Sri Durga Nageswara Swamy Vari Devasthanam | Pedakallepalli, Krishna District

ఆలయ చరిత్ర :

ధక్షణ కాశీ క్షేత్రం  పెదకల్లెపల్లి (కదళీపురం)(శైవ ఆగమ
కృష్ణానదీ తీరాన పుణ్యక్షేత్రాలలో దక్షిణకాశీ గా పిలవబడుతున్న పరమ పవిత్ర పుణ్యక్షేత్రం పెదకళ్ళేపల్లి. బౌద్ధ యుగంలో ఈ క్షేత్రాన్ని "కడలిపల్లి" గా పిలిచేవారు..

పురాణాలు ఆధారముగా బదరికా, కేదార, సైమిక, దారుక, ఉత్సల, పుష్కర, ఆనంద,  సైంధవ, గుహ,  మహాదండక, బృందకామిక, చంప, వింధ్య, దీక్ష మొదలగు అరణ్యముల తో పాటు 18వ  అరణ్యంగా కదిలీకారుణ్యము  ఉన్నట్లు పురాణాల్లో ఉంది. చిట్టచివరి కదళీకారణ్యమే ఈ కదలి పురక్షేత్రమని అంటారు. ఈ క్షేత్రానికి కదళీపురం అనే పేరు రావడానికి మరో కథ కూడా ఉన్నట్లు పెద్దలు చెబుతుంటారు. జనమజేయుడు సర్పయాగం చేసిన స్థలంగా కూడా పురాణాలు పేర్కొన్నాయి.

పెదకళ్ళేపల్లి క్షేత్రాన్ని దక్షిణ కాశి గా పిలుస్తారు ఈ క్షేత్ర మహిమ స్కాంద పురాణంలో వివరంగా వివరించబడింది. క్షేత్రమహత్యం గురించి అగస్త్య మహర్షి శ్రీరామచంద్రునికి చెప్పినట్లు పద్మ పురాణంలో పేర్కొనబడింది. అనేకమైన సమానధర్మాలు ఉత్తరాన ఉన్న కాశీ క్షేత్రానికి ఇటు దక్షిణాన ఉన్న ఈ క్షేత్రానికి ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

ఈ క్షేత్రంలో పూర్వం కశ్యప ప్రజాపతి పుత్రులైన కర్కోటక వాసుకి, తక్షక, శంఖచూడ, శంఖపాల, ధనుంజయ, హింగళులను అను అష్టఫణి రాజుల తల్లి కద్రువ శాపం విముక్తికై ఒక శిలా వేదిక నిర్మించి నాలుగు ప్రక్కలా ఆచ్చాధనకై  కదిలి తలుపులను నెలకొల్పి ఈశాన్య భాగమున గోముఖ ఆకారంలో ఒక తటాకం త్రవ్వి దానిలో స్నానమాచరించి నియమనిష్టలతో ప్రతినిత్యము పరమేశ్వరుని పూజిస్తుండగా ప్రక్కనున్న కదలి తలుపులు ఒక్క సారిగా పెలపెళారావలతో  విరిగిపడ్డాయి. అందు నుంచి ఈ శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి లింగరూపంలో దర్శనమిచ్చారు వారు కంగారుగా కదలి కదలి అని కేకలు వేయడంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమై వారితో బోగెంద్రులార నేను ఉద్భవించే సమయమున మీరు వేసిన కేకలు ఆచంద్రతారార్కం ఉండునట్లుగా ఈ కదళిపురం పిలవబడునని  అదే కాలక్రమాన పెదకళ్ళేపల్లి గా పిలవబడుతున్నది. చరిత్ర తెలియజేయుచున్నది.


ఈ ఆలయ ప్రాంగణము నందు శ్రీ పార్వతి, శ్రీ దుర్గా, శ్రీ కాలభైరవ, శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నవగ్రహాలు కలవు వాయువ్యదిశలో సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఉత్తర దిశగా దక్షిణాభిముఖంగా కాలభైరవ ఆలయం ఉంది. ఈశాన్య దిశలో 16 స్తంభముల కల్యాణ మండపం ఉంది. యాగశాల కూడా కలదు ప్రతి నిత్యము ఉదయము రాత్రిపూట నిత్యము బలిహరణ జరుగుతుంది. శ్రీ స్వామివారికి దక్షిణం వైపు ఉపాలయములో వీరభద్రుడు, భద్రకాళీ అమ్మవారు ఉన్నారు. శ్రీ స్వామివారికి ఉత్తర దిశగా శ్రీ దుర్గా అమ్మవారి వేంచేసి యున్నారు.  గర్భాలయంలో పరమ కారుణ్యమూర్తి సమస్త దోష నివారణకు సకలైశ్వర్య ప్రదాయకుడు శ్రీ నాగేశ్వర స్వామి ఉన్నారు. ఆలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు, పైన దక్షిణం వైపు గణపతి ఉన్నారు.

క్రీ.శ. 1292 లో కాకతీయ రాజగురువు సోమశిల ఆచార్యులు ఈ ఆలయాన్ని తొలిసారి ఉద్ధరించినట్లు తెలుస్తుంది ఆయన విగ్రహం నేటికీ ఆలయ దక్షిణ గోడ లో చూడవచ్చు. ఆ తరువాత దేవరకోట సంస్థానాన్ని పరిపాలించిన 13వ జమిందార్ కోదండరామన్నగారు (1746 - 1791) 1782లో విశేష ధనాన్ని వెచ్చించి కట్టడాలను నిర్మించి ఆలయాన్ని పునర్నిర్మించారు. 1795లో 15వ జమీందారైన నాగేశ్వర నాయుడు గారు గోపుర నిర్మాణం గావించారు. ఇప్పటికినీ పెదకళ్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి వారి దేవస్థానానికి చల్లపల్లి జమీందార్లు వంశపారంపర్య ధర్మకర్తలుగా ఉన్నారు.

రవాణా :
By Road:
1. vijayawada to pedakallepalli via vuyyuru, pamarru, challapalli
2.vijayawada to pedakallepalli via karakatta yenamalakuduru, thotlavalluru, srikakulam, challapalli

By Train:
vijayawada to pedakallepalli via gudivada, machilipatnam train rout machilipatnam to challapalli bus route and challapalli to pedakallepalli bus or auto

సంప్రదించండి :
శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారి దేవస్థానం
మోపిదేవి( మం.),  పెదకల్లేపల్లి, కృష్ణా జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్, పిన్ కోడ్: 521 130
ఆఫీస్ : 08671 - 275230


vijayawada to pedakallepalli, pedakallepalli shiva temple, pedakallepalli pin code, vijayawada to pedakallepalli bus timings, pedakallepalli weather report, pedakallepalli wikipedia, vijayawada to pedakallepalli distance, pedakallepalli indian bank ifsc code

Comments

Popular Posts