Sri Kotasattemma Ammavari Devasthanam | Nidadavolu

ఆలయ చరిత్ర :
పూర్వకాలం 13 వ శతాబ్దంలో రాణి రుద్రమదేవి భర్త అయిన వీరభద్ర చాణుక్యరాజు పశ్చిమ గోదావరి జిల్లాయందు గల నిర్వధ్యాయపురం (ప్రస్తుతం నిడదవోలు) కొంతభాగమును పరిపాలించెను. కోటదిబ్బలు(కోట) సదరు వీరభద్ర చాణుక్యరాజు కాలంలో నిర్మింపబడి, శ్రీ కోటసత్తెమ్మ దేవతచే రక్షింపబడెనని ప్రఖ్యాతి.

నిర్వధ్యాయపురం కాకతీయుల పాలనలో పేరు ప్రఖ్యాతలు పొందినది. కాకతీయ పరిపాలన తర్వాత పరిపాలనకు వచ్చిన రెడ్డిరాజుల పరిపాలనలో ఉండగా నిర్వధ్యాయపురం(నిడదవోలు) తనయొక్క ప్రఖ్యాతిని వరదలు, ప్రకృతి వైపరీత్యముల వల్ల నశించి సదరు కోటసత్తెమ్మ అమ్మవారు ప్రకృతిలో ఐక్యమైనారు.

1936 వ సంవత్సరములో తిమ్మరాజుపాలెం అగ్రహారీకులైన శ్రీదేవులపల్లి రామ్మూర్తి శాస్త్రిగారు పొలమును దున్నుచుండగా, అమ్మవారు వారి నాగలికి తగిలి బయటపడినది. ఆ రాత్రి శాస్త్రిగారి కలలో కనబడి తనకు ఒక గుడిని కట్టించవలిసినదిగా చెప్పినారు. శ్రీ శాస్త్రిగారు సహచర వ్యవసాహాదారుల సహకారంతో అమ్మవారి విగ్రహం ప్రతిష్టించి, చుట్టూ ప్రహరీతో ఒక షెడ్డును నిర్మించారు. శాస్త్రిగారి అనుమతితో సదరు దేవాలయమును యాదవుల వశం చేసుకొని పూజలు నిర్వహించేవారు.

శ్రీ కోటసత్తెమ్మ దేవతవారు, పేరుప్రఖ్యాతులు పొంది తలచిన కోర్కెలు తీర్చు దైవంగా నిలిచియున్నారు. శ్రీ అమ్మవారు 10 అడుగుల ఎత్తులో సకల భూషణ అలంకృతురాలై (అభయహస్తం మరియు యజ్ఞోపవీతంతో) చూచువారలకు ఆహ్లాదం కలిగించే విధముగా విగ్రహము ఉంటుంది.


ఆలయం గురించి :
శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయం, పశ్చిమ గోదావరి జిల్లా, నిడదవోలు మండలం, తిమ్మరాజుపాలెం గ్రామంలో ఉంది.1934 లో సత్తెమ్మ యొక్క విగ్రహం తిమ్మరాజుపాలెం గ్రామంలోని శ్రీ దేవులపల్లి రామ్మూర్తి శాస్త్రి గారి పొలంలో వెలిసింది. ఆ సమయంలో గ్రామంలోని ప్రజలు మరియు సమీప గ్రామాల ప్రజలు కూడా అమ్మవారికి పూజలు ప్రారంభించారు. పూజల తరువాత వారి కోరికలు నెరవేరడం వల్ల దేవిపై నమ్మకం పెరిగింది ఇలా అమ్మవారు చాలా తక్కువ సమయంలో చాలా ప్రసిద్ధి చెందారు. దూర ప్రదేశాల నుండి అనేక మంది ఇక్కడికి వచ్చి సత్తెమ్మ తల్లిని వివిధ ఆభరణాలతో అలంకరిస్తారు.

ఈ ఆలయంలో తొమ్మిది రోజులు దసరా బాగా జరుపుకుంటారు. మార్గశిర మాసములో మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు జరిగే 'తిరునాళ్ల ఉత్సవం' అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. భక్తులు అమ్మవారి యొక్క ప్రత్యేక రోజులుగా భావించే ఆదివారం మరియు మంగళవారం రోజులలో ఎక్కువగా దర్శిస్తుంటారు. ఇతర రోజులలో కూడా భక్తులు వందలాది మంది వివిధ ప్రదేశాల నుండి కూడా వచ్చి ఈ ఆలయాన్ని మరియు అమ్మవారిని దర్శించుకుంటారు.

ఆలయ సమయాలు :
ఆలయం ఉదయం 06:00 గంటల నుంచి సాయంత్రం 08:00 గంటల వరకు తెరచి ఉంచును.

రవాణా :
By Road:
అన్ని ప్రధాన నగరాల నుండి నిడదవోలుకి ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఆలయము నుండి 3 కి.మీ దూరంలో ఉన్న నిడదవోలు బస్ స్టేషన్ నుండి తరచుగా బస్సులు అందుబాటులో ఉన్నాయి.

By Train:
ఆలయమునకు సమీపములో 3 కిలోమీటర్ల దూరంలో నిడదవోలు రైల్వే స్టేషన్ ఉంది.

By Air:
ఆలయం నుండి 40 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి జాతీయ విమానాశ్రయం ఉన్నది.

సంప్రదించండి :

శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానం,
తిమ్మరాజుపాలెం గ్రామం,
నిడదవోలు మండలం,పశ్చిమ గోదావరి జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్. పిన్ కోడ్: 534 301
nidadavolu kotasattemma temple room booking, kotasattemma talli photos, kotasattemma temple timings, nidadavolu history, nidadavolu history in telugu, nidadavolu is rural or urban

Comments

Popular Posts