Sri Maddileti Narasimha Swamy Vari Devasthanam | Bethamcherla

ఆలయ చరిత్ర :
ఒక రోజు శ్రీ స్వామి వారిపై అమ్మవారు విజయము సాధించగా విజయ గర్వముతో శ్రీ స్వామి వారిని హేళనతో చూడగా అందుకు శ్రీ స్వామి వారు అవమానము భరించలేక అలిగి ఒక మంచి ప్రశాంత పుణ్య స్థలములో భక్తుల కోరికలు తీర్చుకుంటూ వెలవాలనే నిర్ణయమునకు వచ్చి శ్రీస్వామివారు ఎర్రమల, నల్లమల కొండలు సంచరించి చివరకు శ్రీ యాగంటి క్షేత్రమునకు వచ్చి శ్రీ ఉమామహేశ్వర స్వామి వారిని సంప్రదించి అయ్యా నేను శ్రీ కదిరి నరసింహ వారిని, ఎర్రమల కొండలలో వెలసి భక్తుల కోర్కెలు నెరవేర్చుకుంటూ వరపాలకునిగా వెలవాలనుకున్నాను. నాకు ఒక మంచి ప్రశాంతమైన ప్రదేశము చూపించమని అడిగారట, అంతటా వెతికి శ్రీ ఉమామహేశ్వరుడు శ్రీ మద్దిలేరు వాగు ప్రక్కన ప్రకృతి రమణీయ ప్రశాంత వాతావరణం అనుకూల ప్రదేశము చూపించి తన స్వస్థలమునకు వెళ్ళాడు.


అందుకు శ్రీ మద్దిలేరునకు ౩కి.మీ. దూరములో మోక్షపట్టణము కలదట. ఆ పట్టణవ రాజ్యమును పరిపాలించే రాజు కన్నప్ప దొర, ఆ రాజు ప్రతి శనివారము భటులతో వేటకు వెళ్లేవాడట. ఒకరోజు ఎంత ప్రాంతము తిరిగిన ఒక జంతువు కూడా అగుపించకపోవడంతో వెనుతిరిగి వస్తుండగా వింతగా తల మెరుస్తూ ఒక "ఉడుము" కనిపించిందట రాజు దానిని చూసి తన భటులను పట్టుకోమని ఆదేశించాడట. భటులు ఆ ఉడుమును పట్టుకొనుటకు ఎంత ప్రయత్నించినా ఉడుము "కోమలి" అను పుట్టలోకి ప్రవేశించిందట.

అందుకు భటులు పుట్ట త్రవ్వి పట్టుటకు ప్రయత్నించగా ఉడుము మాత్రము దొరకకపోవడంతో భటులు నిరుత్సహముగా పట్టణమునకు వెనుతిరిగి వెళ్లారు. అదే రోజు రాత్రి శ్రీ కదిరి నరసింహస్వామి కలలో కనపడి ఓ రాజా నేను శ్రీ కదిరి నరసింహ స్వామిని నీకు పగలు ఉడుము రూపంలో కనిపించాను మీరు పట్టణ అర్చక, వేదపండితులతో వచ్చి పుట్ట దగ్గర పూజించినను 10 సంవత్సరముల బాలునిగా దర్శనమిస్తానని తెలిపియున్నాడు .

అందుకు రాజు గ్రామము నందు ప్రచారము నిర్వహించి పుర ప్రజలందరూ భక్తి శ్రద్దలతో భాజా భజంత్రీలతో వెళ్లి పూజలు నిర్వహించగా ప్రత్యక్షమైన శ్రీ స్వామి వారు దర్శనమిచ్చి నేటి నుండి నన్ను భక్తి శ్రద్దలతో పూజించినను వారి కోర్కెలు తీరుస్తూ కాపాడతానని తెల్పి అదృశ్యమయ్యాడు. గలగలపారే మద్దులేరు వాగు పక్కన వెలసినందున శ్రీ మద్దులేటి స్వామిగా, శ్రీ మద్దులేటి నరసింహస్వామిగా నామకరణముతో సార్థకత జరిగినది. శ్రీ స్వామి వరాహలుడుగా, భక్తుల కోర్కెలు తీర్చుతూ లక్షలాది మంది భక్తులకు ఆరాధ్య దైవముగా వెలసి యున్నాడు.

ఆలయం గురించి :
ఈ గ్రామంలోని శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం శివుడు వర్ణించిన విధంగా ఎర్రమల కొండలలో నెలకొని భక్తులను విశేషంగా ఆకర్షించుచున్నది. మద్ది అనే భక్తుడికీ, మహాసాధ్వి చిన్నమ్మకూ స్వామి మోక్షం ప్రసాదించిన పవిత్ర స్థలంగా పేరెన్నికగన్నది. ప్రకృతి రమణీయతతో పరవశించిపోతుందీ ఆలయ దర్శనం.

విష్ణు స్వరూపమైన శ్రీ మద్దిలేటి నరసింహ స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్, కర్నూల్ జిల్లా లోని ఆర్.ఎస్.రంగాపురం గ్రామం లో వుంది. భక్తులు ఈ క్రింది కోరికలు నెరవేర్చుకొనుటకు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు:
కీర్తి
వ్యాధులు నుండి ఉపశమనం
సంపద
ధైర్యం
చెడు గ్రహ అంశాల నుండి ఉపశమనం

దుష్ప్రభావాల నుండి ఉపశమనం
బానిసత్వం నుంచి స్వతంత్రం

ఆలయ సమయాలు:
ఉదయం 06:00 నుంచి రాత్రి 09:00 వరకు తెరచి ఉంచును.

రవాణా :
By Road:
మద్దిలేటి స్వామి వారి దేవాలయం కర్నూల్ పట్టణం నుండి 85 కిలోమీటర్ల దూరంలో మరియు బేతంచెర్ల బస్ స్టాప్ కు దక్షిణంగా ఉంది.
హైదరాబాద్ నుండి కర్నూల్ : 219 కి.మీ.
తిరుపతి నుండి నంద్యాల : 270 కి.మీ.
విజయవాడ నుండి నంద్యాల : 325 కి.మీ.
విజయవాడ నుండి కర్నూల్ : 345 కి.మీ.
బెంగళూరు నుండి డోన్ : 307 కి.మీ.

By Train:
ఈ ఆలయానికి సమీపంలో ఉన్న రంగాపురం రైల్వేస్టేషన్ ఉంది.

By Air:
ఈ ఆలయానికి సమీపంలో తిరుపతి విమానాశ్రయం ఉంది


సంప్రదించండి :
శ్రీ మద్దిలేటి నరసింహ స్వామి వారి దేవస్థానం,
బేతంచర్ల మండలం, కర్నూలు జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్ -518 598
Maddileti Narasimha Swamy Temple, Sri Maddileti Narasimha Swamy, maddileti swamy temple timings, maddileti swamy room booking, maddileti swamy photos download, maddileti swamy temple room booking, maddileti swamy temple phone number, maddileti swamy rooms booking, maddileti swamy temple rooms booking, maddileti swamy history in telugu

Comments

Popular Posts