Sri Varasiddi Vinayaka Swamy Vari Devasthanam | Kanipakam


ఆలయ చరిత్ర :
ఈ ఆలయం 11 వ శతాబ్దంలో చోళ రాజు కులోత్తుంగ చోళ ద్వారా నిర్మించబడింది మరియు విజయనగర రాజవంశ చక్రవర్తుల ద్వారా 1336 లో మరింత విస్తరించబడింది.
ఈ దేవస్థానము 1000 సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది, ఈ పురాతన ఆలయ స్థలపురాణం గురించి ఒక ఆసక్తికరమైన పురాణం కూడా ఉంది. 1000 సంవత్సరాల క్రితం, భౌతికంగా ముగ్గురు వికలాంగులు ఉండేవారు, విహారపురి అనే గ్రామ సమీపంలో ఒక రోజు ఇద్దరు వ్యక్తులు ఏరువాకతో బావిలోని నీరు తోడుతుండగా, మూడవ వ్యక్తి వ్యయసాయం చేయసాగెను. కొద్దీ సేపటి తరువాత ఆ బావిలోని నీరు అంతరించింది. అప్పుడు ఒక వ్యక్తి చేతిపార తీసుకొని ఒక బండరాయిని పగలకొట్టుటకు ప్రయత్నించగా రక్తం ధారాళంగా ప్రవహించసాగెను. ఈ దివ్య దృష్టిని గమనించగ, వారియొక్క వైకల్యాలు తొలగిపోయాయి మరియు స్వామి వారి విగ్రహం ఉద్భవించింది, అక్కడ ఉన్న ప్రజలు అందరు ఆశ్చర్య పడి, వివిధ పూజలు కొబ్బరి నీళ్లతో నిర్వహించారు. అప్పటి నుండి ఈ ప్రదేశం కాణిపాకంగా విరాజిల్లుతుంది.

ఇప్పుడు కూడా శ్రీ వినాయక విగ్రహం చుట్టూ బావిని చూడవచ్చు. ఎల్లప్పుడు విగ్రహం చుట్టూ నీళ్లు ప్రవహించడం కనపడుతుంది. ఇప్పటికి కూడా విగ్రహం తల మీద గాయం చూడవచ్చును. 1947 లో అర్గొండ గొల్లపల్లి గ్రామంలో ఒక భక్తుడు శ్రీ బెజవాడ సిద్దయ్య ఒక వెండి కవచాన్ని స్వామికి ఇచ్చారు. విగ్రహం పరిమాణం పెరుగుతుండటంతో, ఇప్పుడు విగ్రహానికి అమర్చడం లేదు. ఎల్లప్పుడు అక్కడ అన్ని ఋతువుల్లోనూ విగ్రహం ఆకారం చుట్టూ అదే స్థాయిలో నీరు ఉంటుంది. ఈ పవిత్ర జలం భక్తులకు తీర్థంగా ఇవ్వబడుతుంది. ఈ విగ్రహం కలియుగం ముగింపు వరకు క్రమం తప్పకుండా పరిమాణం పెరుగుతుంది అని భక్తుల నమ్మకం మరియు ముగింపు లో శ్రీ వినాయక స్వామి వారు వ్యక్తి గా కనిపిస్తారు అని కూడా నమ్మకం.
ఒక పాత పురాణంలో బహుదా నది గురించి చెప్పబడి ఉంది కాణిపాకం లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్వయంభుగా వెలసిన తరువాత, ఇద్దరు సోదరులు “సంకుడు” మరియు “లిఖితుడు” స్వయంభూగా వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని కాలినడక ద్వారా దర్శించుకోవలని కోరుకున్నారు. సుదీర్ఘమైన ప్రయాణం తరువాత “లిఖితుడు” చాలా అలిసిపోయి ఆకలిగా ఉండడం వలన మామిడి చెట్టు నుండి మామిడి పండు తీసుకోవాలని కోరుకున్నాడు మరియు అతనికి సహాయపడటానికి తన సోదరుడు కోరాడు. అప్పుడు అన్నయ్య అది రాజుకు చెందిన చెట్టు ఎవరు కోయరాదని హెచ్చరించాడు. కానీ చాలా అలిసిపోయి ఆకలితో మరియు ఎక్కువ ఆశ ఉండటం వలన మామిడి పండుని తీసుకోని తిన్నాడు. అపుడు అన్నయ్య అయిన “సంకుడు” రాజు దగ్గరికి తీసుకోని వెళ్లి సోదరుడు యొక్క దొంగతనం గురించి చెప్పాడు మరియు శిక్ష విధించవలసినదిగా అభ్యర్తించాడు. దురదృష్టవశాత్తు, రాజు కోపముతో అనుమతి లేకుండా పండు అపహరించినందుకు తమ్ముడి రెండు చేతులు నరికమని ఆజ్ఞపించారు మరియు శిక్ష అమలు చేసారు.

