ఆలయ చరిత్ర :
తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభువుడై వెలసిన ఈ స్వామి చరిత్ర గర్గ సంహిత, పద్మ పురాణము, శ్రీ రామాయణములలో చెప్పబడింది. త్రేతాయుగంలో రావణాసురుడి సైన్యంలో మధ్వాసురుడనే రాక్షసుడు వుండేవాడు. ఆయన జన్మతో రాక్షసుడైనా రాక్షస ప్రవృత్తిలేక ఆధ్యాత్మకి చింతనతో వుండేవాడుట. రామ రావణ యుధ్ధంలో శ్రీరామచంద్రుని వైపు పోరాడుతున్న హనుమంతుణ్ణి చూసి భక్తి పారవశ్యంతో అస్త్ర సన్యాసం చేసి హనుమా, హనుమా అంటూ తనువు చాలించాడు. తర్వాత ద్వాపరయుగంలో మధ్వికుడుగా జన్మించాడు. అప్పుడు కూడా సదాచార సంపన్నుడై, సద్భక్తితో జీవితం గడిపేవాడు.
ఆ సమయంలో వచ్చిన కురు పాండవ యుధ్ధంలో కౌరవుల పక్షాన పోరాడుతూ, అర్జనుని జెండాపైన వున్న పవనసుతుని చూసి, పూర్వజన్మ స్మృతితో ప్రాణ త్యాగం చేశాడు. తర్వాత కలియుగంలో మధ్వుడిగా జన్మించాడు.
ఆంజనేయస్వామి గురించి తపస్సు చేసుకుంటూ పలు ప్రదేశాలు తిరుగుతూ ఎర్రకాలువ ఒడ్డుకు వచ్చి అక్కడ తపస్సు చేసుకోవటానికి నివాసం ఏర్పరచుకున్నాడు. ప్రతి నిత్యం ఎర్ర కాలువలో స్నానం చేసి శ్రీ ఆంజనేయస్వామి గురించి తపస్సు చేసి మహర్షి అయ్యాడు. వయోభారం మీదపడ్డా మధ్వ మహర్షి తన నిత్యకృత్యాలైన ఎర్ర కాలువ స్నానం, ఆంజనేయస్వామి గురించి తపస్సు విడువలేదు.
ఒక రోజు కాలువలో స్నానం చేసి ఒడ్డుకు చేరబోయిన వృధ్ధ మధ్వ మహర్షి అడుగులు తడబడటంతో పడబోయాడు. వెంటనే ఎవరో ఆయనను పట్టుకున్నట్లు పడకుండా ఆగాడు. చూస్తే ఒక కోతి ఆయన చెయ్యి పట్టుకుని ఒడ్డుకు తీసుకువచ్చి సపర్యలు చేసి, ఒక పండు ఆహారంగా ఇచ్చింది.
దాని గురించి పట్టించుకోని మహర్షి తన నిత్యకృత్యం కొనసాగిస్తున్నాడు. అలాగే ఆ కోతి కూడా అను నిత్యం ఆయన స్నానంతరం ఒడ్డుకు చేర్చి, సపర్యలు చేసి, పండు ఆహారంగా ఇచ్చేది. ఇలా కొంతకాలం సాగిన తర్వాత తనకు సపర్యలు చేస్తున్న ఆ వానరాన్ని తదేకంగా చూసిన మధ్వ మహర్శి ఆయనని ఆంజనేయస్వామిగా గుర్తించి, “స్వామీ, ఇంతకాలం మీతో సపర్యలు చేయించుకున్నానా!!? సాక్షాత్తూ స్వామి చేత సపర్యలు చేయించుకున్న మూర్ఖుడను నేను. ఇంక బతుకకూడదు.” అని విలపిస్తూండగా స్వామి ప్రత్యక్షమై మధ్వా ఇందులో నీ తప్పేమీ లేదు. నీ భక్తికి మెచ్చి స్వయంగా వచ్చి నీ సేవలు చేశాను. కాబట్టి విచారించకుండా ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు మధ్వ మహర్షి స్వామీ మీరెప్పుడూ నా చెంతనే వుండేలా వరం ప్రసాదించండి అని కోరాడు.
మధ్వ మహర్షి భక్తికి మెచ్చిన ఆంజనేయస్వామి మధ్వకా, నీవు మద్ది చెట్టుగా జన్మిస్తావు. నేను నీ సమీపంలో శిలా రూపంలో ఎక్కడా లేని విధంగా ఒక చేతిలో గదతో, ఇంకొక చేతిలో పండుతో వెలుస్తాను. భక్తులు నన్ను నీ పేరుతో కలిపి మద్ది ఆంజనేయస్వామిగా కొలుస్తారు అని అభయమీయగా మధ్వ మహర్షి సంతోషించాడు.
