Sri Varaha Lakshmi Narasimha Swamy Vari Devasthanam | Simhachalam

ఆలయ చరిత్ర :
సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్ధం వరకు కనిపిస్తున్నది. కాని భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చు. సింహాచలం అంటే సింహం యొక్క పర్వతము అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాల్గవదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తి గా వెలశాడు. ఇతిహాసం ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి. తన కుమారుడైన ప్రహ్లాదుడిని పుట్టుకతోనే విష్ణు భక్తుడు. అనేక విధాల ప్రయత్నించి కూడా కుమారుని విష్ణు విముఖుణ్ణి చెయ్యలేకపోతాడు. చివరికి చంపించేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారీ ప్రహ్లాదుని విష్ణుమూర్తి రక్షిస్తాడు. విసిగిన హిరణ్యకశిపుడు ‘విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా, ఏడీ ఈ స్థంభంలో ఉన్నాడా? చూపించు’మని స్థంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొనివచ్చి, హిరణ్యకశిపుని సంహరించి, ప్రహ్లాదుడిని రక్షించాడు.


స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా నరసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్ళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతడికి భూమిలో కప్పబడి ఉన్న నరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సరకాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగే టట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు నరసింహ స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించబడుతుంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి ప్రతీరోజు చందనం తో పూత పూస్తుంటారు. నరుడు మరియు సింహము రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్ర లో (ఆసనంలో) సింహము తల కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది.

ఆలయం కచ్చితమైన వయస్సు తెలియదు, కానీ ఈ దేవస్థానానికి సంబందించిన శాసనాలను బట్టి అంచనా వేశారు నాటి కళింగ ప్రాంతాలను జయించిన చోళ రాజు కుళోత్తుంగ-I క్రీ.శ.1098-99 కాలములో నాటి ఒక శాసనం,ఆ విధంగా కూడా ప్రాముఖ్యత ఉన్న ప్రదేశంగా అయ్యింది. మరో శాసనం వెళ్లనందు రాణి గొంక III (1137-56) కాలములో నరసింహ స్వామికి సంబంధించి బంగారు వర్ణములో ఒక చిత్రం ఉంది. సింహాచలం ఆలయ ఇప్పటికీ విజయనగర సామ్రాజ్య శ్రీకృష్ణ దేవరాయ తన విజయాలు స్మరించుకుంటూ మరియు అతను మరియు అతని రాణి 991 ముత్యాలతో కలిగిన హారము మరియు ఇతర ఖరీదైన బహుమతులు సమర్పించారు అని శాసనాలు కలిగి ఉన్నాయి.
సింహాచలం దేవాలయంలో విజయనగర సామ్రాజ్యం యొక్క శ్రీ కృష్ణ దేవరాయ తన విజయాలు గురించి వివరిస్తూ, అతను మరియు అతని రాణి కి, ఇతర ఖరీదైన బహుమతుల హారముతో ఎలా యోధులను సమర్పించారో ఇప్పటికీ ఇక్కడ శాసనాలు ఉన్నాయి అని భక్తుల విశ్వాసము.
నిర్మాణపరంగా ఆలయం స్పష్టంగా అధిక ప్రశంసలుకు అర్హురాలని భావిస్తారు. ఈ దేవాలయంలో ఒక పెద్ద గోపురం, దాని పై ఒక చిన్న గోపురం, ఒక పదిహేడు స్తంభాల(చదరపు) మండపం (ముఖాముఖం అని పిలుస్తారు) వుంది. స్తంభాలలో ఒకటి కప్పా స్తంభం లేదా 'నివాళి స్థూపం' అని పిలుస్తారు. ఇది వ్యాధులను నయం చేయడం మరియు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు జన్మిస్తారు అని, గొప్ప శక్తులతో ఘనత పొందింది.

ఈ దేవత మూర్తిని చందనం లో ఉంచబడుతుంది, అక్షయ త్రితియా రోజున (వైశాఖమసం యొక్క 3వ రోజు) చందనయాత్ర (చందనోత్సవం) పండుగ వేడుకలో ఈ చందనం తొలగించబడి స్వామివారి యొక్క నిజ రూప దర్శనం భక్తులకు అందించబడుతుంది. ఇది ఈ దేవాలయంలో అతి ముఖ్యమైన పండుగ అని భక్తుల విశ్వాసం.

