Sri Bhimeswara Swamy Vari Devasthanam | Draksharamam

ఆలయ చరిత్ర :
ఈ దేవస్థానం వాడుకలో ఉన్న ద్రాక్షారామం నందు కలదు, ద్రాక్షారామం అంటే దక్ష ప్రజాపతి నివాసం అని అర్ధం, దక్షుడు మహాదేవుని మామగారు మరియు శివుని పత్ని అయిన సతీదేవి తండ్రి. శ్రీ వాస్యుని యొక్క 'స్కంద పురాణం'లో ఈ పవిత్ర ఆలయం యొక్క చరిత్రను సంపూర్ణంగా వివరించబడింది. అదే కధనాన్ని ఇక్కడ క్లుప్తంగా వివరించబడింది.

ఒకసారి దక్ష ప్రజాపతి యజ్ఞం చేయదలిచారు. అదే విధంగా, దక్షుడు తాను చేయబోయే యజ్ఞంని విజయవంతం చేయుటకు మరియు తన ఆతిద్యాన్ని స్వీకరించమని దేవతలను మరియు దేవుళ్లను ఆహ్వానించుటకు కైలాసమునకు వెళ్లెను. దక్షుడు కైలాసంలో ఉండగా శివుడు ఆధ్యాత్మిక శోభతో మునిగి ఉండెను, శివుని మామ అయినప్పటికీ తన అహంతో శివుని స్థితిని తప్పుగా అర్ధం చేసుకొని శివుణ్ణని మరియు తన కుమార్తె అయినా సతీదేవిని ఆహ్వానించకుండా వెనుదిరిగెను.


తమను ఆహ్వానించకపోయినప్పటికీ సతీదేవి ఆ యజ్ఞ నిర్వహణను మరియు ఆ పరిసరాలను ఉహించుకొని తన స్త్రీ స్వభావంతో తన తల్లిదండ్రుల ఇంటిలో జరగబోవు యజ్ఞంకి హాజరు కావడానికి అనుమతించమని శివుణ్ణి కోరెను, కానీ శివుడు ఆమె తన తల్లిదండ్రుల ఇంటి వద్ద ఎదుర్కొనవలసి వచ్చే విషాదపరమైన చిక్కులను గురించి వారించెను మరియు ఆమె ఇష్టం మీద వెళ్ళుటకు అంగీకరించెను కానీ, ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళినప్పుడు, ఎవరూ ఆమెకు స్వాగతం పలకలేదు కదా కనీసం ప్రాథమిక మర్యాదలను చేయలేదు. అప్పుడు సతీదేవి తన కుటుంబ సభ్యుల మధ్య ఈ విషయాన్ని చాలా అవమానంగా భావించారు మరియు తన ప్రియమైన భర్త వారించినా కాదు అని రావడం వలన జరిగిన పరిణామాలను తలచుకొని శివుణ్ణి ఎదురుకోవడం కన్నా తనువు చలించడం ఉత్తమం అని భావించిన సతీదేవి తనువు చాలించారు.

ఆ విషాదకరమైన విషయాన్నీ తెలుసుకున్న శివుడు దక్షుని అహంని అణచివేయవలసిందిగా వీరభద్రుని ఆజ్ఞాపించెను. సతీదేవి ఇకలేరు అనే వేదనలో శివుడు ఆమె దేహాన్ని తన భుజాల మీద వేసుకొని 'ప్రణయ తాండవ నృత్యం చేస్తుండెను. ఈ సందర్భంలో విశ్వాన్ని రక్షించే శక్తిగా ఉన్న విష్ణు, సతీదేవి యొక్క దేహాన్ని శివుని నుండి వేరు చేసి శివుడి దుఃఖాన్ని విమోచించడానికి అతని 'చక్రాన్ని' పంపించాడు. చక్రం సతి యొక్క శరీరం పద్దెనిమిది ముక్కలుగా ఖండించగా ఆ భాగాలూ ఈ పుణ్యభూమిలో పద్దెనిమిది ప్రదేశాల్లో పడెను మరియు ఆ ప్రదేశాలను 'అష్టాదశ పీఠాలు' అని పిలవబడింది మరియు ఈ పద్దెనిమిది నుండి, శ్రీ మాణిక్యాంబ ద్రాక్షరామం పన్నెండవది.

