Sri Boyakonda Gangamma Vari Devasthanam | Diguvapalli, Chowdepalli Mandalam

శ్రీ అమ్మవారి ఆలయ సంగ్రహ చరిత్ర :
ఆలయాలకు నిలయమైన చిత్తూరు జిల్లాలో వేంచేసియున్న శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము జిల్లాలో ప్రముఖ శక్తి క్షేత్రముగా బాసిల్లుతోంది. జిల్లాలోని చౌడేపల్లి మండలమునకు   12 కి.మీ.ల దూరములో వున్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ నిర్మాణము దక్షిణ భారతావనిలో ఎక్కడ లేని విధముగా 88 స్తంభాలపై సుందరముగా శ్రీ చక్ర రూపములో నిర్మించారు. ఇక్కడి అరణ్యములో గతములో బోయలు, ఏకిల దొరలు నివసించిన కొండ గట్టుపై వెలసిన కాళికా దేవి ప్రతిరూపమైన ఈ దేవతను భక్తులు “శ్రీ బోయకొండ గంగమ్మ”పేరుతో ఆరాదిస్తారు.
ఆంధ్ర, కర్నాటక మరియు తమిళనాడు ప్రాంతాల నుండి నిత్యము వేలాదిగా తరలి వచ్చే భక్తులతో శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము ఆదాయములోనూ, భక్తులను ఆకర్షించడములోనూ జిల్లాలో ప్రముఖ దేవాలయాలైన తిరుమల బాలాజి, కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానము, శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయాల సరసన చేరినది. మహిమాన్వితమైన శక్తులతో కోరిన కోర్కెలు నెరవేర్చే తల్లిగా పూజలు అందుకొంటున్న బోయకొండ గంగమ్మ సంతాన కల్పవల్లిగా పేరు గాంచినది. శ్రీ అమ్మవారిని కోరికలు కోరడములో తమకు కలిగిన సంతానానికి తల్లి పేరు పెట్టుకోవడము ఇక్కడి భక్తులకు ఆనవాయితీ ఉంది. ఈ ప్రాంతాలలోని అనేక మంది ప్రజలకు బోయకొండప్ప, బోయకొండమ్మ అను పేర్లు ఉండడము గమనించవచ్చు.


స్థల పురాణము - ఆలయ సంగ్రహ చరిత్ర
పూర్వము రాజ్య కాంక్షతో ప్రజల ఆలన-పాలన విస్మరించిన సమయములో భారతావనిని నవాబులు పరిపాలించేవారు. దక్షిణ భారతంలో తమ అధిపత్యము నెలకొల్పాలనే ధ్యేయముతో తమ సేనలతో దండయాత్రలు చేస్తున్న రోజులవి.
ఆంధ్రప్రదేశ్ స్థానిక పరిపాలకులైన జమీందార్లు, పాలేగాళ్లను జయించి తమ ఇష్టానుసారముగా కప్పం నిర్ణయిస్తున్న గోల్కొండ నవాబులు పుంగనూరు ప్రాంతాలపై కూడా దండెత్తారు. నవాబు సైన్యాలు గ్రామాలలో చొరబడి దాడులు చేయడము మొదలు పెట్టాయి. నవాబు సేనల క్రూరమైన దాడుల వలన ప్రజలు భ్రయ భ్రాంతులై చెల్లా చెదురై పారిపోయారు.
పుంగనూరు వైపున వస్తున్న పదాతి దళాలు చౌడేపల్లి వద్ద గల అడవులలో నివసించే బోయలు, ఏకిల దొరలపై కూడా దాడులు చేసి స్ర్తీల మాన, ప్రాణాలను హరించివేశారు. నవాబు సేనలను పౌరుషముతో ఎదుర్కొన్న బోయ, ఏకిల వీరులు నవాబుల చేతిలో బలయ్యారు. ఈ యుద్ధములో అసంఖ్యాకముగా నవాబు సేనలు కూడా హతమయ్యారు. తగ్గిన సేన బలముతో బోయలు, ఏకిల వీరులతో పోరాడలేక వెనుతిరిగిన సేనలు గోల్కొండ నుండి విస్తృత సేనావాహినితో బయలుదేరాయి. ఈ విషయము తెలుసుకొన్న బోయలు, ఏకిల దొరలు భయంతో దగ్గరలోని కొండపైకి వెళ్ళి తల దాచుకొని తమకెవరు దిక్కని జగజ్జననిని ప్రార్ధించారు. వీరి ప్రార్ధనలు ఆలకించిన శక్తి స్వరూపిణి అయిన గంగమ్మ అవ్వ రూపములో వచ్చి బోయలకు, ఏకిల దొరలను నేనున్నానని దైర్యము చెప్పింది. మరింత సైన్యముతో వచ్చిన నవాబు సేనలను అవ్వ రూపములోని శక్తి స్వరూపిణి అయిన గంగమ్మ తన ఖడ్గముతో హతా మార్చడము ప్రారంభిచినది. అమ్మవారి ఖడ్గముతో వేలాది మంది నవాబు సేనలను హత మార్చింది. శ్రీ అమ్మవారి ఖడ్గ దాటికి రాతి గుండ్లు సైతము నిత్త నిలువుగా చీలిపోయినాయి.