దురదృష్టకర సంఘటన వలన తన సోదరుడికి జరిగిన నష్టం గురించి విచారిస్తూ, స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ సమీపంలో ఉన్న నదిలో స్వామి వారిని ప్రార్థిస్తూ ఇద్దరు సోదరులు మునిగినారు. ఆశ్చర్యకరంగా “లిఖితుడు” కోల్పోయిన తన రెండు చేతులు తిరిగి పొందెను. అపుడు ఇద్దరు సోదరులు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకొని, వారిని ఆశీర్వదించమని కోరుకున్నారు. ఆ తరువాత పొరుగు గ్రామాల్లో స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మహిమ గురించి, మరియు లిఖితుడుకు ఆ నదిలో మునిగినందువలన కోల్పోయిన చేతులు (బహుదా) తిరిగిపొందటం గురించి ప్రచారించసాగెను, నాటినుండి ఆ నదిని "బహుదా నది " అని పిలుస్తారు.
వివాదాలను పరిష్కరించడం: ఇక్కడ మరొక ఆసక్తికరమైన సంగతి ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒక ప్రత్యేక సంఘటన గురించి "సత్య ప్రమాణం" చేస్తే, అది 'సత్యం' గా భావిస్తారు అని ఒక నమ్మకం. చాలా వివాదాలను ఈ పద్ధతి ద్వారా పరిష్కరిస్తారు. ఈ తీర్పుని కోర్ట్ తీర్పుకంటే ఎక్కువగా భావిస్తారు. ఒకవేళ ఎవరైనా తప్పుగా మాట్లాడితే, శ్రీ వినాయక స్వామి అతనిని శిక్షిస్తారని ప్రజల నమ్మకం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రూ. 516 /- మొత్తాన్ని ఆలయ అధికారులు సేకరిస్తారు. ఈ వేడుక ప్రతి రోజు జరుగుతుంది. అందువలన ప్రజలకు ఇక్కడ న్యాయం దొరుకుతుంది.

ప్రాచీన వేదాలలో శ్రీ వరసిద్ది వినాయక స్వామి అన్ని దేవతలు, గంధర్వులు, రాక్షసులు మరియు మానవుల గుణాలను కలిగి ఉన్నట్లుగా ప్రశంసించారు. మరియు 'అధర్వశీర్షోపనిషత్' లో శ్రీ వరసిద్ది వినాయక స్వామిని పరమాత్ముడైన పరబ్రహ్మ స్వరూపిణిగా స్తుతించారు (సంపూర్ణమైనది). గణపతి దీక్ష తీసుకొని, భక్తులు గణేశుని దీవెనలతో వారి కోరికలు తీర్చుకుంటారని ఒక నమ్మకం. ఈ దీక్ష 41 రోజులు(మండలం), 21 రోజులు (సగం మండలం), 11 రోజులు (ఏకాదశ) గా చెయ్యవచ్చును. ఈ దీక్ష అయ్యప్ప స్వామి మరియు శివ దీక్ష వంటిది. నియమాలు మరియు నిబంధనలు దాదాపుగా ఒకటే. శ్రీ గణేశ దీక్షా, ఏ గణేశ ఆలయంలోనైనా మొదలు పెట్టవచ్చు కానీ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం వద్దనే ముగించాలి అని భక్తుల విశ్వాసం.
మూల విగ్రహం (ప్రధాన దేవత) యొక్క ముఖ్యమైన లక్షణం ఏమిటంటే విగ్రహం అరుదుగా ఉత్తరం వైపు చూస్తూ ఉన్నట్టు ఉంటుంది. సూర్యుడు మొదటి కిరణాలు మూల విగ్రహం యొక్క పాదాల మీద పడతాయి. క్రమంగా సూర్య కిరణాలను మూల విగ్రహం యొక్క తలను చేరుకునేసరికి కనిపించవు. ప్రధాన విగ్రహం సంవత్సరం పొడవునా పెరుగుతుంది, 1945 నుంచి వివిధ పరిమాణాల వెండి కవచం ఆలయ ప్రధాన ద్వారం వద్ద ప్రదర్శించబడుతున్నాయి.