దేవ దేవుడు సతీసమేతంగా ఉన్న ఈ పవిత్ర పుణ్యక్షేత్రం చాలా అరుదైనవాటిల్లో ఒకటి. అలాంటివి ఉత్తర భారతదేశంలో వారణాసి ఇక్కడ శ్రీ విశ్వనాధుడు అన్నపూర్ణ సమేతుడై ఉన్నారు మరియు దక్షిణ భారతదేశంలోని శ్రీశైలంలో శ్రీ మల్లికార్జునుడు భ్రమరాంబ సమేతుడై మాత్రమే ఉన్నారు. పవిత్ర పురాణాలలో ఇక్కడ వెలసిన 'స్వయంభు' గురించి చాలా కథలుగా చెప్పుకుంటున్నారు. అలాంటివాటిలో ఒక కథ, దక్షుడి కుమార్తె అయిన పార్వతీదేవి కోరిక మేరకు భీమనాథుడు కైలాసం విడిచి ఇక్కడకి వచ్చినట్టు చెప్పుకుంటారు. ఈ చారిత్రక అంశం 13 వ శతాబ్దం నుండి మొదలైంది.

స్థానికుల నమ్మకం ప్రకారం, ఈ ఆలయంలో శివ లింగాన్ని సూర్యదేవుడు ప్రతిష్టించినట్టు వినికిడి. మహా శివరాత్రి, దేవి నవరాత్రులు, కార్తీక మాసం, మరియు ధనుర్మాసం ఈ ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగలు.

అలాగే స్థానికుల నమ్మకం ప్రకారం, దేవదూతలు ఒక రాత్రిలో ఈ ఆలయ నిర్మాణం జరిపినట్టు మరియు ప్రహరీగోడ నిర్మాణం మాత్రం సూర్యోదయంలోగా అసంపూర్ణంగా ఉండిపోయింది. ఆ నిర్మాణాన్ని పూర్తిచేయడానికి చాలా ప్రయత్నాలు జరిగిన అవి సంపూర్ణమవ్వక ఆ నిర్మాణాలు కొన్ని నెలలకే కూలిపొయ్యేవి.

ఈ ఆలయ నిర్మాణాన్ని క్రీస్తుశకం 800 మధ్య కాలంలో ప్రారంభించి, సుమారు 11వ శతాబ్దంలో పూర్తి చేసారు. ఒక దానిలో ఇంకొకటిగా నిర్మించిన రెండు గోడల నిర్మాణం మరియు రెండు అంచులతో కూడిన మండపం ఒక అద్భుతం. అంతర్గత ఆలయం (గర్భాలయం) యొక్క శిల్పకళ చాలా లోతైన మరియు సాంస్కృతిక పనులతో రూపొందించబడింది. ఈ కళాత్మక పని ఇప్పటికీ నిర్మాణ కళాశాలలకు ఒక గ్రంధాలయం. ఆలయం లోపల వెలుతురు వచ్చే నిర్మాణం చాలా ఆకట్టుకుంటుంది. ఈ ఆలయం ఎల్లప్పుడూ మంచి వెలుతురు మరియు గాలితో నిండి ఉంటుంది. ఆలయం యొక్క రెండు అంచులతో కూడిన మండపం చూడముచ్చటగా ఉంటుంది, మరియు ఆలయ స్తంభాలు నైపుణ్యంగా మరియు నిశితంగా చెక్కబడ్డాయి. రాళ్లతో నిర్మించిన ఆలయ గోడలపై చోళ మరియు శాతవాహన రాజ్యపాలన, విజయనగర మరియు రెడ్డి రాజ్యాలకు సంబందించి అనేక శాసనాలు (అధికారిక మరియు చారిత్రాత్మక కథనాల ప్రకారం) వ్రాయబడ్డాయి. ద్రావిడ, తమిళ, దేవనాగ్రి, సంస్కృతం మరియు తెలుగు భాషలలో ఈ శాసనాలు లికించబడ్డాయి.


