Sri Venkateswara Swamy Vari Devasthanam | Dwaraka Tirumala

ఆలయ చరిత్ర :
ద్వారకా తిరుమల పూర్వకాలం నుండి ఒక ప్రసిద్ధి చెందిన ఆలయం. పురాణాల ప్రకారం ఈ ఆలయం కృతయుగంలో ప్రసిద్ది చెందింది మరియు ఇప్పటికీ భక్తులను ఆకర్షిస్తున్నది. బ్రహ్మ పురాణం ప్రకారం, శ్రీ రాముని యొక్క తాతగారు అయిన అజ మహారాజు తన వివాహం కోసం శ్రీ
వెంకటేశ్వర స్వామికి పూజలు చేసారు. ఇందుమతి 'స్వయంవరం' కోసం ఆ దారిన వెళ్లిన అజ మహారాజు స్వామి వారిని వెనుక చేసి వెళ్లగా, వధువు ఇందుమతి అతనికి పూలమాల వేసిన కూడా స్వయంవరంకి వచ్చిన రాజులతో అతను యుద్ధం చేయవలసివచ్చింది. అతను యుద్ధంలో ఉండగా స్వామి వారిని వెనుక చేసిన సంగతి గుర్తువచ్చి వెంటనే స్వామి వారిని స్మరించగా (ప్రార్ధించగా) అకస్మాత్తుగా రాజుల యుద్ధం విరమించారు.

ఒక విమాన శిఖరం క్రింద రెండు ప్రధాన విగ్రహాలను చూడడం ఒక గొప్ప వరంగా భావించవచ్చును, ఒకటి నిలువెత్తు విగ్రహం మరియు ఇంకొకటి పై అర్ధభాగమే కలిగిన విగ్రహం. ఆ సగ విగ్రహమును గొప్ప తపస్వి అయిన ద్వారకా ముని ప్రతిష్టించెను, అప్పట్లో వైఖానస ఆగమం ప్రకారం పూర్తిగా లేని ప్రతిమని పూజించడం వలన కోరికలు నెరవేరవు అని భావించి, అందరు మునులు కలిసి నిలువెత్తు విగ్రహమును ముందునుండి ఉన్న సగవిగ్రహం వెనుక భాగంలో ప్రతిష్టించారు. అలానే చిన్న విగ్రహమును పూజించడం వలన మోక్షం, పెద్ద విగ్రహంని పూజించడం వలన ధర్మ, అర్ధ మరియు కామములు సిద్ధిస్తాయని నమ్మకం. ఇక్కడ సంవత్సరంలో రెండు సార్లు తిరు కళ్యాణోత్సవం నిర్వహిస్తారు, చిన్న విగ్రహానికి 'వైశాఖ' మాసంలో మరియు పెద్ద విగ్రహంకి 'ఆశ్వీయుజ' మాసంలో జరుపుతారు.
గర్భగుడిలో అడుగుపెట్టిన భక్తులు అత్యంత ఉత్తేజకరమైన మరియు మంత్రముగ్ధమైన అనుభవం పొందుతారు. ఇక్కడి దేవుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ పరిమాణం సగభాగం వరకు మాత్రమే కనిపిస్తుంది మరియు దిగువభాగం భూమిలో పాతిపెట్టిన అనుభూతి కలుగుతుంది. ఆ విగ్రహ పాద భాగం "పాతాళం"లోని బలి చక్రవర్తి ఆరాధించుటకు సమర్పించినట్టుగా చెప్పబడుతుంది. 11 వ శతాబ్దంలో గొప్ప సంఘ సంస్కర్త అయిన శ్రీమద్ రామానుజ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూర్తి పరిమాణ విగ్రహంని ప్రధాన విగ్రహం వెనుక భాగంలో ప్రతిష్టించినట్టు చెబుతారు. తూర్పు ముఖంగా ఉన్న అర్థమండపంలో శ్రీ పద్మావతి మరియు నాంచారి విగ్రహాలు ప్రతిష్టించడం వలన ఆ పుణ్యస్థలం ఒక పరిపూర్ణ పుణ్యక్షేత్రంగా భావిస్తారు.
ఇక్కడ అత్యంత విచిత్రం ఏంటి అనగా కొండ అచ్చం పాము ఆకారంలో కనిపిస్తుంది. ఇది నాగ రాజు అయిన అనంత దేవుడే సర్పకొండ రూపంలో అవతరించి శ్రీ మల్లికార్జునున్ని పడుగ మీద మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తోక భాగంలో మోస్తున్నట్టుగా అనుభూతి కలిగిస్తుంది. దీనివలన శైవత్వం మరియు విష్ణుమతం ఒకటే అని చాటుతుంది, ఈ ఏకత్వం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇక్కడి గొప్ప నిర్మాణాలు అయిన గోపురం, మండపం మరియు ప్రాకారం మొదలైనవి శ్రీ ధర్మ అప్పరాయ (1762 - 1827) నిర్మించారు మరియు బంగారు ఆభరణాలు, వెండి వాహనాలు కృష్ణా జిల్లా మైలవరం రాణి చిన్నమ్మ రావు (1877 - 1902) సమర్పించారు, ఇవి వారి యొక్క ఉదారభావానికి నిలువెత్తు సాక్షాలు. ఇలాంటివి ఈ ప్రదేశం కీర్తిని ఇనుమడింపజేస్తున్నాయి.

