ఆలయ చరిత్ర :
ఒక రోజు శ్రీమన్నారాయణ మూర్తి వారు శేషతల్పం పై (శేషపాన్పు ) మరియు శ్రీ మహాలక్ష్మి, స్వామి వారి పాదాల దగ్గరగా కూర్చున్నారు. అప్పుడు స్వామి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఇలా అడిగెను. మీకు ఏమైనా ముఖ్యమైన కోరిక ఉంటే చెప్పమని నేను ఆ కోరిక తీరుస్తాను అని స్వామి వారు అమ్మవారికి మాట ఇచ్చెను. అపుడు అమ్మవారు ఈ విధంగా చెప్పెను, నాకు మీరు భర్త కావడం చాల గొప్ప విషయం. కాని ఈ భూమి మీద దివ్య క్షేత్రాలు చాలా తక్కువగా ఉన్నాయి కావున, భక్తులుకి అది చాలా ఇబ్బంది కలుగుతుంది. అందువలన ఇక్కడ ఒక దివ్య క్షేత్రం ఏర్పరచండి అని అడిగెను. మహాలక్ష్మి కోరిక మీద స్వామి వారు ఇక్కడ మాల్యాద్రి ఆలయం ఏర్పరిచారు.
ఈ క్షేత్ర స్థలపురాణం, ప్రకారం పూర్వం శ్రీమహావిష్ణువు భూలోక విహారం చేయాలనుకున్నాడట. తాను విశ్రాంతి తీసుకొనేందుకు అవసరమైన స్థలాన్ని అన్వేషించాలంటూ గరుత్మంతుణ్ణి ఆదేశించి, ఒక పూలమాల ఇచ్చి పంపించాడట. గరుత్మంతుడు భూలోకంలో పలు ప్రాంతాలు గాలించాక, మాలకొండను అనువైన ప్రాంతంగా గుర్తించి, ఆ కొండపై పూలమాల ఉంచాడట. అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీసమేతుడై మాల్యాద్రిపై విశ్రమించాడట. మాల ఉంచిన కొండ కాబట్టి దీనికి మాల్యాద్రి అని పేరు వచ్చింది.
ఆ తరవాతి కాలంలో శ్రీహరి అనుగ్రహం కోసం అగస్త్య మహాముని కఠోర తపస్సు చేశాడు. అప్పుడు స్వామి జ్వాలారూపంలో ప్రత్యక్షమయ్యారు. భూలోకవాసుల పాప ప్రక్షాళన కోసం స్వామిని మాలకొండలో శాశ్వతంగా ఉండిపోవాలని కోరాడు అగస్త్యుడు, అయితే దేవతలూ ఋషుల దర్శనార్ధం వారంలో ఆరు రోజులు, మానవుల పూజల కోసం శనివారం కేటాయించాలని కోరాడు. అందుకు స్వామి సమ్మతించి, ఇక్కడ విగ్రహరూపం దాల్చాడట.
ఈ కొండమీద మరో అద్భుతం కలదు. ఒక పెద్ద రాయి మధ్యలోకి చీలిపోయి దారిని కలిగి ఉంటుంది. దీనికి గల కారణం... ఒక రోజు శ్రీ మహావిష్ణువు వేట కోసం అడవికి వెళ్లారు. అక్కడ ఆయన చెంచు తెగకు చెందిన స్త్రీని కలుస్తారు మరియు ఆమెను ఇష్టపడతారు. ఈ విషయాన్ని శ్రీ మహా లక్ష్మికి చెప్పెను, శ్రీ మహాలక్ష్మి ఈ విషయాన్ని తెలుసుకోవటానికి ఆ అడవిలో రాయి దగ్గరకు వెళ్లెను. శ్రీ మహావిష్ణువు యొక్క ఆలోచనకి ఆమె కోపం తెచ్చుకొని, కొండపై ఆమె ముందు ఉన్న ఒక పెద్ద రాయిని తీవ్రంగా చూసారు. ఆమె తీవ్రంగా చూడటం వలన, రాయి రెండు భాగాలుగా విభజించబడింది. శ్రీ మహలక్ష్మి ఈ కొండ పైభాగానికి వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. శ్రీ మహలక్ష్మి ప్రార్ధన చేయటానికి భక్తులు వెళుతున్నప్పుడు ఈ అద్భుతాన్ని చూడవచ్చును. ప్రతి భక్తుడు, ఈ దారిని చూసి దర్శనానికి వెళ్లలేము అని భావిస్తారు. కాని అందరు భక్తులు చాలా సులువుగా కొండపైన దేవతను దర్శించుకుని వస్తారు.