తర్వాత కాలంలో స్వామికి ఆలయం నిర్మించారు. అయితే ఆలయానికి కప్పు, విమానం నిర్మించటానికి వీలు కాలేదు. ఆ రోజులలో జంగారెడ్డి గూడెం ఫారెస్టురేంజ్ ఆఫీసరుగా పనిచేసిన మంతెన వరహాలరాజుగారి మాతృమూర్తి శ్రీమతి భానుమతిగారు స్వామి చెంతకు తరచూ వస్తూవుండేవారు. ఒకసారి ఆవిడ ఒంటిమీదకు స్వామివారు వచ్చి కట్టిన ఆలయాన్ని అలాగే వుంచి, మద్ది చెట్టు శిఖరముగా వుండేటట్లు, వేరే శిఖరము లేకుండా గర్భాలయ నిర్మాణము చేయమని ఆజ్ఞ ఇచ్చారు. స్వామి ఆజ్ఞ పాటించి శిఖరము లేని గర్భాలయాన్ని నిర్మించారు. శిఖరము లేని గర్భాలయాలు చాలా అరుదు. ఇది ఇక్కడి విశేషం.
ఆలయం గురించి :
శ్రీ స్వామి వారి దేవస్థానము నందు పూజాధి కార్యక్రమములు వైఖానస ఆగమము ప్రకారము జరుపబడుచున్నవి. శ్రీమద్ది ఆంజనేయ స్వామి ఆలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామములో ఉంది. హనుమాన్ జయంతిని వైభవంగా జరుపుకుంటారు. ప్రతి ఏడు మంగళవారాలు 108 ప్రదక్షిణలు చేసినచో బాలికలు మంచి జీవిత భాగస్వామిని పొందవచ్చునని భక్తుల నమ్మకం. ఈ దేవుడిని ప్రతి శనివారం పూజించినచో శని మహాదశ యొక్క దృష్టప్రభావాలను తగ్గిస్తుంది.
ఈ ఆలయములో ఒక చేతితో గద మరియు మరొక చేతిలో పండుతో హనుమంతుడు ఈ పవిత్ర పుణ్యక్షేత్రములో కొలువై ఉన్నాడు. మద్వాసుర ఆంజనేయ స్వామి కోసం తపమాచరించి వరం పొందుతాడు నీతో శాశ్వతముగా ఉండాలని వరము కోరగా మాద్వాసురుడు మద్ది చెట్టుగా జన్మించి ఆ చెట్టు పైన కూర్చొన్న విధముగా ఆంజనేయ స్వామి వెలిసాడు అందుకే ఈ ఆంజనేయ స్వామిని మద్ది ఆంజనేయ స్వామిగా పిలుస్తారు. ఈ ఆంజనేయ స్వామి ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డి గూడెం మండలం, గురవాయి గూడెం అనే గ్రామం వున్నది. ప్రతి నిత్యం భక్త జన సమూహాలతో కళ కళలాడే ఈ సుప్రసిధ్ధ క్షేత్రం ఎర్రకాలువ ఒడ్డున వున్నది.
ఇక్కడ స్వామి చాలా మహిమ గలవాడుగా కొనియాడబడతారు. వివాహం కానివారు, కుటుంబ సమస్యలు, ఆర్ధిక సమస్యలతో బాధపడేవారు, ఏ పని చేసినా కలసిరానివారూ, ఇక్కడ ఏడు మంగళవారాలు స్వామికి 108 ప్రదక్షిణలు చేస్తే వారి సమస్యలు తొలగిపోతాయి. చాలాకాలం క్రితమే ఇక్కడ హనుమత్ దీక్షలు కూడా ప్రవేశపెట్టారు. ప్రతి సంవత్సరం హనుమత్ వ్రతం, పూర్ణాహుతి జరుపబడుతున్నాయి. ఈ ఆలయానికి పశ్చిమ ముఖంగా పురాతన వెంకటేశ్వరస్వామి ఆలయం వున్నది. ఇది ఆంజనేయస్వామి ఆలయం ప్రసిధ్ధి చెందకముందునుంచే వున్నది.
ఆలయ సమయాలు :
ఈ ఆలయం ఉ 5.00 నుండి మ.1.00 వరకు
మ 4.00 నుండి రా.9.00 వరకు
యాత్రికుల కోసం తెరిచి ఉంటుంది.
రవాణా :
By Road:
ఆలయము నుండి 3 కి. మీ దూరంలో ఉన్న పోలవరం బస్ స్టాండ్ నుండి తరచుగా బస్సులు అందుబాటులో ఉన్నాయి.
By Train:
సమీప రైల్వే స్టేషన్ ఆలయము నుండి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న రాజమేహేంద్రవారం (రాజమండ్రి) రైల్వే స్టేషన్.
By Air:
ఆలయం నుండి 42 కిలో మీటర్ల దూరంలో రాజమండ్రి విమానాశ్రయం ఉన్నది.
సంప్రదించండి :
శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయం, గురవాయిగూడెం గ్రామము,
జంగారెడ్డి గూడెం మండలము,
పశ్చిమ గోదావరి జిల్లా,ఆంధ్ర ప్రదేశ్.
ఆఫీస్ : 08821-226494
sri maddi anjaneya swamy temple timings, sri maddi anjaneya swamy temple history in telugu, maddi anjaneya swamy temple accommodation, maddi anjaneya swamy temple distance, maddimadugu anjaneya swamy temple address, maddi anjaneya swamy temple contact number, maddi anjaneya swamy temple photos, madhya anjaneya swamy temple timings

Comments
Post a Comment