ఆలయం గురించి :
"ద్వారక తిరుమల" ఒక పురాతన పవిత్ర స్థలం మరియు దక్షిణ భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ద్వారక తిరుమల విజయవాడ-రాజమండ్రి జాతీయ రహదారిపై పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన పట్టణం అయిన ఏలూరు నుండి 42 కి. మీ దూరంలో, మరియు విజయవాడ-విశాఖపట్నం ప్రధాన రైల్వేమార్గ మధ్యలోని బీమడోలుజంక్షన్ నుండి 15 కి. మీ దూరంలో ఉంది.

చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ ఆలయంని సందర్శించి స్వామి వారికి భక్తితో కానుకలు సమర్పిస్తుంటారు. ఇక్కడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, ప్రపంచ ప్రఖ్యాత తిరుమల బాలాజీ మందిరం ఆచారాలు మరియు సంప్రదాయాలను అనుసరిస్తున్నారు, అందువలన ద్వారకా తిరుమలని చిన్న తిరుపతి అని పిలుస్తారు. ఇక్కడ రెండు ఆలయాలు - కొండ కింద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మరియు కొండ మీద మల్లికార్జున స్వామి వారి ఆలయాల స్థాన భంగిమ సర్ప రూపంలా ఉంటుంది, మరియు ఇది అనంత దివ్య పాము శివుణ్ణి మరియు విష్ణువుని భరించుటకు ఇలా మారింది అనేలా ఉంది. శివుడు పడగ మీద మరియు విష్ణువు తోక మీద ఉండడం శైవత్వం మరియు విష్ణుమతం ఒకటే అని చెపుతుంది. ఆ ఏకత్వం ఈ ప్రపంచానికి భరోసా కలిగిస్తుంది.

గొప్ప ముని అయిన "ద్వారకా" తీవ్రమైన తప్పస్సు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్వీయం వ్యక్తమైన విగ్రహమును 'వల్మీకము'(చీమల కొండ)లో ప్రతిష్టించారు, అందువలన ఈ పుణ్యక్షేత్రాన్ని "ద్వారకా తిరుమల" అని పిలుస్తున్నారు, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వైకుంఠవాసుడు అనుకుంటారు కావున ఈ ప్రదేశాన్ని చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు.


