ఆలయ చరిత్ర :
కోటబొమ్మాలి నడిబొడ్డున ఉన్న ఈ అమ్మవారు చాలా పేరొందిన దేవత ... చుట్టుప్రక్కల గ్రామాలే కాక ఒరిస్సా నుండి చాలా మంది భక్తులు దర్శిస్తూ ఉంటారు . యం.పి. కింజరాపు ఎర్రం నాయుడు .. ఇంటి దైవం గా ఈ కొత్తమ్మతల్లిని కొలుస్తారు . పూర్వము ఇది ముఖ్య గ్రామదేవత గా వేలిసేది .
గ్రామస్తులను చల్లగా చూస్తూ, అంటు వ్యాదులనుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపుకాస్తుండే దేవత - గ్రామదేవత గ్రామదేవతల పూజావిధానం తరతరాలుగా మనకు వస్తున్న గ్రామీణ సంప్రదాయం. మానవుడు నిత్య జీవితంలో యెన్నో జయాపజయాల్ని చవి చూస్తున్నాడు. మరో వైపు తన లక్ష్య సాధనకోసం యెన్నో ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. మాతృదేవతారాధనలో సకల చరాచర సృష్ఠికి మూల కారకురాలు మాతృదేవత అని గ్రహించిన పురాతన మానవుడు, ఆమెను సంతృప్తి పరచేటందుకు యెన్నో మార్గాలను ఆశ్రయించాడు. అందులో ప్రార్థన, మంత్రతాంత్రికతలు, పవిత్రీకరణ, ఆత్మహింస , బలి అనేవి ప్రధానంగా కనిపిస్తాయి .
గ్రామాలలో వెలిసే దేవత దేవుళ్ళను ముఖ్యము గా స్త్రీ దేవతా రూపలను గ్రామదేవతలని అందురు. సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు. ప్రాచీన కాలము లో మానవుడు ఎంతోతెలివైనవాడు,ఇంట్లోవున్న చిన్నా,పెద్దా,ఆడా,మగా-అందరూ దేవీనవరాత్రుల కాలములో ఎక్కడోవున్న మధుర మీనాక్షమ్మ వద్దకో ,కంచి కామాక్షమ్మ దగ్గరికో,బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే కుదరకపోవచ్చు. ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళేవీలుండకపోవచ్చు. వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము సాద్యపడకపోవచ్చు. ఇలాంటి సంధర్బాలలో అలాంటి వాళ్ళు అమ్మ దర్సనానికి వెళ్ళలేకపోయామే అని నిరాశ పొందకుండావుండేందుకు ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించుకొన్నామనే త్రుప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటుచేసారు పెద్దలు.
ఈ దేవతా ప్రతిష్ట గొప్ప విద్వాంసులైన వేద,స్మార్త,ఆగమ శాస్త్ర పండితులచేతనే జరుగుతుంది. ఎవరికి నిజమైన భక్తిప్రపత్తులతోపాటు అర్చకునిగా వుండే తీరిక, ఓపిక వుంటాయో అలాంటి వారిని వారికోరిక మేరకు అర్చకులుగా నియమించారు పూర్వికులు. అప్పటినుంచి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి భాద్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు. దేవతా విగ్రహప్రతిష్ట శాస్త్రీయంగా నిర్వహించబడింది కాబట్టి,ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము సరైన మూహూర్తములోనే వేయబడింది కాబట్టి గ్రామదేవతలంతా శక్తివున్న దేవతలే అవుతారు-భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు. అయితే ప్రతి సంవత్సరము ఆలయప్రతిస్ట జరిగిన ఆ నెల,ఆ తిథి నాడు ఖచ్చితముగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్చిందే. అలా చేయడమువలన అమ్మకి మన ద్వారా ఏదైనా అపవిత్రత కలిగివుంటే తొలగుతుంది.
