Sri chamundeswari Ammavari Devastanam | Gangapatnam, Nellore

ఆలయ చరిత్ర :

శ్రీ చాముండేశ్వరి అమ్మవారు నెల్లూరు పట్టణమునకు తూర్పు 24కి.మీ. దూరంలో గంగపట్నం గ్రామమునకు తూర్పు దిశగా సముద్రమునకు ఒక కిలోమీటరు దూరమున వెలసియున్నారు. శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని 1100సం II లు క్రితం శాక్తేయ మతస్థులు ప్రతిష్ట చేసి దేవాలయమును నిర్మించినారని చరిత్ర. ఇది మొదలు శ్రీ అమ్మవారికి నిత్య నైవేద్యములు బ్రహ్మోత్సవములు జరుగుతున్నవని చెప్పుచున్నారు. తరువాత క్రీ II శ II 1515 సం II లో చంద్రగిరిరాజులు చెన్నప్పరాయుడు గారు ముఖ మండపము, శ్రీ అమ్మవారిని, ద్వారపాలకులను పునఃప్రతిష్ట చేసినట్లుగా శాసనములు దక్షిణ ద్వారము పైన అచ్చ తెలుగునా నాగలిపిలో వ్రాయబడియున్నది. తదుపరి తేది.08.04.2009న శ్రీ అమ్మవారిని పునఃప్రతిష్ట కావించినారు. తేది.28.05.2009 శ్రీ కంచికామకోటి పీటాధిపతులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు శ్రీ అమ్మవారికి మహాకుంభాభిషేకము నిర్వహించినారు. శ్రీ అమ్మవారి దేవస్థానము అష్టాదాశ శక్తీ పీటాలలో నాలుగో పీటముగా చాముండి క్రౌంచ పట్టణము (గంగపట్నం)గా విరాజిల్లుచున్నది. ఈ దేవాలయమునకు పడమర కోనేరు కలదు. దీనిని కొలను (కొల్లుగుంట) అని అందురు. శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని సేవించిన మానసికమైన వ్యాధులు, గ్రహదోషములు, దీర్గరోగములు సాయమగుచున్నవి. సంతానం లేనివారు శ్రీ అమ్మవారి దేవస్థానమునకు వచ్చి స్నానమాచరించి భక్తితో 40రోజులు 108 ప్రదక్షిణములు చేసి శ్రీ అమ్మవారిని సేవించి వారికి తంతానము కలుగుచున్నది. అందువలన శ్రీ చాముండేశ్వరి అమ్మవారికి భక్తులు మ్రొక్కుబదులు, విశేషముగా పెట్టుచున్నారు. శ్రీ అమ్మవారికి చీరలు, రవికలు సమర్పించుకొనుచున్నారు. శుక్రవారము నందు, ఆదివారములందు పూలతో పూలంగిసేవలు చేయుచున్నారు. గంగపట్నం గ్రామాచారమేమనగా శ్రీ అమ్మవారి బ్రహ్మోత్సవముల మొదలై, కోడికట్టినది మొదలు కోడి విప్పినంతవరకు ప్రతి ఇంతా ప్రతి ఒక్కరూ మాంసాహారములు నిషేదించెందురు. ప్రతి ఒక్కరూ శుచి, శుభ్రత నియమనిష్టలతో శ్రీ అమ్మవారి కల్యానమును తిలకించెదురు. అట్టి ఈ క్షేత్రము నెల్లూరు పట్టణమునకు తూర్పున 24కి.మీ. దూరమున బస్సుల రాకపోకలకు అనువైయున్నది.

gangapatnam chamundeshwari devi, gangapatnam chamundeshwari temple, gangapatnam, nellore, chamundeswari temple history telugu, gangapatnam, 

Comments

Popular Posts