ఆలయ చరిత్ర :
శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం నెల్లూరు పట్టణం నందు కలదు. నెల్లూరు పెన్నా నది ఒడ్డున ఉన్నది, నెల్లూరు అను పదం తమిళం నుండి ఉద్భవించినది, "నెల్లి" అంటే వరి మరియు "ఉరు" అంటే వారి అని అర్ధం, అందువలన వరి పొలాలు గల ఈ ప్రదేశానికి నెల్లూరు అని పేరు వచ్చింది. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయం నెల్లూరులో 7 వ శతాబ్దంలో పల్లవ పాలకులచే నిర్మించబడింది. ఇక్కడ ఉన్న శ్రీ రంగనాథ స్వామి మహా విష్ణువు యొక్క అవతారాల్లో ఒకటి, ఇక్కడ స్వామి వారు శేష తల్పంపై శయనిస్తున్న భంగిమలో ఉంటారు.
పూర్వం లేదా ఇప్పటికి అయినను పెన్నా నది నీటి ప్రవాహం అదే స్థాయిలో ఉండడం ఎవరు ఊహించలేకపోతున్నారు. అప్పట్లో తెలుగులో సామెత ఉండేది, అది 'పెన్నా దాటుతే పెరుమాల సేవ' అని, అంటే "ఎవరు అయితే పెన్నా నది ప్రవాహాన్ని అధిగమిస్తారో వారు పెరుమాళ్(శ్రీ వెంకటేశ్వర) స్వామి వారిని దర్శించుకోగలరు"అని అర్ధం. 1946లో (06-12-1946) పెన్నా నది ప్రవాహం 25.6 అడుగుల స్థాయిని తాకింది, ఆ స్థాయే రంగనాథ స్వామి వారి పాదాల వరకు చేరింది.
అందుబాటులో ఉన్న పురాణాల ప్రకారం శ్రీ మహా విష్ణువు శ్రీదేవితో ఉన్నప్పుడు తను భూలోకానికి వెళ్ళాలి అనుకుంటున్నట్టుగా తన కోరిక వ్యక్తపరుస్తారు, అలాగే తను నివాసముండుటకు గాను భూమిపై అనువైన ప్రదేశంగా అవతరించామని ఆది శేషునికి (అయిదు పడగల సర్పం)ని ఆజ్ఞాపించెను. ఆది శేషుడు ఎక్కడైతే పర్వతరూపం ధరిస్తారో అక్కడే నాగదేవతల రాజు అయిన 'ఫణి రాజు' నివాసమై తనకు ప్రభువు పైగల గౌరవాన్ని చాటుకున్నారు, ఫణిరాజు చేసిన ఆ పనికి సంతోషించిన మహా విష్ణువు ఆ ప్రదేశాన్ని తల్పగిరి క్షేత్రంగా వర్దిల్లమని దీవించెను(క్షేత్రం అనగా ప్రదేశం). కశ్యప ముని తీర్థయాత్రలో భాగంగా చాలా పవిత్ర ప్రదేశాలను దర్శిస్తూ ఈ ప్రదేశాన్ని చేరుకొని పుండరీక యాగం చేసెను మరియు "ఏకాదశి" రోజున స్వామి వారు ప్రత్యేక్షమై అనుగ్రహించగా, స్వామి వారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్వీయంవ్యక్తమై ఇలానే అందరిని అనుగ్రహించాలి అని కోరెను.
క్రీ.పూ ఏడు-ఎనిమిది శతాబ్దాల మధ్యలో సింహపురి రాజులు మహా దేవుని ప్రతిష్టించెను, తదనంతర కాలంలో క్రీ.పూ 12వ శతాబ్దంలో శ్రీ రాజా మహేంద్ర వర్మ మరియు రాజరాజ నరేంద్ర రాజులు ఈ ప్రదేశంలో స్వామి వారికి గర్భగుడి మరి ఆలయం నిర్మించారు.
శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థాన గోపురం (ఆలయ గోపురం) ఒక ఎత్తైన మరియు ఏడు అంతస్థుల సమూహం. ఆ గోపుర శిల్పకళ దక్షిణ భారతదేశ నిర్మాణ శైలి అద్భుతాన్ని సూచిస్తుంది. ఆలయ గోపురంపైన బ్రహ్మ, విష్ణు & మహేశ్వరుల మరియు ఋషుల చిత్రాలను, వివిధ దేవతామూర్తుల భంగిమల శిలాకృతులను చూడవచ్చును. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం యొక్క పెద్దగా ఉండే చతురస్రాకార ద్వారాల పరిమాణం మరియు లోపలి గోడల దృఢత్వం ఆ కాలంనాటి శ్రేష్ఠమైన రాతి కట్టడాల పని తనానికి అద్దంపడుతున్నాయి.
