Sri Kanaka Mahalakshmi Ammavari Devasthanam | Visakhapatnam

ఆలయ చరిత్ర :

ఇప్పటివరకు ఈ దేవాలయానికి సంభందించిన, ఏ ప్రామాణికమైన సమాచారం లేదు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు అప్పటి విశాఖపట్టణం రాజుల యొక్క కులదైవంగా చెప్తారు. అమ్మవారి విగ్రహం అప్పటి రాజుల "కోట" సమీపంలో ఉన్న "బురుజు" అనే ప్రాంతంలో కనుగొన్నారు. అందుకే ఆ ప్రాంతానికి  "బురుజుపేట" అనే పేరు వచ్చిందని నానుడి.

స్థలపురాణం ప్రకారం శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారు ఈ ప్రాంతాన్ని పాలించిన విశాఖ రాజుల ఇలవేల్పు, వారి కోట ఈ పరిసరాల్లో ఉండేది. శత్రురాజులు విశాఖ కోటపై దండెత్తినప్పుడు అమ్మవారిని బావిలో పడేశారు. కలియుగారంభంలో ఓ సత్బ్రహ్మణుడు తపస్సుతో దైవసానిధ్యం పొందాలని కాశీకి పయనమై బురుజుపేట చేరుకున్నాడు. అక్కడ బావిలో స్నానమాచారిస్తుండగా అమ్మవారు ప్రత్యక్షమై తనను పైకి తీసి ప్రతిష్టించాలని కోరారు. అందుకు ఆ బ్రాహ్మణుడు తిరస్కిరించడంతో బావి నుంచి పైకి వచ్చి తన ఎడమ చేతిలోని "పరిఘ" అనే ఆయుధంతో అతడిని సంహరించడానికి యత్నించారు. అతడు శివుని ప్రార్ధించడంతో, శివుడు ప్రత్యక్షమై ఆమె చేతిలోని ఆయుధాన్ని నిర్వీర్యం చేసి, వామహస్తాన్ని మోచేతి దాకా ఖండించాడు. అప్పటితో అమ్మవారి కోపం మాయమై శాంతి, కారుణ్యంతో కలియుగంలో శ్రీకనకమహాలక్ష్మిగా అవతరించి భక్తుల కోర్కెలు తీర్చేలా అనుగ్రహించాడు. అలా వెలిసిన అమ్మవారు నిత్యపూజలందుకుంటున్నారు.
1912 లో వీధి వెడల్పు చేసినప్పుడు అమ్మవారి విగ్రహం అలాగే ఉంచారు. 1917 లో ఆ విగ్రహాన్ని రోడ్డు మధ్య నుంచి 30 అడుగుల దూరం జరిపారు. ఆ తర్వాత విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి వేలాది మంది మరణించారు. అమ్మవారి విగ్రహాన్ని కదపడం వల్లే ఇదంతా జరిగిందని భావించిన ప్రజలు, మళ్ళి ఆ విగ్రహాన్ని యథాస్థానంలో చేర్చారు. అనంతరం ప్లేగు పునరావృతం కాకపోవడంతో అదంతా అమ్మవారి మహిమగా విశ్వాసం ప్రబలింది.
ఆడవాళ్లకు అమ్మవారు "సుమంగళి భాగ్యం" (కలకాలం వారి భర్తలు సుఖంగా జీవించాలి) ప్రసాదిస్తుందని ధృడమైన నమ్మకం. భక్తులు ఆలయానికి పుట్టిన పిల్లలను దేవత యొక్క పాదాల వద్ద ఉంచి దీవెనలు తీసుకుంటారు.

