Sri Sahasra Lingeswara Swamy Vari Devasthanam | Ponnur

ఆలయ చరిత్ర :
ఈ ఆలయ ప్రాంగణ ప్రహరీలో శ్రీ సహస్రలింగేశ్వర స్వామి, శ్రీ వీరాంజనేయ స్వామి, శ్రీ గరుత్మంత స్వామి, శ్రీ దశావతరములు, శ్రీ కాలభైరవ స్వామి, శ్రీ స్వర్ణ వెంకటేశ్వర స్వామి వంటి ఆరు ఆలయాలు ఉన్నాయి.

ఈ దేవాలయాలలో శ్రీ సహస్రలింగేశ్వర స్వామి మరియు శ్రీ వీరాంజనేయ స్వామి వారు భక్తుల యొక్క విశ్వాసం ద్వారా పేరుగాంచిన దేవుళ్ళుగా ప్రసిద్ధి చెందారు.

శ్రీ సహస్రలింగేశ్వర స్వామివారి ఆలయం మొదటిసారి అంటే 1938 లో శ్రీ పార్వతి దేవి మరియు శ్రీ షణ్ముఖ స్వామితో పాటు శ్రీ వీరభద్ర స్వామి, శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించబడింది, ఇతర ఆలయాలు తరువాత నిర్మించబడ్డాయి.

'శ్రీ కోట జగన్నాధ స్వామి' వారు ఈ ప్రాంతంలో వివిధ గ్రామాల నుండి భక్తులచే విరాళాలు సేకరించి ఈ ఆలయాలను నిర్మించారు.


శ్రీమహావిష్ణు, శ్రీ సత్యనారాయణ స్వామి మరియు శ్రీ దశావతారములు దేవాలయాలు నిర్మించి, 1961 సంవత్సరంలో ప్రతిష్ట చేశారు. ఇటీవలే శ్రీ స్వర్ణ వెంకటేశ్వర స్వామి ఆలయం దాతలు చేత నిర్మించబడింది, మరియు ప్రతిష్ట కార్యక్రమం 16-08-2009 న నిర్వహించబడింది.

శ్రీ సహస్రలింగేశ్వర స్వామి వారు మరియు శ్రీ కాలభైరవ స్వామి వారికి పూజలు 'శ్రీ శైవ ఆగమ' సాంప్రదాయానికి అనుగుణంగా నిర్వహిస్తున్నారు.

శ్రీ వీరాంజనేయ స్వామి, శ్రీ గరుత్మంత స్వామి స్వామి, దశావతారములు ఆలయం, శ్రీ స్వర్ణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు, ఆచారాలు "వైఖానస ఆగమ" సంప్రదాయం ప్రకారం నిర్వహించబడుతున్నాయి.

ఆలయం గురించి :
శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి' మరియు 'శ్రీ వీరాంజనేయ స్వామి' దేవాలయం గుంటూరు జిల్లా, పొన్నూరు నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయంలో అనేక దేవత మూర్తులు వున్నారు.

'శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి', 'శ్రీ వీరాంజనేయ స్వామి', 'శ్రీ కాల భైరవ స్వామి', 'శ్రీ స్వర్ణ వెంకటేశ్వర స్వామి', 'శ్రీ గరుత్మంత స్వామి' వరుసగా ఉంటారు. 'శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి' దేవాలయంలో, శ్రీ హనుమంత విగ్రహం చాలా పవిత్రమైనది. ఈ విగ్రహం 12 అడుగుల వెడల్పు మరియు 24 అడుగులు ఎత్తు కలిగి ఉంటుంది. ఇక్కడ హనుమ విగ్రహం నల్ల రాతితో ఉంటూ భక్తులకి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. శ్రీ పొన్నం బాలచార్యులు గారి చేత రూపకల్పన చేయబడినది.

ఇక్కడ, సహస్ర లింగం అంటే వెయ్యి లింగాలు అని అర్ధం. శివ లింగాలను కాశి క్షేత్రం నుంచి తీసుకు రావడం వలన, దీనిని దక్షిణ కాశి అని కూడా పిలుస్తారు. శివ లింగానికి గంగాభిషేకం చేస్తారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి శివ లింగం నుండి గంధం తీసి, భక్తులకు పంపిణీ చేస్తారు.

ఆలయ సమయాలు:
ఈ ఆలయం ఉదయం 6:00 నుండి రాత్రి 8:00 వరకు భక్తులకు తెరిచి ఉంటుంది.

రవాణా :
By Road:
ఏ.పి.ఎస్.ఆర్.టి.సి తరచూ ఆలయానికి బస్సులను అందిస్తుంది. గుంటూరు బస్ స్టాండ్, ఆలయం నుండి 30 కి.మీ దూరంలో ఉంది.


By Train:
గుంటూరు రైల్వే స్టేషన్ నుండి 22 కి.మీ. దూరంలో ఈ ఆలయం ఉంది.

By Air:
ఆలయానికి సమీపము లో 79 కి,మీ. దూరం లో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయము కలదు.

సంప్రదించండి :
శ్రీ సహస్రలింగేశ్వర స్వామి ఆలయం,
పొన్నూరు , గుంటూరు,
ఆంధ్రప్రదేశ్, పిన్: 522 124,
ఆఫీస్: 08643 -247099
ponnur anjaneya swamy temple darshan timings, ponnur temple images, bhavanarayana swamy temple ponnur, ponnur garuda, mangalagiri temple timings, guntur hanuman temple, mopidevi temple timings, famous anjaneya temples in andhra pradesh, ponnur temple history telugu, sahasra lingeswara swamy vari temple history telugu.

Comments

Popular Posts