Sri Pydithalli Ammavari Devasthanam | Vizianagaram

ఆలయ చరిత్ర :
బొబ్బిలి మహారాజులు అధికార గర్వంతో పరిపాలిస్తున్న కాలమది, బొబ్బిలి మహారాజులు మరియు విజయమహారాజుల మధ్య అధికారం కోసం కొన్ని విభేదాలు పడుతున్నారు. ఈ కారణాల వల్ల బొబ్బిలి యుద్ధం జనవరి 23, 1757 లో ప్రారంభమైంది. యుద్ధసమయంలో బొబ్బిలి కోట పూర్తిగా నాశనమైంది మరియు అనేకమంది సైనికులు చనిపోయారు.

విజయరామరాజు భార్య మరియు చెల్లెలు "శ్రీ పైడిమాంబ" యుద్ధాన్ని ఆపటానికి ప్రయత్నించారు. కానీ రాజు వినకుండా యుద్ధాన్ని కొనసాగించాడు. ఆ సమయంలో చెల్లెలు "శ్రీ పైడిమాంబ"కు మసూచి అనే అంతుపట్టని వ్యాధి సోకింది. ఆమె పూజలో ఉన్నపుడు తన సోదరుడు రామ రాజు యుద్ధంలో ఆపద తప్పదని ఊహించి వెంటనే పతివాడ అప్పల నాయుడుని ఒక గుర్రపు బండితో తన సోదరుడికి విషయాన్నీ తెలియచేయమని పంపింది. కానీ అప్పటికే తాండ్ర పాపారాయుడు చేతిలో రామ రాజు మరణించాడు. అది తెలుసుకున్న పైడిమాంబ స్పృహ కోల్పోయింది.

పతివాడ అప్పల నాయుడు ముఖం పై నీరు చిలకరించాడు. స్పృహలో నుండి బయటకువచ్చిన పైడిమాంబ ఆయనతో ఇకపై నేను నివసించలేను నా ఆత్మను దేవుడిలో అంకితం చేస్తున్నాను అని తనువును చాలించారు. ఆమె ఒక చేపలు పట్టే వ్యక్తికి చేపల చెరువులో పైడిమాంబ విగ్రహం దొరికింది. అక్కడే పైడిమాంబ ఆలయాన్ని నిర్మించారు. శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానంగా విజయనగరంలో ప్రసిద్ధిగాంచినది.


ఆలయం గురించి :
శ్రీ పైడితల్లి అమ్మవారు దేవాలయం విజయనగరం పట్టణం నందున్న ఒక ప్రాచీన ఆలయం. ఈ ఆలయంలో శ్రీ పైడితల్లి అమ్మవారు కొలువైయున్నారు. విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఇక్కడ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సిరిమాను పండుగా లేదా  సిరిమానోత్సవం (సిరిమాను ఉత్సవం) అంగరంగ వైభవంగా జరుపుతారు, చుట్టుపక్కల పట్టణాలు మరియు గ్రామాల నుండి సుమారు 2-3 లక్షల మంది భక్తులు ఈ ఉత్సవములో పాల్గొంటారు.

పురాణాల ప్రకారం 18 వ శతాబ్దపు ఆలయం, విజయనగరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం మరియు, గజపతి వంశీయుడికి చెందిన దేవత "పైడిమాంబ" మరియు ఆమె రాజా 'రామరాజు' యొక్క సోదరి. 1756 లో విజయరామరాజు,  బొబ్బిలి  రాజుతో నిరంతర యుద్ధాన్ని ఎదుర్కొన్నాడు. 1757 జనవరి 23న బొబ్బిలిఫై దాడి చేయడానికి, విజయరామరాజుకి ఫ్రెంచ్ సైన్యాధిపతి జనరల్ డి.బుస్సి సహాయపడ్డాడు. బొబ్బిలి యుద్ధంలో బొబ్బిలి కోట దాదాపు పడగొట్టబడి, యుద్ధంలో అనేక మంది బొబ్బిలి  సైనికులు మరణించారు. రాజా విజయరామరాజు భార్య మరియు పైడిమాంబ (చెల్లెలు) మసూచి ఆనారోగ్యంతో బాధపడుతున్నారని, తెలియచెప్పి యుద్ధానికి దూరంగా ఉండటానికి విజయరామరాజును ఒప్పించ ప్రయత్నించారు.

ఆ సమయంలో తన సోదరుడు ఆపదలో ఉన్నాడని  తెలుసుకున్న పైడిమాంబ పూజ నిర్వహించింది. కానీ యుద్ధంలో, తాండ్ర పాపారాయుడు చేతిలో విజయరామరాజు మరణించాడు. ఇది తెలుసుకున్న పైడిమాంబ ఆవేదనతో ఇకపై నివసించలేనని తనువు చాలించింది. ఆ తరువాత ఆమె కలలో ఒక సందేశాన్ని "శ్రీ పతివాడ అప్పల నాయుడు(సైనికుడు)"కి ఇలా చెప్పింది. తరువాత ఆమె "శ్రీ పతివాడ అప్పల నాయుడు" కలలో కనపడి పశ్చిమదిక్కులో ఉన్న నా విగ్రహాన్ని వెలికితీసి ఆలయాన్ని నిర్మించమని చెప్పింది. అందువలన పైడిమాంబ దేవాలయం ఈ పెద్ద చెరువు సరస్సు సమీపంలో నిర్వహించబడింది.

ఆలయ సమయాలు:
ఉదయం 06:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు సాయంత్రం 1:30 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు తెరచి ఉండును.

దర్శనం :
Antharalaya Darsanam
స్లాట్స్ : 12 : 01 AM - 11 : 59 PM   విలువ : 30.00    వ్యక్తుల పరిమితి : 1

Athi Seegra Darsanam
స్లాట్స్ : 12 : 01 AM - 11 : 59 PM   విలువ : 300.00    వ్యక్తుల పరిమితి : 1

Jathara Seegra Darshanam
స్లాట్స్ : 11 : 00 AM - 01 : 00 PM   విలువ : 100.00    వ్యక్తుల పరిమితి : 1

రవాణా :
By Road:
విజయనగరం పట్టణం నుండి 64 కిలోమీటర్ల దూరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయము ఉంది. ఏ.పి.ఎస్.ర్.టి.సి. వారు క్షేత్రానికి తరచుగా ఉండే విధంగా బస్సులను ఏర్పాటు చేశారు.

By Train:
ఈ ఆలయానికి సమీపంలో విజయనగరం రైల్వే స్టేషన్ ఉంది.

By Air:
ఈ ఆలయానికి సమీపంలో విశాఖపట్నం విమానాశ్రయం ఉంది.


సంప్రదించండి :
శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం,
శివాలయం వీధి, విజయనగరం,
ఆంధ్ర ప్రదేశ్, పిన్ కోడ్: 535 002.

pydithalli ammavaru history in telugu, vizianagaram pydithalli ammavaru festival date 2020, vizianagaram history in telugu, pydithalli ammavaru festival 2020, vizianagaram pydithalli ammavaru festival date 2021, vizianagaram ammavari festival 2020, vizianagaram ammavari festival 2020 date, pydithalli ammavaru images

Comments

Popular Posts