Sri Mahanandeeswara Swamy Vari Devasthanam | Mahanandi

ఆలయ చరిత్ర :
మహానంది ఒక గ్రామం. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , కర్నూలు జిల్లాలోని నంద్యాల వద్ద ఉన్న నల్లమల కొండల తూర్పున భాగాన ఉన్నది. ఇది అడవులతో నిండి ఉంది మహానందికి 15 కి.మీ దూరంలో నవ  నందులు అని పిలువబడే తొమ్మిది నంది విగ్రహాలు ఉన్నాయి. మహానంది నవ నందులలో  ఒకటి.


నంద్యాల లేక నంది మండలమును పరిపాలించిన వారిలో నందుడు అను రాజు పరమేశ్వరునకు క్షరాభిషేకయొనరించవలెనని తలంపు కలిగి గోపవరం ప్రాంతమందలి ఆలమందల నుండి పాలు తేవలిసినదిగా ఆఘ్న్యాపించెను. అక్కడ ఆలమందలలో ఒకానొక కపిల గోవు ఆరణ్యమునకు వెళ్ళి ఆకలలుములు మేసి సాయం సమయమున ఇంటికి వచ్చి పాలీయకుండెను. అందులకు ఆ గోవుల కాపరి కలత చెంది ఒకనాడు గోవును వెంబడించెను.ఆ గోవు అడవిలో ఒక పుట్ట చెంతకు వెళ్ళి పచ్చిక మేసి అటుఇటు తిరిగి పుట్టపై పాలు కార్చుచుండెను. ఈ ఉదంతము ఆ కాపరి రాజుకు తెలిపెను. మరునాడు ఆ రాజు స్వయంగా అరణ్యమునకు వెళ్ళి ఈ ఆశ్చర్యకర దృశ్యమునకు తిలకించి ఆనందాతిశయముతో సమీపముగా చూచుటకు ఒక అడుగు ముందుకు వేసెను. అంతనా ప్రశాంత వాతావరణము భగ్నమైనది. తొట్రుపాటుతో ఆ గోవు పుట్టమీద పాదము మోపి చెదిరిపోయెను.ఈ సంఘటనకు రాజు విచారగ్రస్తుడై అంతఃపురము చేరెను. నాటి రాత్రి స్వప్నములో శివుడు ప్రత్యక్షమై ఆ ప్రాంతమున పూజా మందిరము నిర్మించమని అనుమతినిచ్చేను. నందన రాజు శివుని యాజ్ఞ ప్రకారము ఈ ఆలయమును నిర్మించెననియు,ఆ పుట్టయే శిలా రూపమున గోవు పాదముద్రతో వెలసిన పరమ శివుడనియు ఒక గాధ.

క్షేత్ర విశిష్టత :
ఈ దేవస్థానము నందు పవిత్ర పుష్కరిణిలు మూడు కలవు.
రుద్రగుండము: ఈ గుండము దేవస్థానము నందు మొదటి ప్రకారము లోపల కలదు .ఈ గుండము లోనికి జలవాహిని స్వామివారి క్రింద నుంచి ప్రవహిస్తూ వచ్చుచున్నవి. ఈ గుండము నందు యాత్రికులు, భక్తులు స్నానము చేసి శ్రీ స్వామి అమ్మ వార్లను దర్శించుకొనుట జరుగుచున్నది మరియు భక్తులకు ఆకర్షణీయముగా మనస్సునకు ఆహ్లదకరముగా ఉండుటయేగాక రుద్ర గుండమును పవిత్ర తీర్థముగా భక్తులు భావించుచున్నారు.


బ్రహ్మగుండము:
ఈ గుండము దేవస్థానము నందు ఉత్తర గాలి గోపురము ఎదురుగా నందు యాత్రికులు ,భక్తులు స్నానము చేయుటకు వీలు లేకుండా నిరుపయోగముగా ఉన్నది. కావున ఈ గుండము నందు స్నానములు చేయుటకు వీలు అగునట్లు. అభివృద్ధి చేసినయెడల భక్తులకు ఆకర్షనీయముగా మనస్సునకు ఆహ్లదకరముగా ఉండుటయేగాక బ్రహ్మ గుండమునకు పవిత్ర తీర్థముగా అందించినట్లుగా భక్తులకు ప్రగాఢ విశ్వాసము ఏర్పడును.

విష్ణుగుండము: 
ఈ గుండము దేవస్థానము నందు దక్షిణ గాలి గోపురము ఎదురుగా రెండవ ప్రకారము బయట కలదు. ఈ గుండము నందు యాత్రికులు,భక్తులు స్నానము చేయుటకు వీలు లేకుండా నిరుపయోగముగా ఉన్నది. కావున ఈ గుండము నందు స్నానములు చేయుటకు వీలు అగునట్లు అభివృద్ధి చేసినయెడల భక్తులకు ఆకర్షనీయముగా మనస్సునకు ఆహ్లదకరముగా ఉండుటయేగాక విష్ణు గుండమును పవిత్ర తీర్థముగా అందించినట్లుగా భక్తులకు ప్రగాఢ విశ్వాసము ఏర్పడును.