ఆలయం గురించి :
సుమారు 300 సం. క్రింతం ఒరిస్సా రాష్టంలో గల బిడారి దండు (సంచార తెగ) వారు వారి జీవనోపాది నిమిత్తం గ్రామ, గ్రామానా తిరుగుతూ జీవనోపాది చేసుకునేవారు. ఒకనాడు ఆ రాష్ట్రములో గల కేళిందపురం గ్రామలో వారు ఇక్కడ క్షామ పరిస్దితుల దృష్ట్యా ఈ ప్రాంతంను వీడి వేరొక చోటుకు తరలిపోవుటకు యోచన చేస్తూవుండగా, అ సమయంలో ఆ మర్రిచెట్టు నుండి ఆకాశవాణి ద్వారా మీరు తీసుకున్న నిర్ణయం సరైనది అనియూ, మీతో పాటుగా నేను కూడా వచ్చేదను అని చేప్పుట జరిగినది. ఈ సంఘటన తరువాత అ బిడారి దండు వారు చాలా సంతోషించి బయలు దేరుటకు సిద్దమయ్యారు. అయితే శ్రీ అమ్మవారు ఒక షరతు మాత్రం విధించుట జరిగినది. నేను ఎంత వరకు ప్రయాణిస్తే అంతవరకు మీరు రావాలి. నేను అగినచోటే నా కొలువు అని చెప్పుట జరిగినది. తదుపరి ప్రయాణము కొనసాగించి ఎస్.కోట గ్రామ సమీపమున సుమారు 10కి.మీ.ల దూరమున గల కొట్టాము అగ్రహారము వద్ద ముషిడివనం వద్దకు వచ్చి అచ్చట ఆగిపోవడం జరిగినది. శ్రీ అమ్మవారు అగ్రహారం పండితులకు కలలో కనిపించి, నేను ఇచ్చటకు వచ్చి కొలువై వున్నాను అని చెప్పగా వారు ఆపలుకులను విశ్వసించి మేళ తాళములలో మంగళ వాయిద్యాములతో కొట్టాము అగ్రహారము నుండి సంబరముగా ముషిడివనమునకు వచ్చి శ్రీ అమ్మవారిని గాంచి, అమితానందము చెందిరి. తదుపరి శ్రీ అమ్మవారిని కొటమ్మ అమ్మవారిగా పిలుచుట జరుగుచున్నది. శ్రీ అమ్మవారి కోరిక మేరకు ఒక సంవత్సరము సిరిమాను ఉత్సవము, మరుసటి సంవత్సరము పోతురాజు ఉత్సవముగా జరుపుట అనావాయితీగా వచ్చుచున్నది.
శ్రీ కొటమ్మ అమ్మవారు అప్పటి నుండి ఉత్తరాంద్ర ఇలువేల్పూ దేవతగా ప్రసిద్ది చెంది భక్తులు కోరిన కోరికలను తీర్చుతూ భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుచున్నది.
Morning 6.00 Am to 1.00Pm Evening 4.00 to 7.00Pm
రవాణా ;
Kotabommali is a Town in Kotabommili Mandal in Srikakulam District of Andhra Pradesh State, India. It belongs to Andhra region . It is located 42 KM towards East from District head quarters Srikakulam. It is a Mandal head quarter.
By Road :
Amadalavalasa is the Nearest Town to Kotabommali. Amadalavalasa is 56 km from Kotabommali. Road connectivity is there from Amadalavalasa to Kotabommali.
By Bus :
Tekkali APSRTC Bus Station , Narasannapeta APSRTC Bus Station , Patapatnam(Boarder) APSRTC Bus Station are the nearby by Bus Stations to Kotabommali .APSRTC runs Number of busses from major cities to here.
By Rail :
Harishchandrapuram Rail Way Station , Kotabommali Rail Way Station are the very nearby railway stations to Kotabommali. Also you can consider railway Stations from Near By town Amadalavalasa. Srikakulam Road Rail Way Station , Dusi Rail Way Station are the railway stations near to Amadalavalasa. You can reach from Amadalavalasa to Kotabommali by road after .
By Air:
vISAKHAPATNAM TO SRIKAKULAM (NON-STOP AND ORDANARY AND OTHER PRIVATE SERVICES BUS ARE AVAILABLE ) AND SRIKAKULAM TO KOTABOMMALI CONTINUE SHARING AUTOS AND LOCAL BUS'S AND TAXIES ARE AVAILABLE.
kotabommali temple history telugu, kotabommali, kotabommali temple information, kotabommali temple timings , kotabommali temple location

Comments
Post a Comment