ఆలయ చరిత్ర :
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుపతిలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము తర్వాత అతి ప్రాచీనమైనదిగా శ్రీ మత్ కదిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం ప్రసిద్ధిచెందింది. హిరణ్యకస్యపుని సంహరించిన అనంతరము ఉగ్రస్వరూపులైన శ్రీ నరసింహస్వామి వారిని కదిరి పట్టణమునందు గల "స్తోత్రాద్రి" పర్వతవము వద్ద ముక్కోటి దేవతలు, భక్తప్రహ్లదుడు శాంతియింపచేసిరి. అందువలన ఈ క్షేయత్రము ప్రహ్లద సమితి నరసింహస్వామి దేవాలయము వెలిసినది స్థలపురాణ ప్రకారం కదిరి పట్టణముకు ఆ పేరు వచ్చుటకు అనేక గాధలు ఉన్నవి.
"ఖా" అనగా విష్ణు పాదమనియు "అద్రి" అనగా పర్వతము అనియు అర్ధము. ఈ ప్రాంతములో స్వామి వారు పాదము మోపినందున ఈ పట్టణము "ఖాద్రీ" (కదిరి) అని పిలవబడుచున్నది. ఒరిస్సా రాష్ట్రములో పుట్టిపట్టణ ములో వెలసియున్న కొయ్య జగన్నాధునివలే ఈ క్షేత్రమున నరసింహస్వామి వారు చండ్రవృక్ష (ఖదరి వృక్షము ) కొమ్మపై చాలాకాలము వెలసి ఉన్నారు అని ప్రతీతి.
స్వామి వారు స్వప్నమున ఆదేశించిన విధముగా విజయనగర రాజైన వీరబుక్కరాయలు 1274 - 1275 సంవత్సరములో ఖదిరి వృక్షము క్రింద పుట్టలో ఉన్న సాల గ్రామములను బయటకు తీసి ఈ దేవాలయములో ప్రతిష్టించారు. ఈ సాలగ్రామములు కాల గతిలో అదృశ్యమైనందున 1545 లో విజయనగర రాజు అయిన అచ్యుత దేవరాయలు శ్రీవారి స్వప్న ఆదేశముల మేరకు ప్రస్తుతము ఈ క్షేత్రమున అష్టబాహువులతో హిరణ్యకస్యుపుని సంహరించు ఉన్న రాతివిగ్రహముగ విరాజిల్లుతున్న మూలవిరాట్లను స్తోత్రాద్రి పర్వత గ్రామాల నుండి (స్వామి వారి ఆదేశముల మేరకు) తీసుకొని వచ్చి ఈ దేవాలయములో ప్రతిష్టించారు.
శ్రీనరసింహ స్వామి వారు శ్రీ భృగు మహర్షికి అర్చనార్థం వసంత వల్లభుల విగ్రహములను ఒక పేటికలతో ఇచ్చారు. ప్రసాదించిన ఆ విగ్రహములను స్వామి వారి ఆదేశముల మేరకు భృగుతీర్థము నుండి బయటకు తీసిన వసంతవల్లబుల ఉత్సవ విగ్రహములును, స్వామి వారి ప్రస్తుత మూలావిరాట్నును అత్యంత వైభోగముగా, రాజసం ఉట్టిపడురీతిన ఆడంబరముగా వసంతరుతుల్లో ఈ దేవాలయాలుములో ప్రతిష్టించినందున ఉత్సవవిగ్రహములు వసంతవల్లభులుగా నామంతరము చెందినారు. ఈ పట్టణం ఖదరి వృక్షములతో నింపి ఇచ్చట ఈ దేవాలయాలయమును నిర్మించారని ప్రతీతి.
బ్రహ్మాండ పురాణములో, ఖాద్రిస్థలపురాణాల్లో ఎంతో విపులంగా చర్చించబడింది. కదిరి పరిసరప్రాంతంములన్నియు. వేదవ్యాస మహర్షి వారు తన శిష్యలు ఉనికిని రాక్షసులుకు తెలియకుండా వారికి విద్యా బుద్ధులు ఇచ్చట నేర్పించుట వలన ఇది కేంద్రమైనది. అర్జునుడు తపస్సు చేసిన మద్దిలేరు (అర్జున నది ) ఈ ప్రాంతములో శ్వేతపుష్కరిణి , భృగుతీర్థము , కుంతితీర్థము, లక్ష్మితీర్థము , గంగతీర్థము, గరుడతీర్థము , భావనాశిని తీర్థములను తాకుతూ ప్రవహిస్తూ ఈ నది విరాజిల్లుతుంది.
