ఆలయ చరిత్ర :
స్థల పురాణం ప్రకారం, ద్వారరాయుగ చివరలో 5053 సంవత్సరాల క్రితం మహర్షి నారదనను విమోచనము పొందటానికి ఉత్తమ మార్గం సూచించామని సౌనకాది ఋషి అడిగారు. శ్రీకృష్ణుడు సృష్టించిన కృష్ణా నదికి సమీపంలో నివసిస్తూ, మోక్షం సాధించడానికి కృష్ణా నది పవిత్ర జలంలో స్నానం చేసి అమరేశ్వరుడిని దర్శించాలి అని నారద మహర్షి సలహా ఇచ్చాడు. అప్పుడు సౌనకాది ఋషి ఈ ప్రాంతంలో మూడు రోజులకు పైగా ఉండి, పవిత్రమైన నదిలో స్నానం తర్వాత భగవంతుడు అమరేశ్వరుడిని దర్శించుకునేవాడు ఇలా అతను మోక్షాన్ని పొందుతాడు.
ఈ ప్రాంతాన్ని ధాన్యకటకం లేదా వారణాసి అని పిలువబడుతుండేది. రాక్షసులకు మరియు దేవుళ్ళకు జరిగిన యుద్దములో దేవుళ్ళు ఓడిపోవడంతో పరమ శివుడిని ఆశ్రయించగా అప్పుడు దేవతామూర్తులను ఈ అమరావతిలో ఉంచి రాక్షసులను ఈ ప్రాంతములోనే వధించాడు.అప్పటి నుండి ఈ ప్రాంతం అమరావతి అని పిలువబడుతుంది. 18 దేవతలలో నాలుగవదిగా పరిగణించబడుతున్న తన భార్య బాల చాముండికాతో ఇక్కడ అమరేశ్వరుడు పూజలు అందుకుంటాడు.
అమృతలింగంలో పెద్దముక్క ఇక్కడ పడింది. అంతేగాక అది పెరగసాగింది. అప్పుడు సూర్యుడు మారేడు దళాలతో శివుణ్ణి అర్చించాడుట. దానితో పెరగటం ఆగింది. నేడు అమరావతి, ధరణికోట అనే పేర్లతో పిలవబడుతున్న ప్రాంతాలే ఆ నాటి ధాన్యకటకము.ఈ ప్రాంతము నదీతీరమగుటచేత సారవంతమైన భూమి వున్నందున ఇక్కడ ప్రజలు ఎక్కువగా నివసించేవాళ్ళు. మొదట ఇక్కడ నాగులు అనే అతి ప్రాచీన జాతివాళ్ళు నివసించేవారు. తర్వాత యక్షులు. వీరి కాలంలోనే ఇక్కడ శైవ మతాభివృధ్ధి చెందింది.అంతేకాదు, బౌధ్ధ, జైన మతాలు కూడా ఇక్కడ ప్రాచుర్యాన్ని పొందాయి. అశోక చక్రవర్తి బౌధ్ధమత ప్రచారానికి మహాదేవస్ధవీరుడు అనే ఆయనను ఈ ప్రాంతానికి పంపించాడు. అతడు ధాన్యకటకమును కేంద్రముగా చేసుకుని తన ప్రచారాన్ని సాగించాడు. శాతవాహనుల కాలంలో ఇప్పడున్న స్తూప ప్రాంతములో అతి పెద్ద స్తూపము రమ్యమైన శిల్పాలతో అలరారింది. దీని నిర్మాణం నాగరాజులనుండి నాగార్జుని కాలం వరకు మొత్తం నాలుగు దశలలో పూర్తయింది.
తర్వాత కాలంలో ఇక్ష్వాకులు తెలుగు నేలను పరిపాలించారు. కానీ వారు శ్రీ కొండను (నేటి నాగార్జున కొండ) రాజధానిగా చేసుకున్నారు. దానితో ధాన్యకటకము ప్రాబల్యము తగ్గింది. శంకరాచార్యుల వారి కార్య దీక్షతో వైదిక మతం మళ్ళీ బలపడింది. క్రీ.శ. 5వ శతాబ్దములో చైనా యాత్రికుడు హుయాన్ చాంగ్ కూడా ధాన్యకటకము గురించి వ్రాశాడు. క్రీ.శ. 1526 లో హంద్రికల పెదప్పంగారు ఆలయాన్ని మూడోసారి పునరుధ్ధరించారు. తురుష్కుల దాడులలో ధాన్యకటకము అతలాకుతలమయింది. స్తూపము నేలమట్టమయింది. కోటపాడుపడింది. అయినా అమరేశ్వరుడు మాత్రం ఆంధ్రరాజులకు ఆరాధ్యదైవంగానే వున్నాడు.