ఆలయం గురించి :
సింహాచలము విశాఖపట్టణమునకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లోప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపై ఉన్నది.

ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం (52 కోట్ల రూపాయలు) కలిగిన దేవాలయము. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవునినిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ద తదియ నాడు (మే నెలలో) వస్తుంది.గాలి గోపురము-సింహ ద్వారం

సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖముగా కాకుండా, పడమర వైపు ముఖమును కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారము ఐశ్వర్యమును ప్రసాదిస్తే, పడమర ముఖద్వారము విజయాన్ని ఒసగుతుందని హిందువుల నమ్మకం. కొండ మీద నుండి గాలి గోపురము మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 30 మెట్లు ఉంటాయి.

కప్ప స్తంభం
దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారములో కప్ప స్తంభం ఉన్నది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రం పై ప్రతిష్టితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనది అని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ కప్పస్తంభమును కౌగిలించుకొంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామి వారికి భక్తులు ఇక్కడే కప్పాలు (కప్పం:పన్ను) చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారు. కాలక్రమేణా అది కప్ప స్తంభం అయింది.


జల ధారలు
సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది. సింహగిరి జలసమృద్ధి గల ప్రాంతం. ఈ కొండలపై సహజసిద్ధమైన జలధారలు ఉన్నాయి. వీటిలో కొన్ని: గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార లు. భక్తులు ఈ ధారలలో స్నానాలు చేసి, దైవదర్శనం చేసి తరిస్తారు. స్వామికి తలనీలాలు సమర్పించుకొన్న భక్తులు సమీపంలోని గంగధారలో స్నానంచేసి దైవదర్శనానికి వెళతారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగములో సహజసిద్ధమైన నీటి సెలయేరు ఉన్నది. స్వామి కల్యాణము తరువాత ఈ ఘట్టంలో స్నానము ఆచరిస్తాడు. ఈ ధారపై యోగ నరసింహ స్వామి విగ్రహం ఉన్నది.

భైరవ వాక
సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించేది భైరవ వాక. ఆడివివరం గ్రామంలో మెట్ల వద్ద భైరవ ద్వారం ఉన్నది. ఇక్కడ భైరవస్వామి విగ్రహం ఉన్నది. ఈ విగ్రహం ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు. 13-16 శతాబ్ధాల మధ్య ఈ ప్రాంతం భైరవపురం గా ప్రాముఖ్యత పొందినది.

వరాహ పుష్కరిణి
వరాహ పుష్కరిణి సింహగిరి కొండ క్రింద ఆడవివరం గ్రామంలో ఉంది. ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకమారు తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకొని వచ్చి నౌకావిహారం చేయిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉన్నది.

సంప్రదించండి :
శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం,
సింహాచలం - 530 028, విశాఖపట్నం,
ఆంధ్ర ప్రదేశ్. ఆఫీస్ : 0891-2764949
విచారణ : 0891-2010452

రవాణా :
సింహాచలం దేవస్థానానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సులను సింహాచలం బస్సు డిపో నుండి బస్సులు ఉన్నాయి.విశాఖపట్టణం సిటీకి వెళ్లే బస్సులు అన్ని సింహాచలం మీదుగా వెళ్తాయి.
సింహాచలం దేవస్థానానికి 11.1 కిలోమీటర్ల దూరములో సింహాచలం రైల్వే స్టేషన్ ఉంది, మరియు విశాఖపట్నం ప్రధాన రైల్వే స్టేషన్ దేవస్థానం నుంచి 18.5 కిలోమీటర్ల దూరములో ఉంది.
సింహాచలం దేవస్థానానికి సమీపములో విశాఖపట్టణం జాతీయ విమానాశ్రయం ఉంది ఈ విమానాశ్రయం నుండి ప్రధాన నగరాలకు వెళ్లేందుకు విమానాలు అనుసంధానించబడి ఉన్నాయి.


about rk beach in telugu, annavaram wiki in telugu, simhachalam temple history in tamil, simhachalam matter in english, kailasagiri matter in telugu, sakshi ganapati temple history in telugu, simhachalam temple image, simhachalam temple robbery, simhachalam temple history in telugu.

Comments

Popular Posts