నవాబు సేనలను హతమార్చిన అమ్మవారు శాంతించడానికి బోయలు, ఏకిల దొరలు ఒక మేక పోతును బలి ఇచ్చి ఆమెకు ముద్ద కూడు పెట్టారు. శాంతించిన అమ్మవారిని బోయలు, ఏకిల దొరలు ప్రార్ధించి తమతో వుండమని కోరారు. వారి కోరిక మేరకు వెలసిన అమ్మవారిని దొర బోయకొండ గంగమ్మగా పిలవడము పరిపాటి అయినది. నవాబులతో పోరాడినపుడు అమ్మవారి ఖడ్గ దాటికి రెండు ముక్కలయిన రాతి గుండు కొండపైన హిందువులు కట్టుకొన్న సిత్తారి కోట, నల్ల మందు పోసిన గెరిసెలు, గుంటి క్రింద దొణ, శ్రీ అమ్మవారు నీళ్లు త్రాగిన స్టలము గుర్తు, ఉయ్యాల ఊగిన గుండ్లు మొదలగునవి అమ్మవారి మహిమాలకు శాశ్వతముగా నిలచిన స్థలాలు. కొండపైన సుందరమైన అమ్మవారి ఆలయానికి సరిగ్గా క్రిందన వున్న పుష్కరిణిలో నీరు అతి పవిత్రమైన తీర్థముగా భక్తులు భావిస్తారు. ఈ పుష్కరిణిలో నీరు సేవించడము వలన సకల రోగాలు మటుమాయమవుతాయని, పంటలపై చల్లిన చీడ-పీడలు మరియు మానవ సంబంధమైన గాలి భయాలు ఈ తీర్థము మహిమకు దూరమవుతాయని భక్తుల విశ్వాసము.
శ్రీ అమ్మవారు ఆలయమునకు వెళ్ళే దారిలో రణభేరి గంగమ్మ ఆలయాన్ని దర్శించుకొనే అవకాశము వుంటుంది.
శ్రీ బోయకొండ గంగమ్మ దేవాలయము చౌడేపల్లి మండలమునకు 12 కి.మీ., పుంగనూరుకు మరియు మదనపల్లి మండలములకు 18 కి.మీ., దూరమున కొండపై వెలసియున్నది.

శ్రీ అమ్మవారి మహత్యలు:
రైతులు తమ పంటలకు సోకిన తెగులు నివారణకు చీడ-పీడ విరుగుడునకు గానూ, పశువుల అనారోగ్యము, మనుషులకు దీర్ఘకాలిక రోగాలకు శ్రీ అమ్మవారి తీర్థము సేవించిన నయమవుతాయి.
విశేషాంశము:-

“శ్రీ అమ్మవారిని దర్శించి భక్తాదులు పుష్పము ఆడుగుట” శ్రీ అమ్మవారి శిరస్సుపై అర్చకులు ఉంచిన పుష్పము కుడివైపున పడిన వారి మనస్సులోని కోరికలు తీరునట్లును, ఎడమ వైపునకు పడిన వారి కోరికలు తీరుట కష్టముగానూ భక్తాదులు భావిస్తారు.

ఆలయ సమయాలు:
ఉదయం 06:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు తెరచి ఉండును.
ఈ దేవస్థానము నందు శ్యాక్తేయ ఆగమము ప్రకారము పూజాది కార్యక్రమములు జరుగుచున్నవి.

సంప్రదించండి :
శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారి దేవస్థానం,
దిగువపల్లి గ్రామం, చౌడేపల్లి మండలం, చిత్తూర్ జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్ - 517 257. ఫోన్ : 08581-254766 & 254777


రవాణా :
చిత్తూర్ బస్సు స్టేషన్ నుంచి 88 కి. మీ ల దూరంలో ఈ ఆలయం ఉంది. అక్కడి నుండి బస్సులు కలవు, ఈ ఆలయం తిరుపతి నుంచి 110 కి. మీల దూరం లో ఉంది.
పాకాల రైల్వేజంక్షన్ ఈ ఆలయానికి 21 కి. మీ ల దూరంలో ఉంది.
తిరుపతి విమానాశ్రయం ఈ దేవస్థానానికి 150 కి. మీ ల దూరంలో ఉంది.

boyakonda gangamma temple rooms, boyakonda gangamma temple history in tamil, tirupati to boyakonda gangamma temple distance, buses from bangalore to boyakonda gangamma temple, boyakonda gangamma distance, boyakonda gangamma charitra, boyakonda distance, boyakonda gangamma photos download, boyakonda gangamma temple history telugu, boyakonda gangamma temple information.

Comments

Popular Posts