Sri Venugopala Swamy Vari Devasthanam | Moolapet, Nellore

ఆలయ చరిత్ర :
1883 వ సంవత్సరంలో నిర్మించబడిన ఈ ఆలయం "శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి"కి అంకురార్పణ చేయబడింది. ఆలయం లోపల ఉన్న విగ్రహాల దేవతామూర్తులు నల్లని రాతితో చేయబడినటువంటి నీలమేఘశ్యాముడు, వేణుమాధవుడు, మురళీమోహనలోలుడు, దివ్యస్వరూపాన్ని కాంక్షించవచ్చు.


ఈ దేవాలయములో ధ్వజస్థంబం చాలా ఎత్తుగా ఉంటుంది. ప్రతీ శుక్ర మరియు శనివారాలు ప్రత్యేక పూజలు నిర్వహించబడును. ఈ దేవాలయానికి దగ్గరలో చాలా సందర్శించవలసిన దేవాలయాలు కలవు.

ఈ ఆలయం నెల్లూరు నుండి 96 కి.మీ. దూరంలో ఉన్న ఉదయగిరి కోటలో కొలువైఉన్నది. 14 వ శతాబ్ధపు విజయనగర రాజులు ఈ ఆలయం నిర్మాణానికి ముఖ్యులు. ఈ దేవాలయములో ఆలయం ధ్వజస్థంభం చాలా ఎత్తుగా ఉన్నటువంటి మహోన్నత శిఖరముగా ఉన్న నిదర్శనము గమనించవచ్చు. ప్రతీ శుక్ర మరియు శనివారాలు ప్రత్యేక పూజలు నిర్వహించబడును. ఈ దేవాలయానికి దగ్గరలో చాలా సందర్శించవలసిన దేవాలయాలు కలవు.

విజయనగర రాజులు, ఆ పండుగ సమయంలో స్వామివారికి, ఈ క్రింది ప్రత్యేక సేవలు అప్పట్లో చేసేవారు:
అంకురార్పణ
ధ్వజారోహణం
చప్పరం
శేశవాహనం
సూర్యప్రభ
హంసవాహనం
యాలివాహనం
చంద్రప్రభ
పడాలచప్పరం
హనుమత్ సేవ
పుష్పకవిమాన పల్లకి
వెన్నతలి
అశ్వవాహనం
ముసుగియ సేవ
పొన్నవాహనం.

ఆలయం గురించి :
"శ్రీ వేణుగోపాల స్వామి" దేవాలయం నెల్లూరు జిల్లాలోని మూలపేటలో ఉన్నది. ఇది ప్రసిద్ధి చెందిన 'కృష్ణుని' దేవాలయాల్లో ఒకటి. శ్రీ కృష్ణుడు మహా విష్ణువు యొక్క అవతారం. ఈ దేవాలయం 1883 లో నిర్మించబడినది. ఈ ప్రాంతములోనే 14వ శతాబ్దంలో విజయనగర రాజులు దృఢమైనటువంటి కోట నిర్మించారు. శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవస్థానం లో పూజలు ""పాంచరాత్ర " పాద్మసంహిత ఆగామానుసారం " పంచకాల పూజలు జరుగుతాయి విజయనగర రాజులు ప్రధానంగా  "శ్రీ వేణుగోపాల స్వామి" మరియు స్వామి  యొక్క భార్యలు 'రుక్మిణి' మరియు 'సత్యభామ' విగ్రహాలను కూడా పూజిస్తారు. ఈ విగ్రహాలు నల్లరాతితో నిర్మించబడినవి. శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయ ప్రతిష్టాపన 1873 , శ్రీ కంటబత్తిన పాపిరెడ్డి వారి చే గావించబడింది ఈ దేవస్థానంలోని మొట్టమొదటి హరిజన ప్రవేశం జరిగింది 1900.ఈ దేవస్థానంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారు క్షేత్రపాలకుడిగా వున్నారు. ఉపాలయాలుగా శ్రీ ఆంజనేయ స్వామి వారు వున్నారు ఈ దేవస్థానంలో  చైత్రశుద్ద ఏకాదశి మొదలు 10 రోజులు వైభవంగా జరుగును .

మూలపేటలోని వేణుగోపాలస్వామి దేవాలయం చాలా ప్రాచీనమైనది.
ఈ దేవస్థానం లో ప్రాతఃకాల గో విశ్వరూప దర్శనంతో స్వామి వారి పూజ కార్యక్రమాలు మొదలు అవుతాయి. గో పూజలకు విశేషము


ఈ దేవస్థానం వంశపారంపర్యం ధర్మకర్త ల వారి ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ దేవస్థానం లో పాంచరాత్ర పాద్మసంహిత ఆగమానుసారం పంచకాల పూజలు జరుగుతాయి.

ఈ దేవస్థానం లో పాంచరాత్ర పాద్మసంహిత ఆగమానుసారం పంచకాల పూజలు జరుగుతాయి.

'జీర్ణోద్ధరణ' అనే పూజ నిర్వహణలో భాగంగా :
ఆలయంలో సంప్రోక్షణ మరియు మహాప్రతిష్ట 'శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి' వారి చేతుల మీదగా జరిగాయి. చినజీయర్ స్వామి వారు, కొత్తగా నిర్మించినటువంటి ఆంజనేయస్వామి దేవాలయంలోని విగ్రహాన్ని ప్రతిష్టించారు.

ఆలయ సమయాలు:
ఉదయం 5.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు మరియు సాయంత్రం 5.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది.

రవాణా :
By Road:
శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం నెల్లూరు ఏ.పి.స్.ఆర్.టి.సి బస్టాండ్ కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇది కేవలం 1 కిలోమీటరు దూరంలో ఉంది.

By Train:
నెల్లూరు రైల్వే స్టేషన్ కేవలం ఆలయానికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది.

By Air:
సమీపంలో ఉన్న విమానాశ్రయం తిరుపతి.

సంప్రదించండి :
 శ్రీ వేణుగొపాల స్వామి వారి దేవస్థానం,

మూలపేట, నెల్లూరు జిల్లా,
ఆంధ్రప్రదేశ్ - 524 003.
Sri venugopala swamy temple nellore, Sri Venugopala Swamy Temple, Sri Venugopala Swamy Temple timings, mulapeta venugopalaswamy temple, Venugopala Swamy Temple Nellore, Moolapet Sri Venugopala Swamy Temple.

Comments

Popular Posts