క్రీస్తుశకం 800 సంవత్సరం తర్వాత ఈ ఆలయానికి 40 కి.మీ వ్యాసార్థంలో 108 శివాలయాలు నిర్మించబడ్డాయి. ఈ ప్రదేశాన్ని దక్షిణ కాశీ అంటారు, ఈ ఆలయంలోని శివలింగం 2.6 మీటర్ల స్పటికతో తయారుచేసిన చాలా పెద్ద లింగం. ఇక్కడ శివుడు తన మొదటి భార్య అయిన దాక్షాయణీ (దక్షుడి కుమార్తె అవ్వడంవలన దాక్షాయణి) సమేతుడై ఉన్నారు. సతీదేవి శరీర భాగం పడిన అష్ఠాదశ పీఠాల్లోని ఒక శక్తిపీఠం మరియు శ్రీ మాణిక్యాంబ పుణ్యక్షేత్రం.

పురాణాల ప్రకారం ఇక్కడి ఆలయంలోపలికి సరిపడే వెలుతురు కొరకు ఆలయ గోడలు వజ్రాలతో నింపబడినవాని మరియు ఔరంగజేబ్ ఈ ఆలయాన్ని ఆక్రమించి ఆ వజ్ర సంపదను దోచుకోవాలి అనుకోగా ఆ వజ్రాలు రాళ్లు అయ్యాయని చెపుతారు, దానికి సాక్షం అన్నట్టుగా అక్కడి వజ్రరూప రాళ్లను చూపుతారు అర్చకులు.ప్రధాన ఆలయంలో మరొక చిన్న ఆలయం కలదు, పురాణాల ప్రకారం తదనంతర కాలంలో మానవుల ఎత్తు తగ్గుతుంటుంది కావున వారి ఎత్తుకు సరిపోయేలా ఈ చిన్న ఆలయం నిర్మించారు అని చెపుతుంటారు. ఇంకో కథనం ప్రకారం భూమిలోపల నివసించే చిన్న చిన్న ప్రాణుల కొరకు నిర్మించినట్టు చెపుతుంటారు. ఇంకొక గాథలో ప్రధాన ఆలయ నమూనాలో భాగంగా నిర్మించినట్టు వినికిడి.

ఆలయం గురించి :
ఆంధ్ర ప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా, ద్రాక్షారామం లో భీమేశ్వర స్వామీ మరియు మాణిక్యాంబ దేవత ఆలయం ఉంది. పూర్వం "శివలింగం" ఒక పెద్ద స్పటిక రూపంలో 2.6 మీటర్ల పొడవు (" స్పటిక శివలింగం" అని పిలుస్తారు) లో ఉంది. ఈ ఆలయం దక్షిణ కాశీ క్షేత్రం అనే మరో పేరుతో కూడా ప్రాచుర్యంలో ఉంది.

ద్రాక్షారామం అనే పేరు ఎలా వచ్చిందంటే అది దక్ష ప్రజాపతి నివాసం, ఆయన సతి తండ్రి మరియు శివుని మామగారు, సతి శివుని భార్య. ద్రాక్షారామం ఆలయం ఆంధ్ర ప్రదేశ్ లో శివుని ఐదు శక్తివంతమైన దేవాలయాలు గా పిలువబడే “పంచరామల్లో” ఒకటి. భీమేశ్వర స్వామి ఆలయం లేదా ద్రాక్షారామం గోదావరి నది యొక్క తూర్పు తీరాన కాకినాడ నుండి దూరంగా అమలాపురం నుండి 25 కిలోమీటర్ల 28 కిలోమీటర్ల దూరంలో ఉంది.

