Sri Ksheera Ramalingeswara Swamy Vari Devasthanam | Palakol

ఆలయ చరిత్ర :
పూర్వము క్షీరసాగర మధన సమయంలో ఉద్భవించిన "అమృతలింగాన్ని" అపహరించి దానిని తన కంఠాహారంలో ధరించి తారకాసురుడు మృత్యుభయంలేక గర్వంతో విజృంభించి, ఇంద్రున్ని ఓడించి,దేవలోకాన్ని ఆక్రమించి దేవతలను భాధించసాగాడు.బ్రహ్మాది దేవతల మొర విని త్వరలో పార్వతి పరమేశ్వరులకు జన్మించే కుమారస్వామి తారకుని మెడలోని అమృతలింగాన్ని ఖండించి, అతనిని వధించగలడని వారితో పలికాడు.


కొద్దికాలానికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతిని శివుడు వివాహమాడగా, వారికి కలిగిన కుమారస్వామి క్రమముగా దివ్య శక్తి సంపన్నుడైనాడు. పిదప ఇంద్రాది దేవతలతో కలిసి ధరిసేనాధిపతి అయిన కుమారస్వామి తారకునితో భీకరయుద్ధం చేసి, తన దివ్యాస్త్రంతో అతని కంఠంలోని "అమృతలింగం"ఐదు ఖండాలగునట్లుగా భేదించి, వానిని సంహరించాడు. ఆ అమృతలింగపు ఐదు ఖండాలు పడిన ఐదు ప్రాంతాలే పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్దికెక్కాయి.

స్థలపురాణం ;-
పూర్వము కృతయుగములో తారాకాసురుడు అనీ రాక్షసుడు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేయగా దానికి శివుడు ప్రత్యక్షమై ఏమి వరము కావలెనో కోరుకోమని అంటే స్త్రీ యొక్క గర్భము నుండి పుట్టనివాడి చేత చావు ఉండేటట్లుగా వరం కోరగా ,శివుడు తన ఆత్మలింగాన్ని ప్రసాదించెను .ఆత్మలింగాన్ని తన కంట హారంలో ప్రాణ రక్షణగా ధరించి వర బల గర్వం చేత దేవతలను భాదిస్తూ ఉండేవాడు.అప్పుడు దేవతలు అందరూ వెళ్లి విష్ణు మూర్తిని ప్రార్ధిస్తే స్త్రీ యొక్క గర్భం నుండి పుట్టనివాడు కుమారుస్వామి అయినందున తారకాసుని మీదకు కుమారుస్వామిని యుద్దమునకు పంపించెను.కుమారా స్వామి శక్తి ఆయుధము చేత తారకాసురిని కంట౦ లో అలక్రుతమై ఉన్న అమృత లింగాన్ని చేదించటం తో అమృత లింగమునకు బాణపు దెబ్బ తగిలి ఐదు ముక్కలుగా పడెను. ఆ భాగములలో ఒకదానిని క్షీరపురి (పాలకొల్లు) నందు విష్ణు మూర్తి ప్రత్రిస్ట చేసెను.రెండొవది ద్రాక్షారామమున దక్షుడు ప్రతిష్ట చేసెను. మూదోవది కుమారస్వామి తన పేరున సామర్ల కోటలో కుమార భీమేశ్వరునిగా ప్రతిష్టించే ను నాలుగు భీమవరం లో చంద్రుడు తన పేరున సోమేస్వరునిగా ప్రతిష్టించ చేసెను. ఐదు అమరావతి లో ఇంద్రుడు తన పేరున అమరేస్వరునిగా ప్రతిష్టి చేసెను. తరువాత త్రేతాయుగం లో ఈ పాలకొల్లు క్షేత్రం లో ని శివలింగమును శ్రీరామ చంద్రమూర్తి పునః ప్రతిష్టించి నట్లుగా ఇక్కడి భక్తులు విశేషముగా భావించుట కుడా కలదు. శ్రీ స్వామి వారి ఆలయములో శ్రీ స్వామి వారి కల్యాణం మరియు ఉత్సవ అర్చనాది కార్యక్రమాలు స్మార్త ఆగమము ప్రకారం జరుగు చున్నవి.

ఆ ఐదు ఖండాలని-
మొదటి దానిని మహావిష్ణువు "క్షీరపురి"(పాలకొల్లు)లో శ్రీ రామలింగేశ్వరునిగా,
రెండవదానిని ఇంద్రుడు అమరావతిలో అమరేశ్వరునిగా (అమరరామ),
మూడవదానిని దక్షుడు "ద్రాక్షారామం"లో భీమేశ్వరునిగా,
నాల్గవదానిని చంద్రుడు "గునుపూడి"భీమవరంలో సోమేశ్వరునిగా,
ఐదవదానిని కుమారస్వామి సామర్లకోటలో కుమార భీమేశ్వరునిగా ప్రతిష్టించారు.

