Sri Ardhagiri Veeranjaneya Swamy Vari Devasthanam | Aragonda

ఆలయ చరిత్ర :

ఈ అర్ధగిరి క్షేత్ర ఆవిర్భావం వెనుక కమనీయమైన, రమణీయమైన రామాయణ గాధ ఉంది. అదేమిటంటే త్రేతాయుగం కాలంలో రామ రావణుల మధ్య సంగ్రామం జరుగుతుండగా, రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు చేతిలో లక్ష్మణుడు మూర్చబోతాడు. లక్ష్మణుడిని మేల్కొలపడానికి సంజీవని అవసరమైంది. అంతే, సంజీవని ని తీసుకొని రావడానికి శ్రీరామ భక్తుడైన జగదేకవీరుడైన ఆంజనేయుడు జై శ్రీరామ్ అంటూ వాయువేగంతో ఆకాశంలోకి లంఘించాడు.

సంజీవని ని ఆ పర్వతంపై ఎక్కడుందో కనుగొనలేక పర్వతాన్నే ఏకంగా పెకలించి, తన అరచేతిలో తీసుకొని వస్తుండగా, అర్ధకొండ విరిగి పెళపెళరాలడంతో నేల మీద పడింది. ఆ కొండ పడిన ప్రాంతమే అర్ధగిరి, ఆ ప్రాంతంలో ఒక గ్రామం వెలసింది. ఆ గ్రామమే అరకొండగా, కాలక్రమేణా అరగొండగా రూపాంతరం చెందుతూ వచ్చిందని ఎందరో భాగవతుల కధనం, స్థల పురాణం. అప్పటిలో స్వయంభుగా సహజ సిద్దముగా సంజీవరాయ పుష్కరిణి వెలసినది అందులోను తీర్థం (నీరు) సేవించడము వలన ఆయుఆరోగ్యము కలుగునని భక్తులు ప్రగాడ విశ్వాసం మరియు విశేషముగా ప్రతి నెల పౌర్ణమి రోజు వేలాది మంది భక్తులు వచ్చి శ్రీ స్వామి వారిని దర్శించి ఇచటనే వుండి మరుసటి రోజు  ఈ యొక్క తీర్థము సేవించి మరియు వారి వారి గృహములకు తీసుకొని పోవుట ఆన వాయితిగా జరుగు చున్నది మరియు శ్రీ స్వామి వారిని పూర్వ కాలములో మహర్షలచే ప్రతిష్టించబడినది. 

ఇంకా, అర్ధగిరిలో, శివాలయం, వినాయక స్వామి ఆలయం,  చిన్న  అయ్యప్ప స్వామి ఆలయం కూడా వున్నాయి.

ఆలయ  కాలము : ఉదయం:  5.00 గం// ల  నుండి  రాత్రి :  9.00  గం// ల వరకు

రవాణా :
By Road:
తిరుపతి ... చిత్తూరు .. అరగొండ.. అర్ధగిరి

తిరుపతి .. కాణిపాకం .. అరగొండ .. అర్ధగిరి
బెంగుళూరు .. పలమనేరు.. బంగారుపాళ్యం .. అరగొండ... అర్ధగిరి
అనంతపురం .. మదనపల్లి... పుంగునూరు.. పలమనేరు.. బంగారుపాళ్యం... అరగొండ.. అర్ధగిరి
హైదరాబాదు.. కడప .. పీలేరు .. చిత్తూరు... అరగొండ.. అర్ధగిరి

By Train:
చిత్తూరు సమీప రైల్వే స్టేషన్.

By Air:
తిరుపతి నుంచి విమానాశ్రయం మార్గం ద్వారా ఈఆలయానికి చేరుకోవచ్చు.

సంప్రదించండి :
శ్రీ అర్ధగిరి వీరాంజనేయస్వామి వారి దేవస్థానం
అరగొండ గ్రామం, తవనం పల్లి మండలం, చిత్తూరు జిల్లా,

ఆంధ్ర ప్రదేశ్-517 129.
ఫోన్: 08573 –283687,283689,283690&283691
ardhagiri veeranjaneya temple phone number, chittoor to ardhagiri distance, ardhagiri temple images, aragonda temple images, kanipakam to ardhagiri, aragonda temple to kanipakam, kanipakam to ardhagiri bus timings, aragonda temple history in telugu, 

Comments

Popular Posts