ఈ దేవాలయాలు మొదట పశ్చిమ చాణుక్యలు 985 - 1076 సవంత్సరము మధ్య దేవాలయమును కృష్ణవర్ణ శిలలపై అతి సుందరముగా చెక్కిన శిల్పములతో నిర్మించగా విజయనగర రాజు అయిన వీరబుక్కరాయలు 1274 - 1275 మధ్యలో స్వప్నమున నరసింహస్వామి వారు ఆదేశించిన విధంగా స్వామి వారి సాలాగ్రములను కదరి వృక్షం క్రిందయున్న పుట్టలో నుంచి బయటకు తీసి దుర్గాదేవి దేవాలయానముకు దక్షిణమున అమ్మవారి దేవాలయమును సుందరశిల్పములతో ఈ నరసింహ క్షేత్రము నందు నిర్మించి ఇందులో ప్రతిష్టించారు. ద్వారపాలాకుల, గరుడరాయములు , అనేక మండపములును నిర్మించి 1953 లో దూరంగా దేవి విగ్రహముకు బదులు లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్టించటం జరిగింది దుర్గాదేవి మూలవిగ్రహమును ఇప్పటికి అమ్మవారి దేవాలయములో చూడవచ్చు.
1931 నరసింహదాసరి , లక్ష్మణదాసరి అనే భక్తులు పెద్ద ఎత్హున దీపపు రాతి స్తంభములును దేవాలయం లోపల బయట పెట్టినారు . 1509 లో శ్రీకృష్ణదేవరాయ మహారాజు సింహ ప్రతిమల్తో యున్న మండపం (రంగ మండపం ) ను , ఆల్లవారులు సన్నిధులను నిర్మించారు. 1545 లో అచ్యుత దేవరాయ ప్రభువు తూర్పు రాజు గోపురం , వినాయక , కృష్ణమందిరములు , రాఘవేంద్ర బృందాలను నిర్మించారు. 1569 శ్రీ తిరుమూలరాయల మండపాలను, పుష్కరిణులను నిర్మించారు. ఈ దేవాలయములో విజయనగర రాజుల శిలా శాసనములు ఉన్నవి. ఛత్రపతి శివాజీ మహారాజు ఈ దేవాలయం వెలుపల మహిషాసుర మర్ధిని దేవాలయాన్ని 1642 - 1644 మధ్యలో నిర్మించారు.
ఆలయం గురించి :
కదిరి లక్ష్మినరసింహ స్వామి ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంజిల్లాలో ఉంది. హిందూ పురాణాల ప్రకారం నరసింహ స్వామి హిరణ్యకశిపుని చంపడానికి కదిరి చెట్టు యొక్క మూలాల నుండి స్వయంభుగా ఉద్భవించారు. ఈ ఆలయంలోని విగ్రహానికి విశిష్టమైన లక్షణం యేమిటంటే రోజువారీ పవిత్ర స్నానం లేదా అభిషేకం తర్వాత స్వామివారికి చెమట పడుతుంది .ఈ తీర్ధయాత్ర హిందూ భక్తులకు కేంద్రంగా ఉంది. కదిరిలో ప్రతి సంవత్సరం గొప్ప విందు మరియు ప్రదర్శనలు పండుగగా జరుపుకుంటారు . కాదిరి చెట్టు నుండి వచ్చిన లక్ష్మీ నరసింహ స్వామి కాబట్టి తరువాత ఈ ప్రదేశం కదిరి అని పేరు గాంచింది.
నరసింహ స్వామి వారి ఆలయం రాయల వారి కాలంలో నిర్మించబడింది. నరసింహ స్వామి విగ్రహారాధన ప్రత్యేకంగా ప్రతిరోజూ పవిత్రమైన స్నానం లేదా అభిషేకం తర్వాత చెమట పట్టుకుంటుంది. దేవాలయంలోని నరసింహ స్వామి యొక్క విగ్రహం ఎనిమిది చేతులు మరియు సింహం ముఖం కలిగి ఉంది. స్వామివారు హిరణ్యకశిపుని సంహరిస్తుండగా ప్రహ్లాదుడు చేతులు కట్టుకుని స్వామివారి వెనుక నిలబడి ఉంటాడు.ఈ విగ్రహం మొత్తం పౌరాణిక కథను తెలుపుతున్నట్లుంటుంది. ఈ దేవాలయం అందమైన విగ్రహాలతో నిండిన విస్తారమైన ప్రాంతంలో విస్తరించి ఉంది. గర్భగృహం మరియు ముఖ మండపం వంటి ప్రాంతాలు త్రేతాయుగం యొక్క పురాణ నిర్మాణ కళలకు ఉదాహరణ. గర్భగృహం మూలలో నాలుగు సింహాలతో అందంగా అలంకరిస్తారు.