అట్టి పంచారామ క్షేత్రాలలో ప్రసిద్ధి చెందిన దివ్యక్షేత్రం-ఈ "క్షీరారామం " శ్రీ స్వామివారి కళ్యాణం మరియు ఉత్సవ అర్చనాది కార్యక్రమములు స్మార్త ఆగమము ప్రకారం జరుగును.

మరో పురాణ ఇతిహాసం ప్రకారం, శ్రీ రాముడు బ్రాహ్మణుడు అయిన రావణుణ్ణి చంపడం వల్ల అతను పాపం మూటగట్టుకున్నాడని మహర్షి అగస్త్యుడు పాపవిమోచనం కోసం నల్ల రంగు గల శివలింగాలను పుణ్య ప్రదేశాలలో ప్రతిష్టింప చేయాలనీ శ్రీరాముడికి చెప్తాడు. అలాగే శ్రీరాముడు సతి సమేతముగా పవిత్ర నదులలో స్నానం చేసి మరియు శివ లింగాలను ప్రతిష్టించడం ప్రారంభించాడు.

అనేక శివ లింగాలను స్థాపించిన తరువాత శ్రీ రాముడు సీతా మరియు లక్ష్మణులతో పాటు శివ లింగాన్ని స్థాపించడానికి గోథాని నదికి వచ్చాడు, సీతా హనుమంతుడిని శివలింగము కోసం పంపిస్తుంది హనుమంతుడు సమయం లోపు తిరిగి రాలేడు, అందువల్ల సీత నారతో కూడిన ఇసుకతో శివ లింగమును చేసి పూజలు చేస్తుంది. దీనితో నిరాశ చెందిన హనుమంతుడు నది ఒడ్డున కూర్చొని బాధపడుతుంటే ఈ వేదనను గమనించిన శ్రీ రాముడు నది ఒడ్డున లింగను ఉంచమని హనుమంతుడిని కోరారు మరియు హనుమంతుడు ఆ శివలింగమునకు పూజలు చేసిన తర్వాత సీతాదేవి కూడా పూజలు చేయడం ప్రారంభించారు.


హనుమంతుడు చాలా ఆనందంగా భావించాడు. ఈ దేవాలయం పంచరామ ఆలయాలలో ఒకటి. ఇక్కడ ఒక రోజు గడిపిన భక్తులు వారణాసి వద్ద ఒక సంవత్సరం పాటు పొందే దయతో సమానమైన పరమేశ్వరుని యొక్క కృపను పొందుతారు.

ఆలయం గురించి :
శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం , పాలకొల్లు, ప.గో.జిల్లా - స్మార్త ఆగమము

శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం పెద్ద గోపురముగా పిలవబడుతుంది. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉంది ఈ ఆలయాన్ని క్షీరారామంగా పేరొందింది. పంచరామ క్షేత్రాలలో ఈ “క్షీరారామ" ఒకటి.

పంచారామ క్షేత్రాలలో ఒకటైన క్షీరారామం పార్వతీ సమేతుడై 'శ్రీ రామలింగేశ్వరుడు'గా వెలసిన పరమ పావనమైన పుణ్య క్షేత్రం. ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్టించబడిన ఈ పుణ్య క్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు. ఆదిశంకరాచార్యులవారు ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ శ్రీ చక్రం ప్రతిష్ఠించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ క్షేత్రాన్ని క్షీరపురి పాలకొలను, ఉపమన్యుపురం, అనే పేర్లతో కూడా పిలుస్తూ వుంటారు. శివలింగం పైభాగం మొనదేలి ఉండటం వలన ఇక్కడి స్వామివారిని 'కొప్పు రామలింగేశ్వరుడు' అని కూడా పిలుస్తారు. ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగమని విశ్వసిస్తున్నారు.

ఆలయ నిర్మాణం:
స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకార మంటపంలో పార్వతీ దేవి కొలువై వుంటుంది. ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం రుణాహర గణపతి ఆలయాలు కనిపిస్తాయి. ఈ రుణాహర గణపతిని దర్శించడం వలన అప్పుల బాధల నుంచి బయటపడటం జరుగుతుందని భక్తులు భావిస్తుంటారు. ఇక్కడి రాజగోపురం 9 అంతస్తులను కలిగి 120 అడుగుల ఎత్తులో అద్భుతమైన శిల్ప కళతో అలరారుతూ వుంటుంది. ఈ పుణ్య క్షేత్రానికి దశలవారీగా అభివృద్ధి పనులు జరిగాయనడానికి చాళుక్యులు, రెడ్డి రాజులు, కాకతీయులు వేసిన శాసనాలు ఆధారాలుగా కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడ పర్వ దినాల సమయంలో విశేషమైన పూజలు, ఉత్సవాలు వైభవంగా జరుగుతుంటాయి. వీటిని తిలకించడానికి భక్తులు విశేషమైన సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చి స్వామివారినీ, అమ్మవారిని దర్శించుకుంటారు.

