Sri Vigneswara Swamy Vari Devasthanam | Ainavilli

ఆలయ చరిత్ర :
అయినవిల్లి క్షేత్రం ఏ పురాణంలోను ప్రస్తావించబడలేదు. ప్రాచీన సాహిత్యంలో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన కనబడదు. కానీ 14వ శతాబ్దంలో శంకరభట్టుచే సంస్కృతంలో వ్రాయించిన శ్రీ పాద శ్రీ వల్లభ చరిత్రలోను, దీనికి తెలుగు అనువాదమైన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించబడింది. క్రీ. శ. 1320 లో జన్మించిన శ్రీపాద శ్రీవల్లభుల మహామహుల మల్లాది బాపన్నవధానులు. వారి కాలంలో 'అయినవిల్లి' లో స్వర్ణ గణపతి మహా యజ్ఞం జరిగినట్లు, శాస్త్రం ప్రకారం చివరి హోమములో ఆహుతులను గణపతి తన తొండంతో అందుకోవాలని, గణపతి స్వర్ణమయ కాంతులతో దర్శనం ఇవ్వాలని కొందరు పండితులు వాదించినట్లు, యజ్ఞాతంలో గణపతి అదే విధంగా దర్శనమిచ్చి ఆహుతులను స్వీకరించినట్లు, అనంతరం కొద్దికాలంలోనే భాద్రపద శుద్ధ చవితినాడు తాను దత్తావతారుడైన శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించినట్లు తెలియజేశాడని శ్రీపాదశ్రీవల్లభ చరిత్రలో చెప్పబడింది.


గణపతిని అవహేళన చేసిన ముగ్గురు నాస్తికులు తదుపరి జన్మలో ఒకరు గ్రుడ్డివానిగాను, మరొకరు మూగవానిగాను, మూడవవాడు చెవిటివానిగానూ పుట్టినట్లు, వారు కాణి స్థలాన్ని సేద్యం చేస్తున్నప్పుడు బావిలో గణపతి లభించి, కాణిపాక వినాయకునిగా ప్రసిద్ధి చెందినట్లు తెలియచేయబడింది. దీనిని బట్టి కాణిపాక వినాయకుని కన్నా అయినవిల్లి వినాయకుడు ప్రాచీనుడని తెలుస్తోంది.

దక్ష ప్రజాపతి దక్షయజ్ఞ ఆరంభంలో ఈ గణపతిని పూజించినట్లు ఒక గాధ ప్రాచుర్యంలో వుంది. ఆలయ తీరుతెన్నులు విశాల ప్రాంగణం గల ఈ సిద్ది గణపతి ఆలయ ప్రాంగణంలోని నైరుతి భాగంలో దక్షిణాభిముఖంగా వుంది. గణపతి ఆలయానికి ఎదురు ప్రాకారానికి గోపురం నిర్మించబడింది.

ప్రాంగణం మధ్య భాగంలో తూర్పు ముఖంగా అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరాలయం, దానికి కుడివైపున తూర్పుముఖంగా శ్రీ భూ సమేత కేశవస్వామి ఆలయం, తూర్పుముఖంగానూ వున్నాయి. ప్రాకారానికి తూర్పువైపున విశ్శ్వేశ్వర ఆలయానికి ఎదురుగా గోపురం నిర్మించబడి వుంది. ఆలయ ప్రాంగణాన్ని, ప్రాంగణంలోని ఆలయాలనూ పరిశీలిస్తే శివ, కేశవ ఆలయాలు అత్యంత ప్రాచీనమైనవిగాను, తూర్పు చాళుక్యుల కాలంలో ఆలయ పునరుద్ధరణ జరిగినట్లు మొదట క్షేత్రపాలకుడు కేశవ స్వామి అని, చాళుక్యుల కాలంలో కాలబైరవుడు ప్రతిష్టించబడినట్లు అప్పటినుంచి కాలబైరవుడు క్షేత్రపాలకునిగా ప్రసిద్ధి చెందినట్లు తెలుస్తోంది.

రవాణా :
By Road:
ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా లోని అమలాపురం నుండి రోడ్ మార్గము ద్వారా 12 కి.మీ
ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నుండి వయా యానాం, అమలాపురం , ముక్తేశ్వరం మీదగా 60 కి.మీ
ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుండి వయా రావులపాలెం, కొత్తపేట(బోడిపాలెం బ్రిడ్జి) మీదగా 60 కి.మీ

By Train:
ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుండి వయా రావులపాలెం, కొత్తపేట(బోడిపాలెం బ్రిడ్జి) మీదగా 60 కి.మీ

By Air:
ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయం నుండి వయా రాజమహేంద్రవరం రావులపాలెం, కొత్తపేట(బోడిపాలెం బ్రిడ్జి) మీదగా 70 కి.మీ

సంప్రదించండి :
శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం,
అయినవిల్లి , తూర్పు గోదావరి జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్ - 533 211.
ఫోన్ : 08856-225812

Temple timings : Morning 5 AM to 1 PM & Evening 3.30 PM to 8 PM  
Abhisekham will start 6:30 AM onwards everyday till 11:00 AM in normal days



Sri Vighneswara Swamy Devasthanam, ainavilli temple images, ainavilli temple distance, ainavilli temple homam timings, ainavilli temple annadanam timings, ainavilli temple matter in telugu, ainavilli vinayaka temple photos, ainavilli temple wikipedia in telugu, ainavilli vinayaka hd images

Comments

Popular Posts