శాస్త్రం ప్రకారం ఉత్తర భారత నదులైన గంగ మరియు యమున వంటి నదులు వాటి మూలాలకు వెళ్లేకొద్దీ చాల పవిత్రమైనవిగా భావిస్తారు, అలానే దక్షిణ భారత నదులు కృష్ణా, గోదావరి వంటి నదులు ప్రవహిస్తూ సముద్రములో కలవడానికి దగ్గర అయ్యేకొద్దీ ఇంకా పవిత్రమైనవిగా భావిస్తారు. అందువలనే ఆ నదుల రెండు వైపులా అనేక పుణ్యక్షేత్రాలు మరియు పవిత్ర స్నాన ఘట్టాలు తక్కువ దూరంలోనే ఉన్నాయి. ఈ ద్వారక తిరుమలను ఆ రెండు నదులు పూలమాలల అలకంరించబడిఉంటాయి. అందువలన ప్రాంతం, భారతదేశంలో గొప్ప స్థానం కలిగి ఉంది అని బ్రహ్మ పురాణంలో పేర్కొంది.

పెద్ద తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు వారి విరాళాలు, లేదా తలనీలాలు సమర్పించాలి అనుకోని, ఏ కారణం చేతనైన తిరుమల తిరుపతి వెళ్లలేని వారు, చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమలలో వారి సమర్పణలు, విరాళాలు సమర్పించి కోరికలు కోరుకుంటారు.

సంప్రదించండి :
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం,
ద్వారక తిరుమల (చిన్న తిరుపతి) – 534 426,
పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.
ఆలయం: +91 88292 71469
వసతి: 08829- 271427

రవాణా :
ఏలూరు, విజయవాడ, హైదరాబాద్ నుండి చాలా బస్సులు అందుబాటులో ఉంటాయి. ఏలూరు నుండి రోడ్డు మార్గాన గంటా పదిహేను నిమిషాలు పడుతుంది. భీమడోలు జంక్షన్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. భీమడోలు ఊరు విజయవాడ, రాజమండ్రి రాష్ట్ర రహదారి మధ్య ఉంది. డైరెక్ట్ బస్సుల్లో కాకుండా, ద్వారక తిరుమల వెళ్లువారు విజయవాడ, రాజమండ్రి నుండి వచ్చువారు భీమడోలులో దిగి అక్కడ నుండి బస్సులో ద్వారకా తిరుమల చేరుకోవచ్చును.

ద్వారకా తిరుమలకి దగ్గరగా భీమడోలు నందు రైల్వే స్టేషన్ కలదు (ఇక్కడ పాసెంజర్ రైళ్లు మాత్రమే ఆగును), ఇది విజయవాడ-విశాఖపట్నం ప్రధాన రైల్వే మార్గం నందు కలదు. ఎక్స్ ప్రెస్ రైలు లో అయితే విశాఖపట్నం వైపు నుండి వచ్చు ప్రయాణికులు రాజమండ్రి లేదా తాడేపల్లిగూడెం లో దిగవలెను అలాగే విజయవాడ వైపు నుండి వచ్చు వారు ఏలూరు లో దిగవలెను, ఇక్కడ దిగి బస్సులో ద్వారకా తిరుమల వెళ్లవచ్చును.

విమానం ద్వారా మీరు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) లేదా రాజమండ్రి విమానాశ్రయం (మధురపూడి) చేరుకుని, అక్కడ నుండి టాక్సీ లేదా బస్సు ద్వారా ఏలూరు చేరుకొని, ద్వారక తిరుమల వెళ్ళగలరు.


dwaraka tirumala annadanam timings, dwaraka tirumala suprabhata seva tickets, dwaraka tirumala darshan tickets online booking, dwaraka tirumala kalyanam tickets online booking meeseva,dwaraka tirumala dress code, meeseva dwaraka tirumala room booking, dwaraka tirumala temple booking counter dwaraka tirumala, andhra pradesh,dwaraka tirumala brahmotsavam dates 2020

Comments

Popular Posts