ఇక్కడ అమరేశ్వరుడు లింగరూపములో 15 అడుగుల పొడవుగా ఉంటాడు, ఇది వాస్తవానికి అయక స్థూపము లేదా అయాక స్తంభంగా పరిగణించబడింది. తరువాత ఇది పవిత్ర శివలింగ చిహ్నంగా పేరొందింది. ఈ ఆలయం ద్రావిడ శైలి నిర్మాణానికి మంచి ఉదాహరణ. ఆలయానికి నాలుగు గోపురాలు ఉంటాయి, మధ్యయుగ కాలంనాటి మరియు 11వ శతాబ్దం పూర్వంనాటి రాతి శిలాజాలు,విగ్రహాలు ఆలయంలో ఉన్నాయి.అమరావతి యొక్క కోట గోడలపై అనేక శాసనాలు ఉన్నాయి మరియు ఇక్కడ గల మండపం కృష్ణదేవరాయలచే నిర్మించబడింది.వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని అభివృధ్ధి పరచినవారిలో శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ముఖ్యుడు. ఈయన హయాంలో ఆలయ పునరుధ్ధరణ చెయ్యటమేగాక అక్కడ పని చేసేవారికి, వ్యాపారులకు ఇళ్ళు కూడా కట్టించారు.
ఆలయం గురించి :
అమరలింగేశ్వర స్వామి ఆలయం గుంటూరు నగరం సమీపంలో అమరావతి పట్టణంలో పంచరామ క్షేత్రాలలో ఒకటైన "అమరరామ"గా పేరొందింది. ఇక్కడ వెలిసిన శివుడిని అమరేశ్వర స్వామి లేదా అమరలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. ఈ ఆలయం కృష్ణా నది దక్షిణ ఒడ్డున ఉంది. బాల చాముండికా దేవి అమరేశ్వర స్వామి యొక్క సతీమణి. ఈ ప్రదేశంలో శివలింగంను దేవతల దేవుడైన ఇంద్రుడు ప్రతిష్టించారని ప్రతీతి. మౌర్యుల సామ్రాజ్యంను పతనం చేసి 2 వ శతాబ్దం నుండి 3 వ శతాబ్దం వరకు ఆధిపత్యం వహించిన ఆంధ్ర రాజులు అయినటువంటి శాతవాహనుల యొక్క రాజధాని ఈ అమరావతి.
ఈ అమరావతి దేవాలయం శివునికి అంకితం చేయబడింది మరియు 15 అడుగుల ఎత్తైన తెల్లని పాలరాయి శివలింగమును కలిగి ఉంటుంది. అమరావతి ఆలయం యొక్క నాలుగు వైపులా ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించిన పెద్ద గోపురాలు ఉన్నాయి. అమరేశ్వర స్వామి ఆలయంలో క్రౌంచ శైల అనే చిన్న ఊయల కనుగొనబడింది. అమరావతిని ఒకప్పుడు ధాన్యకటక/ధరణికోట అని పిలుస్తారు మౌర్య పరిపాలన ముందు కాలంలో నిర్మించిన అద్భుతమైన బౌద్ధ స్థూపం ఈ అమరావతిలో ఉంది.ఈ అమరావతి పంచరామాల్లో ఒకటి.ఇతర నాలుగు పంచరామ దేవాలయాలు కుమారరామ, క్షీరరామం, భీమరామ మరియు ద్రాక్షారామం ఉన్నాయి.