ఆలయం గురించి :
దక్షిణాపథములో తూర్పు భాగమున వ్యాపించిన ఉదయాద్రి పర్వతపంక్తినాంధ్రారణ్యములతో కూడుకొని యున్నది.  ఈ గుట్టల వరుసలో నల్లమలై గుట్టల వరుస కర్నూల్ జిల్లా ప్రాంతముపై వ్యాపించి యున్నది.  నంది మండలమును పరిపాలించిన వారిలో నందుడు అను రాజు పరమేశ్వరునకు క్షీరాభిషేకమొనరించవలెనని తలంపు కలిగి గోపవరం ప్రాంతమందలి ఆలమందల నుండి పాలు తేవలసినదిగా  ఆజ్ఞాపించెను.  అక్కడ ఆలమందలలో ఒక కపిల గోవు అరణ్యమునకు వెళ్లి ఆకులలుములు మేసి సాయం సమయమున ఇంటికి వచ్చి పాలీయకుండెను.  అందులకు ఆ గోవుల కాపరి కలత చెంది ఒకనాడు గోవును వెంబడించెను.  ఆ గోవు అడవిలో ఒక పుట్ట చెంతకు వెళ్లి పచ్చిక మేసి అటుఇటు తిరిగి పుట్టపై పాలు కార్చుచుండెను.  ఈ ఉదంతమును ఆ కాపరి రాజునకు తెలిపెను.  మరునాడు ఆ రాజు స్వయంగా అడవినకు వెళ్లి ఈ ఆశ్చర్యకర దృశ్యమును తిలకించి ఆనందాతిశయముతో సమీపముగా చూచుటకు ఒక అడుగు ముందుకు వేసెను.  అంతనా ప్రశాంత వాతావరణము భగ్నమైనది.  తొట్రుపాటుతో ఆ గోవు పుట్ట మీద పాదం మోపి చెదిరిపోయెను.  ఈ సంఘటనకు రాజు విచారగ్రస్తుడై అంతఃపురం చేరెను.  నాటి రాత్రి స్వప్నములో శివుడు ప్రత్యక్షమై ఆ ప్రాంతమున పూజ మందిరము నిర్మించమని ఆనతినిచ్చేను.  నందన రాజు శివుని ఆజ్ఞ ప్రకారం ఈ ఆలయమును నిర్మించెననియు, ఆ పుట్టయే శిలా రూపమున గోవు పాద ముద్రతో వెలసిన పరమ శివుడనియూ ఒక గాధ.

మహానంది, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రము. నంద్యాలకు 15 కి.మీ దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్దినాటిది. ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం (680-696) నాటిదని అంచనా. ఇచ్చట గల శివలింగము ఎత్తుగా కాక కొంచెము తప్పటగ వుంటుంది. పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కటవలన  వలన లింగము కొంచెము అణిగివుంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగముపై వుంటుంది.

ఇచ్చట శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం, జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత. ఈ పుష్కరిణిలు విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క పనితనాన్ని తెలియచేస్తుంది. మహానంది ఆలయములో శ్రీ మహానందీశ్వర స్వామి (శివుడు)మరియు దేవత శ్రీ కామేశ్వరి దేవి ఉంటారు.మహానందీశ్వర స్వామి ఆలయ దేవుడిగా శివలింగం రూపంలో ఉన్న స్వయం భులింగం అని నమ్ముతారు. ఈ పవిత్ర ఆలయం మహానంది గ్రామం లో తూర్పు నల్లమల్ల కొండలో కలదు.

7వ శతాబ్దంలో ఉన్న మహానందీశ్వర ఆలయం శివుడికి అంకితం, చాల ప్రసిద్ధమైనది మరియు పవిత్ర ప్రదేశం. చాళుక్యులు 7వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు.అనేక మార్పులు 10వ మరియు 15వ శతాబ్దాలలో జరిగాయి. గర్భగుడి పైన ఉన్న గోపురం ఆలయం నిర్మాణం మరియు ఇతర నిర్మాణాలు బాదామి చాళుక్యుల శైలిలో మరియు విజయనగర శైలిలో ఉంటాయి. పురాణాల ప్రకారం స్థానిక రాజు ఐనా నందాస్ అనే రాజు ఇక్కడ 10వ శతాబ్దంలో పరిపాలించారు మరియు అనేక ఆలయాలు నిర్మించారు.

వారి పూర్వీకుల దేవుడు నంది. అందుకే మహానంది అని పిలువబడింది. ఇక్కడ అద్భుతమైనది పుష్కరిణి లో ప్రవహించే స్వచ్ఛమైన నీరు ఏడాది పొడువునా ప్రవహిస్తుంది. ఆ నీరు చాల స్పష్టంగా మరియు నీటి అడుగున ఉన్న ఒక సూదిని కూడా స్పష్టంగా చూడవచ్చును. మహానంది ఆలయంలో దాదాపు మూడు కొలనులు ఉన్నాయి. రెండు కొలనులు ఆలయ వెలుపల ఉంటాయి. మూడోవది ప్రధాన దైవం ఉన్న శివ లింగం ఆలయం వద్ద ఉన్నది. ఇందులోని నీరు గర్భగుడి క్రింది భాగం నుండి ఉద్భవించినవి. ఈ నీటి ప్రవాహం నిరంతరం ఉంటుంది.