ఆంజనేయస్వామి ఆలయానికి ఎదురుగా, గర్భాలయ ముఖమండపాలతో కూడిన వీరభద్రస్వామి ఆలయ ఉత్తరాభిముఖంగా కనబడుతుంది. గర్భాలయంలో సుమారు నాలుగున్నర అడుగుల ఎత్తుగల వీరభద్రస్వామి విగ్రహం దర్శనమిస్తుంది. ధ్వజస్థంభానికి ఆనుకొని తూర్పుముఖంగా 5 అడుగుల ఎత్తుగల ధ్యముద్రాంకిత గంగాధరమూర్తి ఇటీవల నెలకొల్పబడ్డాడు. ఈ గంగాధరమూర్తికి ముందు భాగంలో ఎడమ వైపున రాతితో మలచబడిన నందిస్తంభం దాదాపు పూడ్చివేయబడి కనబడుతుంది. దీనిని రాతి ధ్వజ స్తంభంగా స్థానికులు కొందరు చెబుతున్నారు. అయితే ఈ నంది స్థంభం మూడు శాసనాలు మలచబడి ఉన్న ఒక శాసన స్థంభం. ఈ స్తంభంపై అఖండదీప సమర్పణకు సంబంధించిన క్రీ.శ. 1261,1266,1275 సంవత్సరాలలో చెక్కించబడి శాసనాలున్నాయి.

48 అడుగుల ఎత్తుగల ధ్వజస్తంభాన్ని దాటి ముందుకు వెళితే 225 చదరపు అడుగుల విస్తీర్ణం గల ద్వారమండపం,అందులో నుండి లోనికి ప్రవేశించగానే ప్రవేశమండపంలో నల్లరాతితో మలచబడిన చక్కటి నంది కనబడుతుంది.ప్రధానాలయానికి చుట్టూ గల సాలమండపంలోని ముందు భాగమే ప్రవేశమండపం.ఇది 18 స్తంభాలతో కూడిన విశాల మండపం.ఈ మండపంలోని రెండున్నర అడుగుల ఎత్తుగల నందిని దర్శించుకొని ముందుకు సాగితే ఇటీవల నిర్మించబడిన మండపమొకటి సుమారు 150 చదరపు అడుగుల వైశాల్యంతో ఉంది.

ఈ మండపంలోని నైరుతి స్థంభం వద్ద పశ్చిమ ముఖంగా రుణహరణ గణపతి ఉన్నాడు.పంచగణపతి క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన ఈ క్షేత్రంలో ఈ గణపతితో పాటు సాలమండపాలలోని ఆగ్నేయ భాగంలోనూ,ప్రధానాలయానికి దక్షిణ భాగంలోని గణపతి ఆలయంలోనూ,ముఖమండప ద్వారబంధంలో ఉత్తరపు వైపున,ప్రధానాలయానికి ఉత్తరవైపున గల సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలోనూ గణపతి విగ్రహాలు పూజలందుకొంటున్నాయి.ఈ గణపతులను వరుసగా కుమార గణపతి,సంతాన గణపతి,స్థాపిత గణపతి(ప్రథమ గణపతి),బాలగణపతి అని పిలుస్తారు.ఋణ బాధల నుండి విముక్తి పొందటానికి ఋణహరణ గణపతిని భక్తులు విశేషంగా అర్చిస్తారు.

ఆలయ సమయాలు:
ఆలయం ఉదయం 05:30 గంటల నుంచి మధ్యాహ్నం గం. 12.30 ని.వరకు మరలా సా.గం 4.00 నుండి రాత్రి 8:30 గంటల వరకు. పర్వ దినములలో సందర్బము బట్టి ఆలయము ముయబడును మరియు కార్తిక మాసం నెల రోజులు ఆలయము పగలు ముయబడదు.

రవాణా :
By Road:
హైదరాబాదు నుండి బస్సు సౌకర్యము కలదు శ్రీ స్వామి వారి ఆలయము బస్ స్టాండ్ కు అతి దగ్గరలో ఉన్నది.

By Train:
హైదరాబాదు నుండి రైలు సదుపాయము కలదు రైలు స్టేషన్ కు ఒక కిలోమీటరు దూరములో ఆలయము ఉన్నది.

By Air:
హైదరాబాదు నుండి రాజమండ్రి మరియు గన్నవరం విమాన సౌకర్యము ఉన్నది అక్కడ నుండి బస్ సౌకర్యములు కలవు.


సంప్రదించండి :
శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం,
పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా,
ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్: 534 260
ఆఫీస్: 08814-222822
ksheera ramalingeswara swamy temple palakollu timings, bhimavaram temple timings, sri ksheera ramalingeswara swamy temple palakollu andhra pradesh, bhimavaram sivalayam temple timings, draksharamam temple timings, pancharama temples photos, ksheerarama temple images, shiva kshetras in andhra pradesh, ksheera ramalingeswara swamy temple history telugu.

Comments

Popular Posts