శ్రీ వ్యాస యొక్క 'స్కంధ పురాణం' ఈ పుణ్యక్షేత్రము యొక్క చరిత్రను వివరిస్తుంది. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి యజ్ఞాలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు కైలాస పర్వత పర్యటన చేశారు. యజ్ఞానికి అక్కడ దేవుళ్లను దేవతలను ఆహ్వానించారు. దక్షుడు శివుని యొక్కఉదాసీనతను ఆసరాగా తీసుకుని శివుని మరియు సతిని ఆహ్వానించకుండా వెనుతిరిగారు. ఆహ్వానం అందకపోయిన సతి పూజకు హాజరు అవుతానని కోరిక వ్యక్తం చేసింది. శివుడు ఆహ్వానం అందకుండా వెళ్ళకూడదు అని హెచ్చరించారు, అయిన వినకుండా పార్వతి పూజకు వెళ్లారు.ఊహించిన విధంగా, ఆమె తండ్రి యింట ఎవరు ఆమెను ప్రేమగా పలకరించలేదు. పైగా ఆమెను అవమానించారు.

ఆమె అవమానంతో తిరిగి వెళ్ళడానికి ఇష్టపడక తన జీవితాన్ని అంతమొందించాలని నిర్ణయిచుకుంది. సతి తన తండ్రి యింట అగ్నికి ఆహుతి అవుతుంది. శివుడు ఈ విషాదం గురించి తెలుసుకున్నప్పుడు, అతను దక్ష యొక్క అహం అణచడానికి తన కుమారుడగు వీరభద్రుని పంపుతాడు, వీరభద్ర, కాళి మరియు ఇతర సేన కలిసి దక్ష యజ్ఞాన్ని నాశనం చేస్తారు.

శివుడు తన భుజాల మీద సతి మృతదేహాన్ని వేసుకుని "ప్రళయ తాండవ" నాట్యం చేస్తారు. ఆ క్షణాన, విష్ణువు దిగివచ్చి శివుని బాధను తగ్గించడానికి సతి శరీరాన్ని చక్రంతో 18 ముక్కలు చేస్తాడు. భూమిపై ముక్కలు పడిపోయిన 18 ప్రదెశాల్ని "అష్ట దశ పీఠాలు" అంటారు. ద్రాక్షారామం మాణిక్యమ్మ సతి ఎడమ చెంపగా నమ్ముతారు.

"సప్తమహర్షి " లేదా ఏడుగురు ఋషుల వారి తపస్సు కోసం ఏడు ప్రవాహాల్లో గోదావరి నది విభజించబడింది. ఈ ఏడు ప్రవాహాలు, ద్రాక్షారామం, భరద్వాజ , విశ్వామిత్రుడు మరియు జమదగ్ని ప్రవాహాలు "అంతర్వాహిని" అని పిలుస్తారు, తరువాత, ఈ ప్రవాహాలు అన్ని విలీనమయి ఇప్పుడు సప్త గోదావరి కుండం గ పిలువబడుతుంది

ఆలయ సమయాలు :
ఉదయం 05:30 నుంచి మధ్యాహ్నం 01:30 వరకు, మరల మధ్యాహ్నం 01:45 నుంచి 09:00 వరకు ఆలయం తెరచి ఉంచును.

రవాణా :
By Road:
ద్రాక్షారామం కాకినాడ, రాజమండ్రి, సామర్లకోట వంటి పట్టణాలకు సమీపంలోనే ఉంది. ఇది రామచంద్రపురం నుండి 6 కిలో మీటర్లు దూరంలో ఉంది ఇక్కడి నుండి బస్సు సదుపాయం కలదు. కాకినాడ, రామచంద్రపురం నుండి ఆలయమునకు వెళ్ళుటకు ప్రభుత్వ బస్సు సౌకర్యం కలదు.

By Train:
ద్రాక్షారామానికి 31 కి.మీ దూరంలో సామర్లకోట రైల్వే స్టేషన్ కలదు.

By Air:
ద్రాక్షారామానికి 47 కి.మీ దూరంలో రాజమండ్రి విమానాశ్రయం కలదు.


సంప్రదించండి :
శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం, ద్రాక్షారామం,
రామచంద్రపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్ - 533 262.

draksharamam temple rooms booking, draksharamam matter in telugu, draksharamam bhimeswara swamy temple story in telugu, draksharamam shiva temple, draksharamam, andhra pradesh, 

Comments

Popular Posts