ఆలయం గురించి :
కాణిపాకం దేవస్థానం చిత్తూరు జిల్లా లో కాణిపాకం అనే గ్రామము లో ఉంది. ఈ పురాతన వినాయక ఆలయాన్ని కాణిపాకం వినాయక ఆలయం అంటారు. ఈ ఆలయం లో ప్రధాన దేవుడు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఒక స్వయంభు విగ్రహంగా అవతరించబడింది అని భక్తుల నమ్మకం. ఈ దేవాలయం లో ఒక ఆసక్తికరమైన నిజం ఉంది ఎందుకంటే వినాయక స్వామి వారి పరిమాణం రోజు రోజుకు పెరుగుతోంది. ఈ విగ్రహం కలియుగం ముగింపు వరకు పరిమాణం పెరుగుతు ఉంటుంది అని భక్తుల నమ్మకం. ఈ ఆలయాన్ని ప్రజలు ఎక్కువగా నమ్ముతారు. ఇప్పుడు కూడా శ్రీ వినాయక స్వామి విగ్రహం చుట్టూ బావిని చూడవచ్చు. ఎల్లప్పుడూ విగ్రహం చుట్టూ నీళ్లు ప్రవహించడం కనపడుతుంది. ఈ పవిత్ర జలం భక్తులకు తీర్థంగా ఇవ్వబడుతుంది. ఈ దేవస్థానం, 800 పాత సంవత్సరాలు క్రిందట 11 వ శతాబ్దంలో చొళ రాజుచే కట్టబడింది. పాత రోజుల్లో కాణిపాకం గ్రామం పేరు "విహారపురి” అని పిలిచేవారు.
"కానీ" అనగా ఒకటిలో నాల్గవ వంతు భూమి అని అర్తం."పాకం" అనగా నీరు పారే భూమి(నీటిపారుదల). ఈ సూచన "కాణిపారకం" గా గుర్తింపు పొందింది. చివరికి "కాణిపాకం" తమిళ అతీతంగా (ఉత్పన్నమైన)పదంగా గుర్తించబడింది.


ఈ పురాతన ఆలయ పురాణం ప్రకారము, ముగ్గురు సోదరులు ఉన్నారని వాటిలో ప్రతి ఒక్కలు వికలాంగులు ఐయ్యారని పురాణంలో చెప్పబడి ఉంది. ఒక రోజు, వారు నీటి కోసం బాగా బావిని త్రవ్వించగా అకస్మాత్తుగా నిర్మాణంలో వున్నా ఒక రాయి కనబడింది, తరువాత ఎరుపు రంగులో నీరు బాగా ప్రవహించింది, నీటితో నిండిన బావి నుండి రక్తం బయటకు కారడం గమనించారు. ఈ దివ్య దృష్టిని గమనించగా, వారి వైకల్యాలు తొలగిపోయాయి.

స్వామి వారి “స్వయంభు” విగ్రహం బావి నుండి ఉద్భవించింది. తరువాత, ప్రజలు బావి చుట్టూ ఒక ఆలయం నిర్మించారు. నేటికి కూడా, ఉద్భవించిన విగ్రహం అసలు బావి లోనే ఉంది, మరియు వర్షకాలంలో బావి నుండి నీటి ఊటలు పారి బయటకు రాసాగాయి. విగ్రహంలో మరో వింత లక్షణం ఏమిటంటే, బావి నుండి పవిత్ర జలం పొంగి విగ్రహం ఇప్పటికీ పరిమాణం పెరుగుతోంది. ఈ విగ్రహం కలియుగం ముగింపు వరకు పరిమాణం పెరుగుతుందని ఆపై శ్రీ వినాయక స్వామి వ్యక్తి రూపం లో దర్శనం ఇస్తారని భక్తుల నమ్మకం. ప్రజలలో వివాదాలు ఉన్నపుడు ఒక ప్రమాణం తీసుకుని పవిత్ర ఆలయం నది లో స్నానము ఆచరిస్తే వారి పాపాలు తొలిగిపోతాయని మరియు వారి నిర్దోషిత్వాన్ని ఋజువు చేస్తాయని నమ్మకం.

