఆలయానికి తూర్పు భాగాన బాగా ప్రసిద్ధి చెందిన బావి ఉంది ఇది యజ్ఞాల బావి. భరద్వాజుడు పవిత్ర నదుల నుండి నీళ్లు తెచ్చి ఆ బావిలో పోశాడని నమ్మకం. నేటికీ కూడా ప్రజలు బావిలోని నీరు అన్ని వ్యాధులను నయం చేయగలవని మరియు ఆరోగ్యకరంగా ఉండవచ్చని నమ్ముతారు. "కోరిన కోర్కెలు తీర్చే దేవుడు _కాకాని దేవుడు" ప్రజలు నమ్ముతారు. చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు మల్లేశ్వర స్వామిని పూజించడమువలన ఒక కుమారుడిని పొందాడని తెలుసుకున్నారు. అందువలన దేవుడు సంతానము బహుకరిస్తాడని నమ్మకము. అనేక మంది భక్తులు మరియు యాత్రికులు ఈ దేవాలయములో గొప్ప భక్తి విశ్వాసముతో వివాహాలు నిర్వహిస్తున్నారు.
ఆలయ సమయాలు :
ఉదయం 5.00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు మరియు
సాయంత్రం 4.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు ఉంటుంది.
రవాణా :
ఆలయము నుండి 7 కి. మీ దూరంలో ఉన్న గుంటూరు బస్ స్టాండ్ నుండి తరచుగా బస్సులు అందుబాటులో ఉన్నాయి.
సమీప రైల్వే స్టేషన్ ఆలయము నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు రైల్వే స్టేషన్.
ఆలయం నుండి 44 కిలోమీటర్ల దూరంలో విజయవాడ - గన్నవరం విమానాశ్రయం ఉన్నది.
pedakakani temple contact details, pedakakani temple rooms booking phone number, pedakakani temple rooms booking online, pedakakani temple rahu ketu booking online, vijayawada to pedakakani temple distance, mangalagiri temple timings,pedakakani temple histoyr telugu.

Comments
Post a Comment