నిర్మాణశైలి:
హిందూమత ఆలయాల నిర్మాణం చాల వైవిద్యాలతో కూడిన సౌష్ఠవ నిర్మాణం, పునాది భాగం చతురస్రాకారంతో మొదలై రేఖాగణితాకరాలైన చతురస్రం లేదా వృత్తాల నిర్మాణం చాలా స్పష్టంగా ఉంటుంది. హిందూ ఆలయాలు గర్భ గుడిని కలిగి ఉంటాయి, ఆ గర్భగుడి లోపల అధినాయకుడు అయిన దేవుళ్ళు లేదా సతీసమేత ప్రతిమలు ప్రతిష్టిస్తారు. ఆ గర్భగుడి చివరభాగాన్ని శిఖరం లేదా విమాన శకటం అంటారు. ఈ నిర్మాణంలో భక్తులు ప్రదక్షిణ చేయడానికి గుడి చుట్టూ స్థలం, దేవిని స్తుతించుటకు అరుగు (ఖాళీ స్థలం) మరియు గర్భగుడికి వాకిలి కలిగి ఉంటుంది.
కళల ప్రావీణ్యాన్ని, ధర్మ ఆదర్శాలను, నమ్మకాలను, విలువలను మరియు హిందువుల జీవన చక్రాన్ని హిందూమత ఆలయ నిర్మాణశైలి తెలుపుతుంది. మనిషికి, దేవునికి మరియు ఆధ్యాత్మిక గురువులకు మధ్య సంబంధాన్ని ఈ పవిత్ర ప్రదేశంలో చెప్పబడుతుంది.

ప్రాచీన హిందూమత గ్రంధాల్లో దేవాలయాలను ఒక పుణ్యతీర్థంగా పేర్కొనబడింది. ఆలయంలోపల వాతావరణం మరియు శిల్ప నైపుణ్యం హిందూ జీవనశైలిని, సిద్ధాంతాలను చాలా స్పష్టంగా తెలుపుతుంది. ఆలయ గర్భగుడి మీద విశ్వ అంశాలు, వాటి మనుగడను శిల్పాఖండాలుగా చెక్కబడింది. నీరు నుండి నిప్పు వరకు, ప్రకృతి రమణీయం నుండి దేవుళ్ళ వరకు, స్త్రీ నుండి పురుషుని వరకు, అర్ధం నుండి కామం వరకు, వివిధ ధ్వనులు మరియు ధూపవాసన నుండి ఆధ్యాత్మికం వరకు - ఈ విశ్వంలోని ఏ ఒక్క అంశాన్ని వదలకుండా అన్ని హిందూమత ఆలయ నిర్మాణశైలి భాగం అయినవి.


ఆలయం గురించి :
శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం, నగరానికి సంబంధించిన బలమైన నేపథ్యం కలిగిన ఒక చారిత్రక ప్రదేశం. విశాఖపట్నం రాజులు శ్రీ కనక మహాలక్ష్మి భక్తులు మరియు శ్రీ లక్ష్మీ తత్వం నమ్ముతారు. ఇక్కడి ప్రజలు దేవత విగ్రహాన్ని అమ్మవారిగా భావించి ఆరాధనలు మరియు పూజలు జరుపుతున్నారు. దేవతామూర్తి అయిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని రాజ వంశీయుల కులదైవంగా భావిస్తారు మరియు అమ్మవారు కోటలోని బురుజు దగ్గరలో ప్రతిష్టించబడ్డారు, అందువలన ఈ ప్రదేశాన్ని బురుజుపేటగా పిలవబడుతుంది.

ప్రతి సంవత్సరం, మార్గశిర మాసంలో మార్గశిర మాస బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు, ఈ మాసంలో అన్నదానం చేసినవారికి అమ్మవారి దీవెనలు కలుగుతాయి అని ప్రగాఢ విశ్వాసం.  అందువలన ఈ మాసంలో ప్రతి రోజు 300 మంది మరియు గురువారం రోజున 600 మందికి అన్నదానం చేస్తారు, బ్రహ్మోత్సవాలలో చివరి రోజున 10000 మందికి అన్నదానం జరుపుతారు. ఈ మాసమంతట భక్తులు మరియు దాతల నుండి విరాళాలు సేకరిస్తారు.