ఈ పవిత్ర ఆలయంలో పరమేశ్వరుని విగ్రహం 7వ శతాబ్దానికి చెందినది. ప్రాథమిక ఆలయ నిర్మాణం చాళుక్యులు (7వ శతాబ్దం) నిర్మించారు, తరువాత నంద వంశం (10 వ శతాబ్దం) మరియు విజయనగర రాజులు (15 వ శతాబ్దం) మెరుగుపర్చబడింది. భక్తులు మహానంది ఆలయము వద్ద ఉన్న  పుష్కరణి లేదా కోనేరు లో పవిత్ర స్నానం ఆచరిస్తారు. ఈ కోనేరులో పంచ లింగములు ఉన్నాయి దీనిల మధ్యలో ఉన్న లింగమును  వరుణ లింగం అంటారు. రుతువుల సంబంధం లేకుండా , పుష్కరణి [కోనేరు] లోని  నీరు స్థిరంగా ఐదు అడుగుల ప్రవాహం ఉంటుంది. 

ప్రధాన నీరు గర్భగృహ లోపలి భాగం లో ఉన్న స్వయంభు శివలింగం క్రింద భాగము నుంచి ఉద్భవించినవి మరియు యాత్రికులు పూజ నిర్వహించడానికి శివలింగమును తాకవచును మరియు ఈ పవిత్ర జలమును తీర్థముగా స్వీకరించవచ్చును. బయటికి వెళ్లే మహానంది ఆలయ నీరు పరిసర ప్రాంతాల్లో సారవంతమైన భూములను నీటిపారుదల కోసం ఉపయోగిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత(15 అడుగులు  x27 అడుగులు)అడుగులు మహానంది ఆలయము వద్ద ఉన్నది.  ఈ ఆలయ ప్రధాన గోపురం బాదామి చాళుక్యుల శైలిలో పోలి ఉన్నవి. ఇతర ఆలయాలు విజయనగర శైలిలో పోలి ఉన్నవి.

సంప్రదించండి :
శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానం,
మహానంది (గ్రా. & మం.), కర్నూల్ జిల్లా – 518 502,
ఆంధ్ర ప్రదేశ్. ఆఫీస్ : 08514-234726 & 284620
ఎంక్వయిరీ : 08514-234728
ఫ్యాక్స్: 08868-238124

రవాణా :

ఏపీఎస్ఆర్టీసీ మహానంది ఆలయానికి మంచి బస్సు సౌకర్యము అందిస్తుంది. నంద్యాల పట్టణం నుండి మహానంది చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. తిమ్మాపురం ద్వారా ఒక మార్గం బస్సు స్టాండ్ నుండి 17 కి. మీ దూరంలో కలదు. మరొకటి గిద్దలూరు నుండి బోయలకుంట్ల వద్ద ఎడమ వైపు వెళ్లవలెను. ఇది నంద్యాల నుంచి 24కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
అమరావతి నుండి విజయవాడ - మంగళగిరి - గుంటూరు -- నర్సరావుపేట - వినుకొండ -- త్రిపురాంతకం - గిద్దలూరు -- గాజులపల్లె - మహానంది దేవాలయం (330 కి.మీ.).
హైదరాబాద్ నుండి హైదరాబాద్ -- షాద్ నగర్ జడ్చర్ల -- కొత్తపేట -- పెబ్బేరు -- కర్నూల్ -- పాణ్యం -- నంద్యాల -- మహానంది దేవాలయం (285 కి.మీ.)
తిరుపతి నుండి తిరుపతి -- రేణిగుంట -- రాజంపేట - కడప - మైదుకూరు - చాగలమర్రి -- ఆళ్లగడ్డ - నంద్యాల - మహానంది దేవాలయం (280 కి.మీ.)
శ్రీశైలం నుండి శ్రీశైలం - దోర్నాల - ఆత్మకూర్ - వెలుగోడు - నంద్యాల రోడ్డు - బుక్కాపురం - మహానంది దేవాలయం (170 కి.మీ.)

గాజులపల్లి రైల్వే స్టేషన్ మహానంది ఆలయమునకు చాల దగ్గరగా ఉన్నది. గాజులపల్లి నుండి మహానంది 6 కిలోమీటర్ల దూరం లో ఉన్నది. తరవాతి సమీప రైల్వే స్టేషన్ నంద్యాల జంక్షన్ -19 కి. మీ. సమీప విమానాశ్రయం హైదరాబాద్ వద్ద ఉంది.

mahanandi temple timings, mahanandi temple timings today, mahanandi temple vempalli, andhra pradesh, yaganti temple, mahanandi temple koneru, mahanandi temple to srisailam, mahanandi temple seva booking, mahanandiswara swamy temple timings, mahanandi temple history telugu.

Comments

Popular Posts