ఆలయ చరిత్ర :
దక్షిణ భారతదేశాన్ని శ్రీ కృష్ణదేవరాయ పాలించే సమయంలో విక్రమ సింహపురి (ఆ సింహపూరినే నేటి మన పొట్టిశ్రీరాములు జిల్లా) నందు ఉదయగిరి అనే ప్రాంతం ఉండేది, అందులో నర్రవాడ అనే గ్రామం కలదు, ఆ గ్రామం పక్కనే ఒడ్డిపాలెం అనే గ్రామమునందు కమ్మ సంఘంలో శ్రీ పచ్చవ వెంగమ్మ నాయుడు మరియు సాయమ్మ దంపతులకు శ్రీ రేణుకాదేవి అమ్మవారి కరుణతో పాప జన్మించెను మరియు ఆమెకి వెంగమాంబ అని నామకరణం చేసారు. చాల చిన్న వయస్సులోనే వెంగమాంబ తన తోటి పిల్లలకు దేవతామూర్తుల గొప్పదనం గురించి చాల మంచిగా ఉపదేశించేది. తను యుక్త వయస్సుకి రాగానే తన తల్లిదండ్రులు నర్రవాడ గ్రామానికి చెందిన వేమూరు గురవయ్య అనే సుశీలవంతుడు మరియు ధైర్యశాలిని వివాహమాడమనగా ఆమె ఆ కోరికను అంగీకరించి వివాహమాడింది.
తన వివాహం తర్వాత వెంగమాంబ మంచి భార్యగా తన కుటుంబభాద్యతలను చక్కగా నిర్వహిస్తూ ఆనందంగా ఉండేది. ఇది చూసి ఓర్వలేక తన ఆడపడుచు తనను మానసికంగా చాలా ఇబ్బందులకు గురిచేయాలని ప్రయత్నించేది, తననే కాక తన బావని తన అత్త మరియు ఆడపడుచుడు పెట్టె ఇబ్బందులను చాలా అవలీలగా అధిగమించేది.ఒకసమయంలో వర్షాలు కురవక ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని కరువుతో అలమటిస్తూ నీటికోసం చాలా ప్రయాస పడేవారు. నర్రవాడ గ్రామస్థులు మాత్రం ఆ ఊరి దగ్గరలోని బావి నుండి నీరు పొందేవారు కానీ ఆ నీరు అగ్ర కులాల వారు తీసుకెళ్ళేవరకు నీరు ఇస్తారేమో అని ఎదురుచూసి, పిమ్మట బడుగువర్గాలవారు తీసుకెళ్లేవారు.
ఒకసారి వెంగమాంబ నీటి కోసం ఆ బావి వద్దకి వచ్చి ఆ సంఘటనకు చలించి మానవత్వం గురించి అందరికి వివరించి నీటిని అందరికి అందేలా చేసారు. ఒకరోజు ఇంటికి తిరిగి వచ్చాక తన ఇష్ట దైవాన్ని ఆ గ్రామ ప్రజల కష్టాల గురించి ప్రార్ధించి రక్షించమని వేడుకొనెను. వెంటనే ఆ ఇష్ట దైవం అనుగ్రహంతో కుండపోతగా వర్షం కురిసి, ఆ ప్రజల కష్టాలు తొలగిపోయాయి. అప్పుడు, గ్రామస్థులు చాలా ఆనందంతో విలువైన పసుపు పచ్చ వస్త్రం ఒకటి ఆమెకి కానుకగా సమర్పించారు. ఇది సహించలేని వెంగమాంబ అత్త ఆ వస్త్రాన్ని దాచిపెట్టినది.
ఒకరోజు వెంగమాంబ భర్త గురవయ్య తన జంతువులను మేతకోసం అడవి తీసుకెళ్లారు, అదే సమయాన వెంగమాంబ మరియు తన స్నేహితులు అదే అడవిలో సంచరిస్తుండగా అడవి దొంగల ముఠా వారిని అడ్డగించింది. దీనితో భయభ్రాంతులై వారు పెద్దగా ఆర్తనాదాలు చేయసాగెను, వాటిని విని గురువయ్య ఆ ముఠాతో పోరాడి అందరిని గాయపరిచెను. ఇంతలో ఒక వ్యక్తి చెట్టు చాటునుండి బల్లెం విసరగా అది గురవయ్య ఛాతిలో గుచ్చుకుంది, వెంటనే గురవయ్య తన కత్తిని విసరగా ఆ దొంగ మరణించెను మరియు ఆ పరిణామంతో గురవయ్య సొమ్మసిల్లి పడిపోగా వెంగమాంబ దుఃఖిస్తుండెను. ఆమె స్నేహితులు గ్రామానికి చేరి, జరిగిన విషయాన్ని అందరికి తెలుపగా, వారు అక్కడకి చేరుకొని వారిని ఇంటికి చేరవేసెను.
