Sri Jagannadha Anjaneya & Venkateswara Swamy Varla Devasthanam | Lalapeta | Guntur

ఆలయ చరిత్ర :
క్రీ.శ 1717 సంవత్సరం ఉత్తరాదిన నివసించు భక్తులు అయోధ్య జగన్నాధ దాసు బావాజీ, అయోధ్య శ్యామల దాసు బావాజీ మరియు అయోధ్య భగవాన్ దాసు బావాజీ అను వారు దక్షిణ భాగమున వలస వచ్చి మూడు మఠములలోప్రస్తుతము గుంటూరు లాలాపేట నందు "శ్రీ పద్మావతి ఆండాళ్" సమేత "శ్రీ వెంకటేశ్వర స్వామి" వారిని ప్రతిష్టించి, కొత్తపేట నందు గల మఠములో "శ్రీ జగన్నాధ స్వామి"ని ప్రతిష్టించి మరియు కొత్తపేట గుంట గ్రౌండ్ ఎదురుగా ఉన్న మఠము నందు శ్రీ ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్టించించారు.

ఈ మఠములకు వచ్చు భక్తులు భోజన వసతులు చూసి మరి సాగనంపేవారు. అదే విధంగా ప్రతి దినము జరిగేది.1795 వ సంవత్సరంలో వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు గారు ఈ మఠమును సందర్శించి, 300 ఎకరాల భూమిని ఈ మఠానికి ఇచ్చారు.

అప్పటి నుంచి ఈ మూడు మఠములకు దూప దీప నైవేద్యములతో ప్రతి నిత్యము పూజలు జరుగుచున్నవి.

కాలక్రమేణా 1965-66న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయశాఖ స్వాధీనపరుచుకుంది.

తదుపరి 1974 -75 న శ్రీ జగన్నాధ స్వామి వారి దేవస్థానమును మరియు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానమును స్వాధీన పరుచుకుంది.


క్రీ శ 1717 సంవత్సరం నుండి ప్రస్తుతం వరకు అయోధ్య జగన్నాధ దాసు బావాజీ, అయోధ్య శ్యామల దాసు బావాజీ మరియు అయోధ్య భగవాన్ దాసు బావాజీ వారి కుటుంబికులచే శ్రీ స్వామి వారాల అర్చకత్వములు నిర్వహించెదరు.

ఈ దేవస్థానంలో 'వైఖాన ఆగమన శాస్త్ర' ప్రకారం శ్రీ స్వామి వార్లకు పూజలు నిర్వహించబడును.

ఈ దేవస్థానములలో జ్యేష్ఠ మాసం నందు శ్రీ పద్మావతి ఆండాళ్లు సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మరియు శ్రీ జగన్నాథ స్వామి వారికీ 7 రోజులు వైభవంగా పాంచాహ్నికముగా బ్రహ్మోత్సవములు జరుగును.

ఆషాడ మాసంలో శ్రీ జగన్నాధ స్వామి వారికీ ఘనంగా రధోత్సవం నిర్వహించబడును.

వైశాఖ మాసంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికీ 5 రోజులు పంచాహ్నకముగా హనుమాన్ జయంతి ఉత్సవములు మరియు హనుమాన్ జయంతి తరువాత రోజున శ్రీ స్వామి వారికి సహస్రఘటాభిషేకం జరుపును.

ఆలయం గురించి :
శ్రీ జగన్నాథ, ఆంజనేయ & వెంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానం గుంటూరు జిల్లానందు గల లాలాపేట, కొత్తపేటలో ఉన్నాయి. ఈ ఆలయంలో ముగ్గురు దేవతామూర్తులు కొలువైయున్నారు, వారు శ్రీ జగన్నాథ స్వామి, ఆంజనేయ స్వామి & వెంకటేశ్వర స్వామి.