పండుగలు మరియు వేడుకలు వినాయక చతుర్థినాడు జరుపుకుంటే మంచిది అని భక్తుల విశ్వాసం. ఆలయంలో కొత్త సంవత్సరంలో వినాయక స్వామి వారికి విశిష్ట పూజలు చేస్తే చాలా మంచిది. ఈ దేవస్థానంలో వార్షికంగా సంప్రదాయ ఆచారాలతో బ్రహ్మోత్సవం జరుపుతారు మరియు ఇరవైఒక్క రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఆలయంలో తెప్పోత్సవం పండగ చేస్తారు, ఈ పండగకు నలుమూలల నుండి భక్తులు వస్తారు.

పండుగలు మరియు వేడుకలు ఆలయంలో జరుపుకుంటారు. 21 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవం ఇది ఆలయములో జరిగే ప్రధాన వార్షిక ఉత్సవం. బ్రహ్మోత్సవం భాద్రపద సుద్ద చవితి నుండి మొదలయి 21 రోజులు కొనసాగుతాయి. ఈ బ్రహ్మోత్సవ సమయములో ఉభయదార అభిషేకం ఇతర సేవలు వంటి అభిషేకము ,పాలాభిషేకం, కళ్యాణం, ఉంజల్ సేవ మరియు ఏకాంతసేవలు జరగవు. ఈ బ్రహ్మోత్సవములో సిద్ది బుద్ది సమేత వినాయక స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి మరియు క్రింద వివరించిన విధంగా కాణిపాకం గ్రామంలోని 4 మాడ వీధుల్లో వివిధ వాహనములలో ఊరేగిస్తారు.

బ్రహ్మోత్సవం సమయంలో అన్నదానం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సందర్శించడానికి వచ్చిన యాత్రికులకు మరియు భక్తులకు నిరంతరాయంగా అన్నదానం చేయబడుతుంది.

సంప్రదించండి :
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం,
కాణిపాకం, ఐరాల మండలము, చిత్తూరు జిల్లా ,
ఆంధ్ర ప్రదేశ్. Pincode:517131.
ఎంక్వయిరీ నెంబర్: 08573-281540
ఆఫీస్: 08573-281747

రవాణా :
ఏ.పీ.ఎస్.ఆర్.టి.స బస్సులు చిత్తూరు, తిరుపతి నుండి అందుబాటులో ఉన్నాయి. కాణిపాకం చిత్తూరు నుండి 11 కి.మీ, తిరుపతి నుండి 75 కి. మీ దూరంలో ఉంది.

సమీప రైల్వే స్టేషన్ చిత్తూరులో ఉంది. రైలు ద్వారా చెన్నై, తిరుపతి అనుసంధానించబడింది. రైలు ద్వారా తిరుపతి, కాట్పాడి ప్రయాణిస్తున్నప్పుడు చిత్తూర్ జిల్లాకి వెళ్లదు అటువంటప్పుడు మీరు బస్సు ద్వారా చిత్తూరు కు చేరుకోవచ్చు. కాట్పాడి (కేవలం 35 కి.మీ చిత్తూరు నుండి) లేదా తిరుపతి (70 కి.మీ చిత్తూరు నుండి), సౌకర్యవంతంగా ఉంటుంది.

తిరుపతిలో సమీప విమానాశ్రయం కలదు. ప్రత్యక్ష విమానాలు బెంగుళూర్, హైదరాబాద్, చెన్నై నుండి తిరుపతికి అందుబాటులో ఉన్నాయి.


srikalahasti temple history in telugu, kanipakam temple timings 2020, kanipakam temple timings 2020,temple wikipedia in telugu, kanipakam images, about tirumala temple in telugu, kanipakam vinayaka original images, tirupati temple history in telugu wikipedia

Comments

Popular Posts