Sri Muthyalammavari Ammavari Devasthanam | Chillakur, Nellore

ఆలయ చరిత్ర :

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, చిల్లకూరు మండలం, తూర్పు కనుపూరు గ్రామములోని గ్రామ దేవతగా శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ అమ్మవారుగా వెలసియున్నారు.  ఊరు ఉరున పూజలు అందుకుంటూ శారీరక, మానసిక, ఆద్యాత్మికంగా శక్తి స్వరూపినిగా విరజిల్లుతు సంతానం, విద్యా, ఆరోగ్యం మరియు ఆర్దిక ఇబ్బందులు మరియు అనేక కష్టలను తీర్చే అమ్మలుగన్నా అమ్మగా కల్పవల్లిగా వెలసి, భక్తులకు కొంగు బంగరముగా కోరిన కోర్కెలు తెర్చే తల్లిగా ఖడ్గ, త్రిశూల, ఢమరుకం, కుంకుమ భరణితో చతుర్ హస్తములతో జ్యోతిర్లింగము వంటి ప్రకాశముతో వెలిగే ముఖముతో దుష్ట సంహరాని, అరాచకాన్ని తన పాదము వద్ద, తన ఆధీనములో పెట్టుకొని బక్తులకు కోరిన కోర్కెలు ప్రసాదించే తల్లిగా, వెలసియున్న అమ్మే శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ అమ్మవారు.  అమ్మవారిని మనసారా కొలిచిన కోరిన కోర్కెలు తీరుతాయని బక్తులకు ప్రగాఢ నమ్మకము.  కోరిన కోర్కెలు తీరుతాయని మంగళ, శుక్ర, ఆదివారాలలో అధిక సంఖ్యలో భక్తులు పొంగళ్ళు పెట్టుకొని మ్రొక్కులు తీర్చుకుంటారు.  ఈ విధంగా శ్రీ ముత్యాలమ్మ దేవస్థానము దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. 1991 సంవత్సరములో దేవాదాయ దర్మదాయ శాఖలో చేర్చబడినది.  1999 సంవత్సరంలో జీర్ణోద్ధరణ, మహాకుంబాభిషేకములు జరిగినవి.  తరువాత 5 అంతస్తుల పంచకలిశాలతో తూర్పు రాజగోపురం, ప్రకార మండపం అనివేటి మండపం, అంతరాలయం, నిర్మాణం జరిగి 04-07-2010లో ఆదివారం రోజున కలిశ ప్రతిష్ట, మహా మహాకుంబాభిషేకము జరపబడినది.

శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరము తిధి నక్షత్రముతో సంబంధం లేకుండా ఉగాది ముందు వచ్చు మంగళవారము రోజు నుండి శుక్రవారం వరకు అనగా నాలుగు రోజులు జాతర నిర్వహిస్తారు.

ఆలయం గురించి :
శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ ఆలయం తూర్పు కనుపూరు గ్రామంలో, చిల్లకూరు మండలంలో ఉంది. ముత్యాలమ్మ జాతర చాలా ప్రసిద్ధి చెందినది, ఉగాదికి వారం రోజుల ముందు ఈ గ్రామ దేవత జాతర మొదలవుతుంది. అమ్మవారి దీవెనలు పొందడానికి ఇతర రాష్ట్రాలైన తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా భక్తులు విచ్చేస్తారు. 

ముత్యాలమ్మ జాతరను ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఒక పెద్ద ఉత్సవంగా జరుపుకుంటారు. ఇటీవల ఈ ఆలయం భారీ మంటపాలతో పునర్నిర్మించబడింది. ఈ జాతరలో ప్రధానంగా ఉగాది ముందు  వచ్చు మంగళవారం, బుధవారం, గురువారం మరియు శుక్రవారం నాలుగు రోజులు చాల బాగా జరుపుకుంటారు.