ఇక్కడ ఉన్న శివలింగము చాలా ఎత్తుగా ఉంటుంది ఈ శివలింగమునకు పూజలు మరియు అభిషేకాలు చెయ్యడానికి అర్చకులు ప్రత్యేకంగా ఏర్పర్చిన నిచ్చెనపై నుండి వెళ్లి చేస్తారు. శివలింగం పైన ఒక ఎరుపు మచ్చ ఉంటుంది, శివలింగము యొక్క పరిమాణం పెరిగేటప్పుడు దాని పెరుగుదల ఆపడానికి ఒక మేకుతో కొట్టారు అని చెబుతారు. మేకుతో శివలింగంను కొట్టినప్పుడు రక్తస్రావం అయ్యిందని ఆ మరక ఈనాటికీ చూడవచ్చు.
ఈ ఆలయానికి మూడు ప్రాకారాలున్నాయి. నాలుగు దిక్కులా నాలుగు ధ్వజ స్తంభాలు వున్నాయి. ఇక్కడ ప్రణవేశ్వర, అగస్తేశ్వర, కోసలేశ్వర మొదలగు శివ లింగాలేకాక ఇంకా అనేక దేవతా మూర్తులున్నారు. రెండవ ప్రాకారంలో వున్న కాలభైరవుడు ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు. మూడవ ప్రాకారంలో నైరుతిలో శ్రీశైల మల్లికార్జునుడు, వాయువ్య దిశలో కాశీ విశ్వేశ్వరుడు, ఈశాన్యంలో చండీశ్వరుడు, ఆగ్నేయంలో శ్రీకాళహస్తీశ్వరుడు ప్రతిష్ఠింపబడ్డారు. భౌగోళికంగా ఆ పుణ్య క్షేత్రాలు అమరావతికి ఆ దిక్కుల్లోనే వుండటం గమనించదగ్గ విషయం. శివ కేశవులకు బేధము లేదని నిరూపిస్తూ వేణు గోపాల స్వామి ఆలయం కూడా ఈ ప్రాకారంలో వుంది. అందరికీ గర్భ గుడిలోకి ప్రవేశం లేదు. ఇక్కడ అమ్మవారు శ్రీ బాల చాముండేశ్వరీ దేవి. ఈ దేవేరి శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణిపబడుతోంది. భక్తుల ఈతి బాధలనుండి విముక్తి కలిగించి మనశ్శాంతిని, సుఖసంతోషాలను ప్రసాదించే చల్లని తల్లి అని భక్తులు భావిస్తారు.
పూర్వం దేవతలు దానవుల మీద యుధ్ధానికి వెళ్ళే ముందు ఈ క్షేత్రంలో కొన్ని సంవత్సరాలు వుండి, ఈ స్వామిని అర్చించి తగిన శక్తిని పొందారు. ఈ స్వామిని అర్చించినవారిలో శౌనకాది మహా మునులు కూడా వున్నారు. యుగాల పర్యంతం పంచాక్షరీ మంత్రోఛ్ఛారణతో పవిత్రమైన ఈ ప్రాంతాన్ని దర్శించినంత మాత్రానే మనలోనూ నూతన శక్తి ప్రవేశిస్తుందని భక్తుల నమ్మకం.
ఆలయ సమయాలు:
ఆలయం ప్రతి రోజు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు తెరిచి ఉంటుంది.
రవాణా :
By Road:
అమరావతి గుంటూరు పట్టణం నుండి 32 కి.మీ.దూరంలో ఉంది. అమరావతి విజయవాడకి 42 కి.మీ.దూరంలో ఉంది.అమరావతికి రాష్టంలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి రోడ్డు మార్గం కలదు.
By Train:
దేవాలయానికి 19 కి.మీ. దూరంలో పెద్దకూరపాడు రైల్వే స్టేషన్ ఉంది.
By Air:
దేవాలయానికి 57కి.మీ దూరంలో గన్నవరం జాతీయ విమానాశ్రయం ఉంది.
సంప్రదించండి :
శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానం,
అమరావతి, గుంటూరు జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్, పిన్ కోడ్: 522 020
ఆఫీస్: 08645 - 255241
amaralingeswara swamy temple website, amaravathi amaralingeswara swamy temple timings, amaravati temple contact number, amaralingeswara cave temple, vijayawada to amaravathi temple bus timings, vijayawada to amaravathi temple distance, amaravati temple photos, amareswara swamy temple contact number, amaralengeswara swamy temple history telugu.

Comments
Post a Comment