Sri Lakshmi Narasimha Swamy Vari Devasthanam | Pennahobilam, Uravakonda


ఆలయ చరిత్ర :
క్రీస్తు శకం 1478 సంవత్సరములో శ్రీకృష్ణదేవారాయుల వారిచే అనంతపురము ఉరవకొండ రహదారిప్రక్కన పెన్నానది 3 కి.మీ దూరమున గల ఒక గిరిపై శ్రీ పెన్నహోబిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిర్మింపబడి ఉన్నది.ఈ గిరిపై పూర్వం ఉద్దాలక మహర్షి తపస్సు గావిన్చినాడట. ఈ గిరికి క్రింది భాగమున తూర్పు దిశకు గొల్లపల్లి అనే గ్రామము ఉండెడిది. ఈ గ్రామములో ఒక గోవు ప్రతి దినము బిలము వద్ద క్షీరము ఇచ్చెడిది. గోవు యజమాని తన గోవు పొదుగులో పాలు లేకుండుట గమనించి కలతచెంధగా శ్రీ నృసింహస్వామి ఆయనకు అగుపించి నేను నీ గోక్షీరము సేవించు చున్నానని తెలియజేయగా గొల్లవాడు సంతోషబరితుడై బిలప్రాంతము శోదించగా బిలము పై భాగమున శ్రీ స్వామివారి పాధముద్రక గల శిలాపలకము మరియు గిరి క్రింది భాగమున నైరుతి దిశన శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి శిల అగుపించినదట. గొల్లపల్లివాసులు శ్రీవారికి శ్రీ అమ్మవార్లకు చిన్న ఆలయములు నిర్మించి పూజ గావించు చుండిరట. విజయనగర సామ్రాజ్యాదీశుడైన సదాశివదేవరాయుల వారు విజయనగరము నుండి పెనుగొండ దుర్గమునకు పయనిన్చుచు  క్షేత్రము వద్ద మజిలి గావిన్చినాడట.


శ్రీ సదాశివరాయల వారికి శ్రీ స్వామివారి స్వప్నంలో కనిపించి తన జైత్రయాత్ర దిగ్విజయమగునని ఆశ్వీరదిన్చినాడట. శ్రీ సదాశివరాయులు వారు తన జైత్రయాత్ర తిరుగుప్రయానములో శ్రీ స్వామివారిని దర్శించి శ్రీ స్వామివారికి శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి ఆలయములు నిర్మించవలసినదిగా ఉదిరిపికొండ ప్రాంత ప్రాంతప్రతినిదికి ఆదీశించినాడట. శ్రీ నృసింహస్వామి ఆలయమునకు పెన్నహోబిల శోత్రియ గ్రామము దానముగా ఇచ్చినట్లు సశానమువల్ల తెలియుచున్నది.ఉదిరిపికొండ రాజప్రతినిధి ఆలయనిర్మానము గావించి ఏకశిల గల ద్వీపస్తంబముతో పాటు రాజుగారి గుర్తుగా ఏకశిల విజయస్తంబమును క్షేత్రమునందు ప్రతిష్టగావిన్చినాడట. సుమారు 45 అడుగులు పైబడి ఎత్తుగల రెండు శిలలు ఈ క్షేత్రమందున్నవి. 

క్రింది భాగమున అమ్మవారి ఆలయములో గత 20 సంవత్సరముల నుండి పుట్ట అక్కడ వెలసిన శిల ఎత్తుగా పెరుగుచున్నది.ఈ దేవస్తానమునందు వైకానస సామ్ప్రదాయములతో ప్రతినిత్యము అర్చనా    కార్యక్రమములు జరుగుచున్నవి.ఈ స్థల ప్రబావము ఏమో కాని ఇక్కడి దర్శనార్ధమై వచ్చిన యాత్రికులు ఎందరో తమ దీర్గ రోగాలను,చర్మవ్యాధులు నయమైనట్లు గుర్తించారు.పవిత్ర స్తలమునుండి ప్రవహించే నీరు మర్రిమాను వ్రేళ్ళు తాకి వచ్చిన నీటిని త్రాగుట మరియు స్నానము చేస్తే చర్మవ్యాధులు నయమవుతాయి. ఇక్కడ వివాహములు చేసుకున్న జంటలు నూరేళ్ళు చల్లగా కాపురాలు చేసుకుంటున్నాయి.మరెందరో విడిపోయినవారు ఇక్కడ వచ్చి కలుసుకుంటున్నారు.వివాహమైన దంపతులకు సంతానము కాకపోతే సెలయేటి ప్రక్కన పాముపుట్టపై చెట్టుకు చీరకొంగు చించి కట్టి, పాముపుట్టలో పాలు పోసి నోచితే పిల్లలు పుడుతారని ఇక్కడి భక్తుల విశ్వాసం. కొందరి అవివాహితులు, వివాహము ఎన్నాళ్ళకు కాకపోతే ఏటి గంగమ్మ జాతరలో స్నానం చేసి గంగమ్మ గుడి చుట్టూ మూడు ప్రదిక్షినలు చేస్తే ఏడాదికే వివాహమౌతుందని ఇక్కడి వారి నమ్మకము.ఈ ప్రాంత ఋషులు,మునీశ్వరులు ఎందరో తపస్సు చేసిన స్థలము కనుక ఇక్కడ వనమూలికలు కూడా వున్నట్లు వాటి వల్ల సర్వ రోగ నివారణ జరిగిందని గ్రామపెద్దల ద్వార తెలియుచున్నది.

Temple Timings: 8.00 am to 11.00 am & 5.30 pm to 8.30 pm. 

రవాణా :
By Road:
అనంతపూర్ జిల్లా నుండి పెన్నహోబిలం - 40 కిలోమీటర్ల
ఉరవకొండ మండల నుండి పెన్నహోబిలం - 10 కిలోమీటర్ల

By Train:
GUNTAKAL RAILWAY STATION NEAR STATION 48 KM
ANANTAPUR RAILWAY STATION  NEAR STATION 45 KM

By Air:
NEAR AIR PORT PUTTAPARTHI 80KM
NEAR AIR PORT TIRUPATHI 360 KM
NEAR AIR PORT BELLARY 75 KM
NEAR AIRPORT BENGALORE&nbsp 280 KM


penna ahobilam temple history in telugu, penna ahobilam waterfalls, anantapur to penna ahobilam distance, anantapur to penna ahobilam bus timings, penna ahobilam dam, penna ahobilam accommodation, ahobilam temple images, ahobilam temple history in kannada

Comments

Popular Posts