Sri Prasanna Chennakesava Swamy Vari Devasthanam | Ongole

ఆలయ చరిత్ర :
శ్రీ ప్రసన్నచెన్నకేశవ స్వామి వారి దేవస్థానం ప్రకాశం జిల్లాలోనే ప్రాచీనమైన ప్రముఖ దేవస్థానం, విజయనగర సామ్రాజ్య పాలకులకు సామంత రాజులైన మందపాటి రాజు సోదరులు రామభద్రరాజు, రఘుపతి రాజులు 16వ శతాబ్దం చివరిలో ఒంగోలులో (ఇప్పటి కోట వీధిలో) కోటను నిర్మిచుకొని పాలించేవారు. వారి ఇష్టదైవమైన శ్రీ ప్రసన్నచెన్నకేశవ స్వామి వారిని కోటాలో ప్రతిష్టించి నిత్యం ధూపదీప నైవేద్యములతో పూజించేవారు.


కోట వైశాల్యం చిన్నది కావడం వలన ఉత్సవములు, పర్వదినములలో రద్దీవలన గ్రామస్తులు చెన్నకేశవ స్వామి వారిని బయట నుంచే దర్శించుకోవలసిన పరిస్థితి ఉండేది. అంతేకాక ఆ రోజుల్లో వెంకటగిరి రాజులతో ఉన్న వైరము వలన కోటభద్రతకు సేనాధిపతి రఘునాయకుడు చాలా ఇబ్బంది పడేవారు. ఈ విషయం గుర్తించిన మంత్రి వంకాయలపాటి వీరన్న విషయాన్ని రాజు గారి దృష్టికి తీసుకొని వచ్చారు. అంతేగాక శ్రీ ప్రసన్నచెన్నకేశవ స్వామిని ప్రజలు నిత్యం దర్శించుకొనే భాగ్యం కలిగించాలనే సంకల్పం మహారాణి మంజులత గారికి ఉండేది. అన్ని విషయములు దృష్టిలో పెట్టుకొని మహారాజు రఘుపతి రాజు గారు ఆస్థాన పురోహితుడు వంగల సీతారామ అవధాని, ఇతర పండితులతో చర్చించి శ్రీ చెన్నకేశవ స్వామికి కోట వెలుపల పెద్ద ఆలయం కట్టించి నిత్యం ప్రజలకు స్వామి వారి దర్శనం కల్పించాలని నిర్ణయించారు.

స్థల పరిశీలనకు వాస్తు నిపుణులను రప్పించి సముద్ర మట్టము కంటే ఎత్తుగా విశాలమైన భూభాగముతో సూర్యోదయ కిరణాలను ప్రసరింపచేసుకొని విరాజిల్లుతున్న ఒంగోలు కొండను దేవాలయ స్థాపనకు అనువుగా నిర్ణయించారు. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం విధులు నిర్వహించటానికి పూజారులను శ్రీరంగం నుండి రప్పించి క్రీ.శ. 1712లో స్వామి వారి ఆలయాన్ని దివ్యముగా ప్రారంభించారు. నాటి నుండి ప్రజలు శ్రీ చెన్నకేశవ స్వామి వారిని నిత్యం దర్శించుకొనటానికి వీలుపడింది. ఈనాడు ఆ కొండ కేశవాద్రిగా, ఆ ప్రాంతము కేశవస్వామిపేటగా పిలువబడుతుంది.

ప్రజలు కొరకు రాజులచే కట్టించబడిన దేవస్థానంలో అనంతరం రాజ్యలక్ష్మి అమ్మవారు, ఆండాళ్ అమ్మవారు, శ్రీ సత్యనారాయణస్వామి, శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి, శ్రీ వెంకటేశ్వరస్వామి, సంతాన వేణుగోపాలస్వామి, సప్తమాతృకలు, కొలను, నాగశిల ప్రతిష్టించారు. దేవస్థానమునందున్న అన్ని దేవాలయములలో నిత్య ధూప దీప నైవేద్యములతో సూర్యోదయ సూర్యాస్తమయ సమయములో మేళతాళములతో, వేదపారాయణములతో, మాసకళ్యాణములతో, నిత్యం భక్తులతో విరాజిల్లుతోంది. శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానము ఒంగోలు నగరమునకు శోభ చేకూర్చునదై జనాకర్షనీయమైన ఒక యాత్రా స్థలముగా విరాజిల్లుతోంది.

ఆలయం గురించి :
శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం అయిన ఒంగోలు నందు కలదు, ఈ ఆలయం ఎంతో ప్రాచీనమైనది మరియు పురాతనమైనది. ఈ ఆలయం లో శ్రీ చెన్నకేశవ స్వామి వారితో పాటు అనేక దేవతా మూర్తులు కొలువై ఉండడం మరో ప్రత్యేకత.

శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవాలయంలో విష్ణుమూర్తి కొలువై ఉన్నారు. మహా విష్ణువు లక్ష్మీ దేవి సమేతుడై ఉండడం వలన యాత్రికులు మరియు స్థానికులు ఇక్కడ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. అద్భుతమైన శిల్ప కళాకృతులతో నిర్మించబడిన గోపురం మరియు పెద్ద పెద్ద స్తంభాలతో నిర్మితమైన మండపం వలన ఈ ఆలయం వైభవోపేతంగా ఉంది.

ఆలయ సమయాలు:
ఆలయం ఉ.6:00 గం.ల నుండి ఉ.11:00 గం.ల వరకు మరియు సా.6:00 గం.ల నుండి రా.9:00 గం.ల వరకు తెరచి ఉంటుంది, భక్తులు సేవా కార్యక్రమాలు మరియు స్వామి వారి దర్శనం చేసుకోవచ్చును. ఈ దేవస్థానము నందు  వైఖానస ఆగమము ప్రకారము పూజలు జరుగును.

రవాణా :
By Road:
అన్ని ముఖ్య పట్టణాల నుండి ఒంగోలుకు బస్సులు కలవు, అక్కడ నుండి ఆటో లేదా టాక్సీలో ఆలయాన్ని చేరుకోవచ్చును.

By Train:
అన్ని ముఖ్య పట్టణాల నుండి ఒంగోలుకు రైలు సౌకర్యం కలదు, అక్కడ నుండి ఆటో లేదా టాక్సీలో ఆలయాన్ని చేరుకోవచ్చును.


By Air:
ఆలయానికి దగ్గరగా 166 కి.మీల దూరంలో గన్నవరం నందు విజయవాడ జాతీయ విమానాశ్రయం కలదు.

సంప్రదించండి :
శ్రీ ప్రసన్నచెన్నకేశవ స్వామి వారి దేవస్థానం, 
ఒంగోలు,ప్రకాశం జిల్లా,
ఆంధ్రప్రదేశ్ - 523 001.
chennakesava swamy temple ongole, famous temples in prakasam district, chennakesava swamy temple markapur, prasanna chennakesava temple prakasam district, chennakesava swamy temple history telugu, ongole temple.

Comments

Popular Posts