మొదటగా ప్రతి దేవునికి వేరు వేరుగా మఠాన్నిస్థాపించారు. మొట్టమొదటగా “ శ్రీ పద్మావతి ఆండాళ సమేత ”, “ శ్రీ వెంకటేశ్వర స్వామి ” మఠాన్ని స్థాపించారు, తరువాత కొత్తపేటలో “ శ్రీ జగన్నాథ స్వామి ” మఠాన్ని మరియు కొత్తపేట ట్యాంక్ గ్రౌండ్ ముందు ఆంజనేయ స్వామి మఠాన్ని స్థాపించారు. అందువలన ఈ మఠాలు గుంటూరు నందు చాలా ప్రసిద్ధి చెందాయి. స్థానిక నాయకుడైన 'శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు', 1719 లో ఈ మఠాలను సందర్శించి గుంటూరు ప్రాంతంలో 300 ఎకరాలు విరాళంగా ఇచ్చారు.

ఆ తరువాత కాలంలో ప్రజలు వారి వారి కోరికలను నెరవేర్చుకొనుటకు, లక్ష్యాలను సాధించుటకు మరియు అభివృద్ధి చెందుటకు ఈ మూడు మఠాలను దర్శించేవారు. ప్రస్తుతం, అయోధ్య జగన్నాథ దాసు బాబాజీ & శ్యామల దాసు, భగవాన్ దాసు బాబాజీ వారసులు ఈ మఠాల్లో అర్చనలు చేస్తున్నారు. వైశాఖ మరియు ఆషాడ మాసాలు ఈ ఆలయాలకు చాల ముఖ్యమైనవి మరియు ఈ మాసాల్లో బ్రహ్మోత్సవం మరియు రధోత్సవం ఘనంగా నిర్వహిస్తారు.

ఆలయ సమయాలు:
శ్రీ జగన్నాధ స్వామి దేవస్థానం
ప్రతి రోజు ఉదయం 06:00 గంటల నుండి 11:30 గంటల వరకు మరియు సాయంత్రం 05:00 గంటల నుండి 08:30 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది.

శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం:
ప్రతి రోజు ఉదయం 06:00 గంటల నుండి 11:30 గంటల వరకు మరియు సాయంత్రం 05:00 గంటల నుండి 08:30 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది.ప్రతి మంగళవారం, శనివారం మరియు పండగ సమయాలలో ఉదయం 05:00 గంటల నుండి 11:30 గంటల వరకు మరియు సాయంత్రం 5:00 గంటల నుండి 9:30 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది.

శ్రీ వెంకటేశ్వర స్వామి స్వామి దేవస్థానం:
ప్రతి రోజు ఉదయం 06:00 గంటల నుండి 11:30 గంటల వరకు మరియు సాయంత్రం 05:00 గంటల నుండి 08:30 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది.ప్రతి శనివారం మరియు పండుగ సమయాలలో ఉదయం 6:00 గంటల నుండి 11:30 గంటల వరకు మరియు సాయంత్రం 5:00 గంటల నుండి 9:30 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది.

రవాణా :

By Road:
వియజయవాడ, నర్సారావు పేట, తెనాలి మరియు హైదరాబాద్ ల నుండి గుంటూరుకి బస్సు సదుపాయం కలదు. గుంటూరు బస్టాండ్ నుండి కిలోమీటరు దూరంలో ఆలయం కలదు.

By Train:
ఆలయానికి సమీపములో 3 కిలోమీటర్ల దూరములో గుంటూరు రైల్వే స్టేషన్ కలదు.

By Air:
గుంటూరు నుండి 50 కి.మిల దూరంలో విజయవాడ జాతీయ విమానాశ్రయం కలదు.

సంప్రదించండి :
శ్రీ జగన్నాధ, శ్రీ ఆంజనేయ & శ్రీ వెంకటేశ్వర స్వామి ఉమ్మడి దేవస్థానాలు,
లాలాపేట్, గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్ - 522 003.
tirupati balaji story, tirupati temple history, tirupati balaji temple, dwaraka tirumala temple travel guide, venkateswara swamy temple near me, tirumala temple secrets, venkateswara temple, tirupati balaji location, jagannadha anjaneya venkateswara swamy temple history, lalapeta temple histroy, guntur lalapeta temple.

Comments

Popular Posts