శ్రీ రంగనాథ స్వామి దేవస్థాన గర్భ గుడి గోడలపై "శ్రీ విష్ణు సహస్ర నామావళి" లిఖించబడింది. సహస్ర నామావళి అంటే శ్రీ మహా విష్ణువు యొక్క వెయ్యి నామాలు, మరియు భక్తులు ఆలయంలో ప్రదక్షిణాలు చేసే సమయంలో ఈ వెయ్యి నామాలను స్తుతిస్తారు. దేవస్థానం వెనకవైపు ద్వారం నుండి వచ్చే కొంతమంది భక్తులు పెన్నా నదిలో మునిగిన తరవాత శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకొని ప్రార్థిస్తారు.
ఆలయం గురించి :
శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం నెల్లూరు పట్టణం నందు బస్టాండ్ కి 5కి.మీల దూరంలో ఉన్నది. ఈ దేవాలయం సుమారు 600 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిఉంది. ఈ ఆలయం పెన్నా నది ఒడ్డున కలదు మరియు ఆలయం నందు వాస్తు శిల్ప కళతో నిర్మించిన 70 అడుగుల ఎత్తులగల గాలిగోపురం ఏడు కలిశాలు ఒదగబడి ఉంది. ఈ కలిశాలు గల గాలిగోపురం ఆలయానికి ఒక గొప్ప శోయగం.
ప్రతి సంవత్సరం మార్చి-ఏప్రిల్ మాసాల్లో ఈ ఆలయంలో బ్రహ్మోత్సవం జరుపుతారు, ఈ సందర్భంలో చుట్టు పక్కల ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామి వారిని దర్శించి, వారి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ బ్రహ్మోత్సవం కొరకు నెల్లూరు వాసులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు.
పెన్నా నది ఒడ్డున శ్రీ కశ్యప మహర్షి యజ్ఞం చేసి, దానికి ప్రతిఫలంగా ఏడవ శతాబ్దంలో పల్లవ రాజు శ్రీ రాజరాజ నరేంద్ర తపస్సు చేసి తనని శ్రీ రంగనాథ స్వామిగా ప్రతిష్టించేలాగా వరం పొందెను. తరువాత 13వ శతాబ్దంలో శ్రీ జాతా వర్మ శ్రీ రంగనాథ స్వామి వారికీ చాలా విలువైన రాళ్లు మరియు లోహాలు బహుకరించెను. మహాభారతంలో విరాట పర్వం మొదలు అంత్యం వరకు శ్రీ కవి బ్రహ్మ తిక్కన పెన్నా నది ఒడ్డున రాసేను. తూర్పు దిక్కున ఏడు అంతస్థుల మహాగోపురం, దక్షిణాన రంగనాయకి లక్ష్మీదేవి ఆలయం మరియు అడ్డాల మేడ, పశ్చిమాన పెన్నా నది, ఉత్తరాన శ్రీ ఆండాళ్ అమ్మవారి ఆలయం కలవు.
ఆలయ సమయాలు:
ఆలయం ఉ.6: 00 గం.ల నుండి మ.12:00 గం.ల వరకు మరియు మ.4:30 గం.ల నుండి రా. 9:00 గం.ల వరకు తెరచి ఉంటుంది.
రవాణా :
By Road:
అన్ని ప్రముఖ పట్టణంల నుండి నెల్లూరుకి బస్సు సౌకర్యం కలదు, బస్టాండ్ నుండి 3 కి.మీ దూరం లో ఆలయం ఉన్నది.
By Train:
అన్ని ప్రముఖ పట్టణంల నుండి నెల్లూరుకి రైలు సౌకర్యం కలదు, రైల్వే స్టేషన్ నుండి ఈ ఆలయం 4 కి.మీ మాత్రమే.
By Air:
తిరుపతి విమానాశ్రయం నుండి 127 కి.మీ దూరంలో కలదు కావున అక్కడ నుండి బస్సు మరియు టాక్సీలు అందుబాటులో ఉన్నాయి.
సంప్రదించండి :
శ్రీ తల్పగిరి రంగనాథస్వామి వారి దేవస్థానం,
రంగనాయకులపేట, నెల్లూరు,
ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్: 524 002.
ఫోన్: 08622-210566
nellore ranganathaswamy brahmotsavam 2020, rajarajeswari temple nellore timings, nellore ranganathaswamy brahmotsavam 2020, ranganathaswamy temple timings, nellore temple timings, temples in gudur, nellore old temples, nellore is famous for, talpagiri ranganadha swamy temple history telugu.

Comments
Post a Comment