ఈ ప్రఖ్యాత దేవాలయంలో శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ అమ్మవారు స్వీయ వ్యక్తంగా వెలిసింది. ఆలయం దేవస్థానం ట్రస్ట్ సభ్యులు 1942వ సంవత్సరములో ఇటుక గోడలు, పూరికప్పుతో నిర్మించి మరియు పోతురాజు, చిలక విగ్రహాలు కూడా ఏర్పాటు చేసారు.1980వ సంవత్సరములో అమ్మవారి యొక్క నూతన విగ్రహమును ప్రతిష్ఠింప చేసినారు.

దేవస్థానము నందు జరుగు  పూజ కార్యక్రమాలు శాక్తేయ ఆగమ" పద్దతిలో నిర్వహించబడుచున్నవి.

ఆలయ సమయాలు:

ఆదివారము, మంగళవారం, శుక్రవారం రోజులలో ఉదయము 6.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది.

సోమవారం, బుధవారం, గురువారం, శనివారం రోజులలో ఉదయము 6.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరుకు, మధ్యాహ్నం 2.30 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది.

వార్షిక పండుగలు:
జాతర ఈ దేవస్తానము నందు ముఖ్యముగా శ్రీ అమ్మవారికి జాతర ఉగాదికి ముందు వచ్చు మంగళవారము ప్రారంభమై శుక్రవారము వరకు అత్యంత వైభవముగా జరుగును. ఈ జాతర శ్రీ పోలేరమ్మ వారి నిలుపుతో ప్రారంభమగును.  లక్షలాది మండి భక్తులు వచ్చు శ్రీ అమ్మవారి జాతర శ్రీ పోలేరమ్మ వారిని వెళ్ళనపు ఉత్సవముతో పూర్తగును.

ఉగాది :
ఉగాది పర్వదినము సందర్భముగా ఈ దేవస్థానమునందు ప్రత్యేక పూజలు, ప్రసాద వినియోగ మరియు విద్యుత్ దీపాలంకరణ వేడుకలతో జరపబడును.
నెల పొంగళ్ళు
ఈ దేవస్తానము నందు జాతర తదుపరి నెల రోజులకు చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలందరు వచ్చి వైభవముగా శ్రీ అమ్మవారికి పొంగళ్ళు పొంగించడం ఆచారముగా జరుగుచున్నది.

దసరా:
ఆస్వీయుజ శుద్ధ పౌడ్యమి నుండి దశమి వరకు 10 రోజులు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి శరన్నవరాత్రులు మహోత్సవములు వైభవముగా జరుగును. సంక్రాంతి  పండుగల సందర్భముగా 4 రోజులు విశేష పూజలు, అభిషేకములు నిర్వహించును.

రవాణా :
By Road:
నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో ఉన్న శ్రీశ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం, నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో NH -5 వరగలి క్రాస్ రోడ్ నుండి 25 కి.మీ దూరములో ఉన్నది.

By Train:
ఈ ఆలయం గూడూరు రైల్వేస్టేషన్ నుండి 31 కి.మీల దూరంలో ఉంది మరియు రైల్వేస్టేషన్ నుండి ఈ ఆలయానికి చేరుకోవటానికి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి.

By Air:
శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయానికి 97 కిలోమీటర్లు దూరములో రేణిగుంట విమానాశ్రయం ఉన్నది. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, న్యూ ఢిల్లీ మరియు బెంగుళూరుకు విమానాలు సర్వీసులు ఉన్నాయి.

సంప్రదించండి :

శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం,
తూర్పు కనుపూరు, చిల్లకూరు మండలము,
నెల్లూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ , పిన్ కోడ్ : 524 412.
Chillakur Sri Sri Sri Muthyalamma Temple, Sri Sri Sri Muthyalammavari Temple, Temples Chillakur , Nellore , kanupuru muthyalamma jathara 2019,kanupuru muthyalamma jathara 2020

Comments

Popular Posts