Sri Chengalamma Parameswari Ammavari Devasthanam | Sullurpeta, Nellore

ఆలయ చరిత్ర :
'చెంగాలమ్మ పరమేశ్వరి' అమ్మవారి ఆలయం కోల్ కతా - చెన్నై రహదారిపై 'సూళ్లూరుపేట' గ్రామంలో 'కలంగి' నది ఒడ్డున నిర్మించబడింది. పురాణాల ప్రకారం నాల్గవ మరియు ఐదవ శతాబ్దాలలో ఈ ఆలయం నిర్మించబడింది. సూళ్లూరుపేట ప్రజలు గ్రామ దేవత "టెంకాళీ" గా కూడా భావిస్తారు. చెంగాలమ్మగా ఆమె భక్తులు తరచూ పూజలు చేస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో "చెంగాలమ్మా జాతర" ని చూడడానికి వస్తారు.


10 వ శతాబ్దంలో, నెల్లూరు జిల్లాలోని కలంగీ నది పక్కన ఉన్న పచ్చిక బయళ్లలో ఆవులను మేపేవారు. అప్పుడు ఆ ఆవుల కాపరిలకు అమ్మవారి విగ్రహం కనిపించింది. తర్వాత విగ్రహాన్ని సేకరించేందుకు గ్రామస్థులు ఈ ప్రాంతాన్ని చేరుకున్నారు. విగ్రహాన్ని కదిలించిన వారి ప్రయత్నాలు ఫలించలేదు. మరుసటిరోజు వారు ఆ విగ్రహానికి పూజలు జరిపిన తరువాత అమ్మవారి విగ్రహం కదిలింది. అమ్మవారి విగ్రహాన్ని ప్రస్తుత స్థలానికి తీసుకువచ్చి ప్రతిష్టించారు.

సూళ్లూరుపేట చెంగాలమ్మ తల్లిగా ప్రసిద్ధి చెందిన 'విష్ణు' దేవత, దేవాలయంలోని విగ్రహం సముద్ర ముఖంగా చూస్తూ ఉంటుంది. రాష్ట్రం యొక్క వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఈ స్థలాన్ని సందర్శిస్తారు మరియు వారి కోరికలను అమ్మవారు నెరవేర్చడం వల్ల భక్తుల రాక పెరిగింది. మర్రి చెట్టు యొక్క వేలాడుతున్న ఊడలతో సహజంగా అలంకరించి ఉంటుంది,  దేవత యొక్క రూపం నిజంగా భక్తిపూర్వక దృశ్యాలుగా కొనియాడుతారు.

ఆలయం గురించి :
చెంగాలమ్మ ఆలయం సూళ్లూరుపేట, కలంగీ నది ఒడ్డున ఉంది. చెన్నై, తిరుపతి, నెల్లూరు వంటి ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడిన ఈ ఆలయం సూళ్లూరుపేట యొక్క దక్షిణ భాగాన ఉంది. ఆలయ ప్రాంగణంలో 400 ఏళ్ళ వయస్సు కలిగిన చెంగాలమ్మ చెట్టుకు ముడుపులు కట్టడం వలన భక్తుల కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

తరువాతి రోజులలో అమ్మవారిని టెంకాళీ (దక్షిణ కాళి) అని పిలవబడేది. తరువాత టెంకాళీ పేరు చెంగాలిగా వ్యవహరించారు, ప్రస్తుతం చెంగాలమ్మగా పిలవబడుతుంది. అమ్మవారు ఉన్న ప్రాంతం చుట్టూ గ్రామం ఏర్పడింది దానిని చెంగాలిపేట అని పేరు పెట్టబడింది. బ్రిటీష్ పాలనలో వారు దీనిని సూళ్లూరుపేటగా పేరును మార్చుకున్నారు. 7 ఏళ్ళలో ఒకసారి జరిగే బ్రహ్మోత్సవం సమయంలో "సుడిమను" ఆలయం చుట్టుపక్కల ఉందని చెపుతారు, అందువలన ఈ స్థలం, సూళ్లూరుపేట అని పిలువబడుతుంది.

ఆలయ సమయాలు:
ఈ ఆలయం నిరంతరం తెరిచి ఉండును.

రవాణా :
By Road:
చెన్నైవైపుగా వెళ్లే ప్రతి బస్సు సూళ్లూరుపేట గుండా వెళ్తాయి. అలాగే విజయవాడ-నెల్లూరు వైపుగా వెళ్లే బస్సులు సూళ్లూరుపేట గుండా వెళ్తాయి.

By Train:
భక్తులు ఆలయానికి రైళ్ల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. చార్మినార్, హైదరాబాద్, పినాకిని, జమ్ముతావి వంటి కొన్ని సూపర్ ఫాస్ట్ రైళ్లు, సూళ్లూరుపేటలో ఆగుతాయి. ఇది కాక చెన్నై వెళ్ళే లోకల్ రైళ్లు కూడా ఇక్కడ ఆగుతాయి.

By Air:
ఆలయానికి 102 కిలోమీటర్ల దూరములో తిరుపతి జాతీయ విమానాశ్రయం కలదు.

సంప్రదించండి :

శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరీ అమ్మవారి దేవస్థానం,
సూళ్లూరుపేట, నెల్లూరు జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్, పిన్ కోడ్: 524 121.
sri chengalamma temple timings, chengalamma temple abhishekam timings, chengalamma temple rooms booking, sullurpet chengalamma parameshwari temple, sullurpet chengalamma temple images, chengalamma charitra, chengalamma songs, sullurupeta

Comments

Popular Posts