ఈ ఆలయానికి నాలుగు ప్రవేశాలు ఉన్నాయి, వీటిలో తూర్పు ద్వారం హరిహరాయ నిర్మించిన ప్రధాన ద్వారం. తూర్పు కనుమల ప్రవేశద్వారం వద్ద అజనేయస్వామి విగ్రహం చూడవచ్చు. తామరపువ్వు ఆకారపు వేదికలో నరసింహస్వామిని చిత్రీకరించారు,దాని వెనుక ప్రహ్లాద మరియు అంజనీయని నిలబడిఉన్న విగ్రహాలు ప్రధాన ముఖద్వారం దగ్గర ఉన్నాయి . నాలుగు చేతులు కలిగిన ప్రహ్లాదుంగగ్ర మూర్తి మరియు లక్ష్మీ దేవత యొక్క అందమైన విగ్రహం కలిగిన మరొక దేవాలయం ఉన్నది.
పురాణాల ప్రకారం భుఘురుషి ఉత్సవమూర్తులను ఒక పేటిక రూపములో రోజువారీ పూజ మరియు ఆరాధన లు చేసుకునేవాడు అని ప్రీతీతి .అనంతరం స్వామివారు వసంత వల్లభూడు లేదా వసంత మాధవులుగా పేర్లతో వసంత కాలం లో ప్రతిష్ట చేసారు.అర్జున నదిగా పిలువబడే మడ్డిలారు నది పరాజయం కలిగిన నది ఒడ్డున దాని పురస్కార కీర్తిని కలిగి ఉంది. ఈ నదీ తీరం 6 తీర్థామాల ద్వారా వరుసగా ఉంటుంది.
స్వేత పుష్కరిణి
భ్రుగు తీర్ధం
శేష తీర్థం
కుంతీ తీర్థం
లక్ష్మి తీర్థం
గంగా తీర్థం
గరుడ తీర్థం
భావాసీ తీర్థం
ఈ ఆలయం యొక్క ప్రసిద్ధ తూర్పు, దక్షిణ, ఉత్తర మరియు పశ్చిమ రాజగోపురాలను వరుసగా విజయనగర చక్రవర్తులు నిర్మించారు. వెస్ట్ రాజగోపురం వద్ద గేటు మార్గం, ఆలయం నీటిని సరఫరా చేసే తొట్టెకు దారితీస్తుంది.ఈ ఆలయంలోని ఇత్తడి విగ్రహాలు బ్రిగు మహర్షి వలన తిరిగి కాపాడబడాయి. విజయనగర శ్రీ కృష్ణ దేవరాయ రాజు మరియు మహారాష్ట్ర రాజు శివాజీ మహరాజ్ ఈ ప్రసిద్ధ ఆలయాన్ని సందర్శించారు మరియు మహిషాసురమర్ధిని ఉప ఆలయాన్ని నిర్మించారు.
ఆలయ సమయాలు:
ఉదయం 6 :30 నుండి 1:30 వరకు ఉంటుంది.
సాయంత్రం 4 :30 నుండి 8 :30 వరకు ఉంటుంది.
సంప్రదించండి :
శ్రీమత్ కదిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం,
కదిరి, అనంతపురం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్,
పిన్ కోడ్: 515 591, ఆఫీస్: 08494 - 221066 & 221366
విచారణ:08494 - 223218
రవాణా :
ఆంధ్ర ప్రదేశ్ నలు మూలాలు నుండి ఏ.పి.ఎస్.ర్.టి.సి బస్సులు ఉన్నాయి.
అనంతపురం నుండి 90 కి.మీ.
తిరుపతి నుండి 200 కి.మీ.
వైఎస్ఆర్ కడప నుండి 150 కి.మీ.
బెంగళూరు నుండి 180 కి.మీ.
కదిరి పట్టణానికి రైల్వే స్టేషన్ కలదు. తిరుపతి - అనంతపురము ( పాకల జంక్షన్ - ధర్మవరం జంక్షన్)
సమీప విమానాశ్రయాలు పుట్టపర్తి (40 కి.మీ.), బెంగుళూర్ విమానాశ్రయం (130 కి.మీ.), కడప విమానాశ్రయం (104 కి.మీ.) , తిరుపతి విమానాశ్రయం (180 కి.మీ.)
kadiri lakshmi narasimha swamy temple distance from bangalore, kadiri lakshmi narasimha swamy temple room booking, kadiri narasimha swamy temple sevas, kadiri narasimha swamy online booking, kadiri narasimha swamy temple room booking, kadiri lakshmi narasimha swamy brahmotsavam 2020, kadiri temple contact number, kadiri temple timings on sunday, kadiri temple information telugu, kadiri temple history

Comments
Post a Comment