ఈ మధ్యే మార్గశిర దీక్ష మరియు మండల దీక్ష అనే రెండు మాలధారణ వేడుకలు ప్రారంబించారు, ఈ దీక్షలో అమ్మరి దీవెనలు ఎక్కవ పొందవచ్చును అని నమ్మకం. ఉగాది పర్వదినం, ఆంధ్రుల కొత్త సంవత్సర ప్రారంభ దినం, ఆ రోజున అమ్మవారు వెండి ఆభరణాలతో అలంకరించబడి, దేదీప్యంగా దర్శనమిస్తారు. శరన్నవరాత్రులుగా పిలుచుకునే, నవరాత్రి వేడుకల్లో 5వ రోజున అమ్మవారిని లక్ష కుంకుమార్చనతో అలంకరిస్తారు. హిందూ శాస్త్ర ప్రారంభం నుండి సంవత్సరమంతటా పండుగగా చెప్పుకుంటారు మరియు ఆ రోజుల్లో తమ ప్రీతి ప్రధానమైన దేవుళ్లను శరణు వేడుట ఆనవాయితీ. అలాంటి వాటిల్లో బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఒకరు.

వార్షిక పండుగ (మార్గశిర మాస సంబరాలు):
దేవస్థానం వారు వార్షిక పండుగగా పిలవబడే మార్గశిరమాస మహోత్సవాన్ని నెల రోజులు జరుపుకుంటారు. భక్తులు మార్గశిర మాసంలో పెద్ద సంఖ్యలో వచ్చి  శ్రీ కనక మహా లక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ నెలలో ఆమెను పూజించే భక్తుల సంఖ్య మిగిలిన పదకొండు నెలలలో ఆమెను పూజించే భక్తుల సంఖ్యను మించిపోతుంది. ఈ మార్గశిర మాసంలో వచ్చే భక్తులు ఒక ఆంధ్ర రాష్ట్రము నుండే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా ఉంటారు. భక్తులు పెద్ద సంఖ్యలో, ముఖ్యంగా గురువారాల్లో ఆలయ దర్శనం కోసం మార్గశిరమాస మహోత్సవం సమయంలో దర్శిస్తారు. ఎందుకంటే గురువారం దేవతకు చాలా పవిత్రమైన రోజు. రూ 7,500 / - మొత్తాన్ని తీసుకొని పంచామృతాభిషేకం నిర్వహించడానికి ఇద్దరు వ్యక్తులను అనుమతిస్తారు.

మిగిలిన రోజుల్లో (సోమవారం & మంగళవారం మినహా) రూ. 2500 / - అదే పూజ కోసం సేకరించబడుతుంది, మరియు మంగళవారాలు ఈ పూజ రూ. 1,116 /- ఉంటుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మాలధారణ. మాలధారణ అనగా మండల దీక్ష మరియు మార్గశిర దీక్ష, ఈ మాలధారణతో  భక్తులు అమ్మవారి ఆశీషులు పొందుతారు. ఈ దేవాలయంలో అన్నదానానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇక్కడ భక్తులకు అన్నదానం చేయడం లేదా స్వీకరించడం చాల మంచిదని దృఢమైన నమ్మకం.

సంప్రదించండి:
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం,
బురుజుపేట, విశాఖపట్నం - 530 001, 
ఆంధ్ర ప్రదేశ్. ఫోన్: 0891-2566515, 2568645, 2711725 & 2566514

రవాణా :

ఏ.పీ.ఎస్.ఆర్.టి.సి, విశాఖపట్నం నగరంలో ద్వారక ఆర్.టి.సి కాంప్లెక్స్ నుండి తరచుగా బస్సులు నడుపుతుంది.
శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం నుండి 3 కి.మీ సమీపంలో విశాఖపట్టణం రైల్వే స్టేషన్ కలదు.
11.5 కి.మీ. దూరంలో విశాఖపట్నం విమానాశ్రయం కలదు. ఈ విమానాశ్రయం నుండి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ముంబై, తిరుపతి, న్యూ ఢిల్లీ, పోర్ట్ బ్లెయిర్, రాయ్ పూర్, జైపూర్, భువనేశ్వర్ మరియు కలకత్తాకు తరచుగా విమానాలు వున్నాయి. అంతే కాకుండా సింగపూర్, మలేషియా మరియు దుబాయ్ దేశాలకు కూడా అంతర్జాతీయ విమాన సౌకర్యం కలదు.

kanaka mahalakshmi temple wikipedia, kanaka mahalakshmi charitra, simhachalam to kanaka mahalakshmi temple, kanaka mahalakshmi ammavari story in telugu pdf, kanaka mahalakshmi temple vijayawada, erukumamba temple vizag history, mahalaxmi temple, kanaka mahalakshmi actress

Comments

Popular Posts