ఆలయం గురించి :
శ్రీ మాల్యాద్రి లక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని, ప్రకాశం జిల్లా, వాలేటివారిపాలెం మండలం మాలకొండలో ఉంది. స్వామివారి భక్తులు వారికి పుట్టిన పిల్లలకు మగవాళ్ళైతే స్వామి గుర్తింపుగా లక్ష్మి నర్సింహస్వామి పేరు వచ్చేలా, ఆడపిల్లలైతే శ్రీ మహాలక్ష్మి పేరు వచ్చేలా వారు నామకరణం చేయించుకుంటారు. రాష్ట్రంలో సుప్రసిద్ధ నరసింహ క్షేత్రాల్లో మాలకొండ ఒకటి. దీన్నే మాల్యాద్రి అంటారు కోరి కొలిచేవారికి కొంగు బంగారంగా, దుష్ట శక్తుల పాలిట అరివీర భయంకరుడిగా ఈ స్వామి పూజలందుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల భక్తులు, ఈ దేవాలయంలో పూజలను నిర్వహించిన తరువాత, స్వామి వారు పిల్లలు లేని వారికీ పిల్లలు కలిగేలా ఆశీర్వదిస్తారు అని ఒక ధృడమైన నమ్మకం. జ్యేష్ఠ మాసం (మే, జూన్ నెలలు), స్వామి వారి పూజలకు చాలా ముఖ్యమైనవి, అని ఈ మాసంలో ఎక్కువగా పూజలు చేస్తారు. ఇక్కడ చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాలలో మూడు శనివారాలు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే, సంతానప్రాప్తితోపాటు కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ పవిత్రంగా సాన్నం చేయడానికి చాల స్నాన ఘట్టాలు[తీర్థాలు] ఉన్నాయి. వాటిలో కొన్ని
(1) నృసింహ తీర్థం
(2) వరుణ తీర్థం
(3) కపిల తీర్థం
(4) అగస్త్యు తీర్థం
(5) శంకర తీర్థం
(6) జ్యోతి తీర్థం
(7) ఇంద్ర తీర్థం
ఈ ఏడు తీర్థాలను సప్త ఋషుల పేర్లతో పిలుస్తున్నారు. మాలకొండపై ఉన్న తీర్థాలను పవిత్ర తీర్థాలుగా భావిస్తారు. వీటిలో స్నానంచేస్తే పాపాలు తొలిగిపోతాయని విశ్వసిస్తారు.
ఆలయం సమయాలు:
ఆలయం ప్రతి శనివారం ఉదయం 04:00 గంటలకు తెరవబడును మరియు సాయంత్రం 05:30 గంటలకు మూయబడును.
రవాణా :
By Road:
శ్రీ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయం, ఒంగోల్ నుండి 78 కి. ఒంగోల్ చేరుకోవడానికి అన్ని ప్రధాన నగరాల నుండి APSRTC అందుబాటులో ఉంది. కందుకూర్ నుండి మాలకొండకి 35 కిలోమీటర్లు. కందుకూర్ మరియు పామూర్ మధ్య బస్సులు అందుబాటులో ఉన్నాయి.
By Train:
శ్రీ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం చేరుటకు సమీపంలో సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఉంది. సింగరాయకొండ నుండి మాలకొండకి 50 కిలోమీటర్లు.
By Air:
శ్రీ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం చేరుటకు సమీపంలో విజయవాడ (గన్నవరం) విమానాశ్రయం కలదు. 246 కిలోమీటర్లు. మరో విమానాశ్రయం తిరుపతి (రెనిగుంట) 260 కిలోమీటర్లు.
సంప్రదించండి :
శ్రీ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం,
మాలకొండ, ప్రకాశం జిల్లా,
ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్: 523 116.
ongole to malakonda temple, malakonda temple timings, malakonda rooms booking, malakonda route map, ongole to malakonda bus timings, singarayakonda to malakonda, malakonda video, kandukur to malakonda, sri malyadri lakshmi narasimha swamy temple malakonda, malyadri lakshmi narasimha swamy vari temple history telugu, malyadri temple history, malakonda temple, guntur temples.

Comments
Post a Comment