గురవయ్యకి ఎంత వైద్యం అందించినా కోలుకొనలేదు, చాలా ప్రయత్నాలు చేసి మూడు రోజుల తర్వాత తన భర్త, ఇక జీవించరు అని తెలిసి సౌభాగ్యవతిగా తనువు చాలించాలి అని అతని చుట్టూ ప్రదక్షిణ చేసి అగ్నికి ఆహుతి అయ్యెను. ఆ సంఘటన తర్వాత ఆమె అంతర్వాణి వినిపించి నేను ఇక్కడే వెలుస్తాను అని చెప్పెను, అప్పటినుండి ఆమెని దేవతామూర్తిగా భావించి ఆమె పేరు మీద ఆలయం నిర్మించారు, అదే ఇప్పటి నర్రవాడ వెంగమాంబ దేవస్థానం. ఆమె చిన్నపుడు జీవించిన ఇల్లు ఇప్పటికి చెక్కు చెదరకుండా అలానే ఆ గ్రామంలోనే ఉన్నది.
ఆలయం గురించి :
శ్రీ వెంగమాంబ దేవత ఈ ప్రఖ్యాత దేవస్థానములో కొలువై ఉంది. శ్రీ వెంగమాంబ పేరంటాలు 300 సంవత్సరాల పురాతన దేవాలయం. ఈ ఆలయం నర్రవాడ అనే గ్రామములో ఉన్నది. ముఖ్యంగా పరిసర ప్రాంతాలలో నివసించే భక్తులు, దేవత శ్రీ వెంగమాంబ వారి కోరికలను తీరుస్తుందని బలమైన విశ్వాసం కలిగి ఉంటారు.
నర్రవాడ తిరునాళ్ల చాలా ప్రసిద్ధి చెందింది, ఈ ఆలయంలో ముఖ్యమైన సాంవత్సరిక పండుగలు జూన్/జూలై మరియు దసరా నవరాత్రి ఉత్సవం సెప్టెంబర్/అక్టోబర్ నెలలో జరుపబడుతాయి. ప్రతి సంవత్సరం ఐదు లక్షలకు పైగా భక్తులు ఈ తిరునాళ్లను సందర్శిస్తారు. విశ్వాసం తో ప్రార్థిస్తే దేవత తదుపరి సందర్శన లోపల భక్తుల కోరికలను తీరుస్తుంది అని భక్తుల నమ్మకం. ఇక్కడ ఎద్దులతో రాయి లాగడం తిరునాళ్ల పండుగలో చాలా పెద్ద కార్యక్రమం. నర్రవాడ వెంగమాంబ ఉత్సవాలు దేవస్థానానికి 2 కి.మీ దూరంలో గల అమ్మవారి స్వగ్రామం అయిన ఒడ్డిపాలెంలో ఘనంగా నిర్వహిస్తారు, అమ్మవారు వారి కులదేవత కావడంవలన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కన్నుల పండుగగా జరుపుకుంటారు.
ఒడ్డిపాలెంలోని ఆలయాన్ని పత్సావ వారి దేవరిల్లు అంటారు, ఈ ఆలయ నిర్వహణ భాద్యతలు ఆ గ్రామ ప్రజల ఆధీనంలో ఉంటుంది. శ్రీ నర్రవాడ వెంగమాంబ దేవస్థాన భాద్యతలు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలో ఉన్నాయి. ఇక్కడ పురోహితుడు చుట్టుపక్కల ఆలయాలను పర్యవేక్షిస్తూ వెంగమాంబ ఆలయానికి కావలసిన కార్యక్రమాలు చూసుకుంటుంటారు.
ఆలయ సమయాలు:
ఉదయం 7:00 గంటల నుండి మధ్యాహ్నము 1:00 గంట వరకు మరియు సాయంత్రం 3:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు.
వార్షిక పర్వదినములలో దేవాలయం ఉదయం 6:30 నుండి రాత్రి 8:30 వరకు తెరవబడుతుంది.
రవాణా :
By Road:
నరవాడ పామూరు మరియు బద్వేల్ రోడ్ల మార్గమధ్యలో ఉంది. తిరుపతి నుండి కనిగిరి వైపు ప్రయాణించి లేదా నెల్లూరు నుండి ఉదయగిరి వైపు ప్రయాణించి దత్తలూరు వద్ద దిగి అక్కడనుండి నర్రవాడ చేరుకొనవచ్చును.
By Train:
రైలులో అయితే చెన్నై-కలకత్తా రైలు మార్గంలో కావలి లేదా నెల్లూరు చేరుకొని అక్కడనుండి నర్రవాడ చేరుకోవచ్చును.
By Air:
ఈ ఆలయానికి 200 కి.మీల దూరంలో తిరుపతి జాతీయ విమానాశ్రయం కలదు.
సంప్రదించండి :
శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి దేవస్థానం,
నర్రవాడ, దుత్తలూర్ మండలం, నెల్లూరు జిల్లా,
ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్: 524 222.
narrawada vengamamba temple timings, vengamamba perantalu 2020, tarigonda vengamamba temple, vengamamba tirunala 2021 date, narrawada vengamamba charitra video, vengamamba jeevitha charitra telugu, sri vengamamba perantalu temple history telugu, nellore famous temples list, narrawada temple.

Comments
Post a Comment